సాక్షి డిజిటల్ న్యూస్ : ఢిల్లీ లిక్కర్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాలను ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. ఢిల్లీ లిక్కర్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాలను ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. అలాగే ఈ కేసులో దర్యాప్తు సంస్థలు అభియోగాలు మోపిన 23 మందికి విముక్తి కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ఎంపీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితకు కూడా భారీ ఊరట లభించింది. ఈ కేసు 2021-22 నాటిది. డిల్లీ అప్ ఆప్ ప్రభుత్వ హయాంలో రూపొందించి ఎక్సైజ్ పాలసీపై తీవ్రమైన ఆరోపణలు వచ్చింది. అయితే గతంలో ఉన్న ఎక్సైజ్ పాలసీతో పోలిస్తే కొత్త విధానం ఎక్కువ ఆదాయం తెచ్చిపెడుతుందని అప్పటి కేజ్రీవాల్ ప్రభుత్వం పేర్కొంది. అయితే ఆ తర్వాత ఈ పాలసీని ఢిల్లీ ప్రభుత్వం రద్దు చేసింది. ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించి అవినీతి, మనీలాండరింగ్ ఆరోపణలకు సంబంధించి సీబీఐ, ఈడీలు కేసులు నమోదు చేసి విచారణ చేపట్టాయి. ఈ క్రమంలోనే అరవింద్ కేజ్రీవాల్ సహా పలువురు ఆప్ నేతలు జైలుకు వెళ్లాల్సి వచ్చింది. తెలంగాణకు చెందిన మాజీ ఎంపీ కవిత కూడా ఈ కేసులో జైలుకు వెళ్లారు. అయితే ఈ కేసులో కేజ్రీవాల్‌తో సహా పలువురు నేతలు అరెస్ట్ కావడం… గత ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీకి ఇబ్బందికర పరిస్థితిగా మారింది. అయితే తాజాగా ఈ కేసులో అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియాలకు ఢిల్లీ కోర్టు క్లీన్ చీట్ ఇచ్చింది. ఎక్సైజ్ పాలసీలో ఎటువంటి కుట్ర లేదా నేరపూరిత ఉద్దేశ్యం లేదని అని కోర్టు పేర్కొంది. దర్యాప్తులో లోపాలపై కోర్టు… సీబీఐని తీవ్రంగా విమర్శించింది. “భారీ ఛార్జిషీట్”లో ఏ సాక్షి లేదా స్టేట్‌మెంట్ ద్వారా మద్దతు ఇవ్వని అనేక లోపాలు ఉన్నాయని పేర్కొంది. వేల పేజీల సీబీఐ ఛార్జిషీట్‌లో సాక్షుల స్టేట్‌మెంట్‌లకు మద్దతు ఇవ్వని అంశాలు ఉన్నాయని కోర్టు పేర్కొంది. ఛార్జిషీట్‌లో “తప్పుదారి పట్టించే వ్యాఖ్యలు” ఉన్నాయని కూడా న్యాయమూర్తి అన్నారు. ఈ క్రమంలోనే అరవింద్ కేజ్రీవాల్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. కోర్టు వెలుపల విలేకరులతో మాట్లాడుతూ… చివరకు సత్యం గెలుస్తుందని తాము ఎల్లప్పుడూ చెబుతున్నామని, ఇప్పుడు అదే జరిగిందని పేర్కొన్నారు. ‘‘ఈరోజు ఈ కేసులోని నిందితులం దరినీ కోర్టు విముక్తి కల్పించింది. నిజం గెలుస్తుందని మేము ఎప్పుడూ చెబుతుంటాము. భారత న్యాయ వ్యవస్థపై మాకు పూర్తి నమ్మకం ఉంది. అమిత్ షా, మోదీ కలిసి ఆప్‌ను అంతం చేయడానికి అతిపెద్ద రాజకీయ కుట్రను పన్నారు. మా పార్టీకి చెందిన 5 మంది పెద్ద నాయకులను జైలులో పెట్టారు. సిట్టింగ్ ముఖ్యమంత్రిని ఇంటి నుండి బయటకు లాగి జైలులో పెట్టారు. కేజ్రీవాల్ అవినీతిపరుడు కాదు. నేను నా జీవితంలో నిజాయితీని మాత్రమే సంపాదించుకున్నాను. ఈరోజు కేజ్రీవాల్, మనీష్ సిసోడియా మరియు ఆప్ నిజాయితీపరులు అని కోర్టు పేర్కొంది…’’ అని కేజ్రీవాల్ తెలిపారు.