2029 ఎన్నికల్లో జగన్ విజయంపై నాని ధీమా

జనం న్యూస్: ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నాయకులు కొడాలి నాని తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నాయకులు కొడాలి నాని తీవ్ర విమర్శలు గుప్పించారు. కూటమి సర్కార్ బెదిరింపులకు వైసీపీ శ్రేణులు భయపడరని అన్నారు. 2029లో వైసీపీ అధినేత వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. మాజీ మంత్రి అంబటి రాంబాబును సోమవారం రోజున కొడాలి నానితో పాటు పలువురు వైసీపీ నేతలు పరామర్శించారు. అనంతరం కొడాలి నాని మీడియాతో మాట్లాడుతూ కూటమి బెదిరింపులకు వైసీపీ శ్రేణులు భయపడరని అన్నారు. కూటమి ప్రభుత్వం అంబటి కుటుంబసభ్యుల్ని తీవ్రంగా ఇబ్బంది పెట్టిందని మండిపడ్డారు. టీడీపీ నేతలు కావాలనే అంబటి రాంబాబును రెచ్చగొట్టారని అన్నారు. అంబటి రాంబాబు క్షమాపణలు చెప్పిన టీడీపీ నేతలు ఆయన ఇంటిపై దాడి చేసి ధ్వంసం చేశారని చెప్పారు. పోలీసుల సమక్షంలో అంబటి రాంబాబు ఇంటిపై దాడి జరిగిందని ఆరోపించారు. నారా లోకేష్‌ రెడ్‌బుక్‌ రాజ్యాంగానికి వైసీపీ భయపడదని పేర్కొన్నారు. 2029లో వైసీపీ అధినేత, వైఎస్‌ జగన్‌ సీఎం కావడం తథ్యమని అన్నారు. ఇదిలాఉంటే, అంబటి రాంబాబును చింతలపూడి నియోజకవర్గానికి చెందిన వైసీపీ నేతలు పరామర్శించారు. గుంటూరులోని అంబటి రాంబాబు నివాసానికి వెళ్లిన నాయకులు, ఇటీవల జరిగిన పరిణామాల నేపథ్యంలో ఆయన ఆరోగ్య పరిస్థితి, పరిస్థితులపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయనకు పార్టీ తరఫున మద్దతు ప్రకటించారు. అనంత‌రం పార్టీ నాయకులు మాట్లాడుతూ అంబటి రాంబాబు పార్టీకి చేసిన సేవలు అపారమని, ప్రజా సమస్యలపై ఎప్పుడూ ముందుండే నాయకుడని గుర్తు చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆయనకు పార్టీ శ్రేణులంతా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఏ పరిస్థితులనైనా ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగాలని సూచించారు. అంబటి రాంబాబు ఈ సందర్భంగా వచ్చిన నాయకులకు కృతజ్ఞతలు తెలియజేశారు. పార్టీ బలోపేతం కోసం కలిసి పనిచేయాలని, ప్రజా సమస్యల పరిష్కారంలో మరింత చురుకుగా ఉండాలని పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *