తిరుమల ఘటనపై టీటీడీ స్పందన

* దివ్వెల మాధురి, తనూజలపై ఫిర్యాదు.

జనం న్యూస్: తిరుమలలో దివ్వెల మాధురి బిగ్‌బాస్ ఫేమ్ తనూజ పుట్టస్వామి పుట్టినరోజు వేడుకలు నిర్వహించడం వివాదాస్పదంగా మారింది. తిరుమల కొండపై ఉన్న ఒక గెస్ట్‌హౌస్‌లో ఈ వేడుకలు నిర్వహించారు. తిరుమల నిబంధనల ప్రకారం కొండపైకి కేక్‌లు తీసుకురావడం, కట్ చేయడం నిషిద్ధం. అయినప్పటికీ నిబంధనలను అతిక్రమించి కేక్ కట్ చేయడమే కాకుండా, ఆ వేడుకలకు సంబంధించిన వీడియోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడంపై టీటీడీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు టీటీడీ విజిలెన్స్ విభాగం ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. తిరుమలలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన వారిపై చర్యలు తప్పవని ఇటీవలే టీటీడీ హెచ్చరించిన సంగతి తెలిసిందే. టీటీడీ పవిత్రతకు భంగం కలిగించేలా ఎవరైనా వ్యవహరిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సున్నితంగా హెచ్చరించింది టీటీడీ. అంతేకాదు తిరుమల పరిసర ప్రాంతాలలో రీల్స్, వీడియోల చిత్రీకరణ వంటివి కూడా నిషేధం అని ప్రకటించింది. అయినప్పటికీ కొందరు రీల్స్ చేస్తూ నిబంధనలు ఉల్లంఘిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా బిగ్‌బాస్ పేమ్స్ దివ్వెల మాధురి, తనూజలు నిబంధనలకు విరుద్ధంగా తిరుమలలో బర్త్ డే సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఈ చర్యలను టీటీడీ ఖండించింది. ఈ మేరకు చర్యలకు సిద్ధమైంది. తిరుమల తిరుపతి దేవస్థానం విజిలెన్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. టీటీడీ నిబంధనలు ఉల్లంఘించిన దివ్వెల మాధురి. బిగ్ బాస్ ఫేమ్ దివ్వెల మాధురి మరోసారి తిరుమల తిరుపతి దేవస్థానం నిబంధనలను ఉల్లంఘించారు.గతంలో దివ్వెల మాధురి, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌లు తిరుమలలో రీల్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ వీడియో విడుదల అవ్వడంతో ఆమెపై కేసు నమోదు అయ్యింది. ఈ కేసుకు సంబంధించి తిరుపతిలోని రెండవ అదనపు మున్సిఫ్ కోర్టులో దివ్వెల మాధురి, దువ్వాడ శ్రీనివాసులు విచారణ ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం మరచిపోకముందే మరోసారి దివ్వెల మాధురి శ్రీవారి సన్నిధిలో నిబంధనలు ఉల్లంఘించారు. తిరుమల కొండపై దివ్వెల మాధురి బిగ్ బాస్ ఫేమ్ తనూజ పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు.కేక్ కట్ చేసిన ఫోటోలను, వీడియోలను దివ్వెల మాధురి సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *