ఏపీలో పదో తరగతి విద్యార్థులకు భారీ ఊరట

* హాల్‌టికెట్ చూపిస్తే ఉచిత బస్సు ప్రయాణం!

జనం న్యూస్: ఏపీలో పదో తరగతి విద్యార్థుల కోసం ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. SSC పరీక్షలకు వెళ్లే విద్యార్థులకు APSRTC బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది.హాల్ టికెట్‌తో SSC విద్యార్థులకు ఫ్రీ బస్ ట్రావెల్ సౌకర్యం కల్పించనున్నట్లు పేర్కొంది. మార్చి 16 నుంచి SSC విద్యార్థులకు APSRTC ఉచిత సౌకర్యం అ మలులోకి వస్తుందని విద్యార్థులు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఏపీఎస్ఆర్టీీ సూచించింది. ఏపీలో పదో తరగతి విద్యార్థులకు ఆర్టీసీ గుడ్‌న్యూస్ తెలిపింది. ఎస్ఎస్‌సీ పదోతరగతి పరీక్షలు రాసేందుకు వెళ్లే విద్యార్థులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నట్లు ఏపీఎస్ఆర్టీసీ పేర్కొంది.హాల్ టికెట్ చూపిస్తే విద్యార్థులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని ప్రకటించింది. పరీక్ష జరిగే అన్ని రోజులు విద్యార్థులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని ఏపీఎస్ఆర్టీసీ తెలిపింది. విద్యార్థులు ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవాలని ఏపీఎస్ఆర్టీసీ సూచించింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. మరోవైపు విద్యార్థుల సౌకర్యార్థం తగిన బస్సులు నడపాలని ఏపీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. అలాగే పరీక్షా రోజుల్లో బస్ పాస్ అడగవద్దు అని సిబ్బందికి సూచించారు. విద్యార్థులకు ఉచిత బస్సు ప్రయాణం రాష్ట్రంలో నిర్వహించనున్న SSC పబ్లిక్ పరీక్షలు–2026కు హాజరయ్యే విద్యార్థుల సౌకర్యార్థం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వ పరీక్షల విభాగం సమాచారం ప్రకారం SSC పరీక్షలు మార్చి 16 నుంచి ఏప్రిల్ ఒకటి వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించబడనున్నాయి. ఈ పరీక్షలకు రాష్ట్రంలో సుమారు 6,42,555 మంది విద్యార్థులు 3,415 పరీక్షా కేంద్రాల్లో హాజరుకానున్నారు. విద్యార్థులు తమ నివాస ప్రాంతం నుండి పరీక్షా కేంద్రాలకు వెళ్లి తిరిగి రావడానికి సౌకర్యంగా ఉండే విధంగా అల్ట్రా పల్లెవెలుగు, పల్లెవెలుగు మరియు సిటీ ఆర్డినరీ బస్సుల్లో హాల్ టికెట్ చూపించిన ఆధారంగా ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పించబడుతుంది. విద్యార్థుల వద్ద బస్ పాస్ లేకపోయినా సిబ్బంది బస్ పాస్ కోసం అడగకూడదని సూచించబడింది. ఈ ఉచిత ప్రయాణ సౌకర్యం పరీక్షా రోజులలో మాత్రమే (16.03.2026 నుండి 01.04.2026 వరకు) అమలులో ఉంటుంది. అలాగే పరీక్షా రోజుల్లో ప్రభుత్వ సెలవులు లేదా సాధారణ సెలవులు ప్రకటించినా కూడా ఈ ఉచిత ప్రయాణ సౌకర్యం అమల్లో ఉంటుంది. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు సంబంధిత జిల్లా విద్యాశాఖ అధికారులతో సమన్వయం చేసుకుని పరీక్షా కేంద్రాలకు తగిన సంఖ్యలో బస్సులు నడపాలని సంబంధిత అధికారులకు సూచించబడింది. ముఖ్యసమాచారం. SSC పరీక్షల కోసం APSRTC కీలక నిర్ణయం, SSC పరీక్షలకు వెళ్లే విద్యార్థులకు APSRTC బస్సుల్లో ఉచిత ప్రయాణం, హాల్ టికెట్‌తో SSC విద్యార్థులకు ఫ్రీ బస్ ట్రావెల్, మార్చి 16 నుంచి విద్యార్థులకు APSRTC ఉచిత సౌకర్యం, SSC పరీక్షల కోసం ప్రత్యేకంగా బస్సులు – APSRTC, హాల్ టికెట్ చూపిస్తే చాలు – ఉచిత ప్రయాణం, పరీక్షా రోజుల్లో విద్యార్థులకు ఉచిత బస్సు సేవలు, 6.42 లక్షల SSC విద్యార్థులకు APSRTC సౌకర్యం, రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థుల కోసం ప్రత్యేక బస్సులు, 3,415 పరీక్షా కేంద్రాలకు వెళ్లే విద్యార్థులకు ప్రత్యేక ఏర్పాట్లు, విద్యార్థుల సౌకర్యార్థం తగిన సంఖ్యలో బస్సులు నడపాలని APSRTC ఆదేశం, పరీక్షా రోజుల్లో బస్ పాస్ అడగవద్దని సిబ్బందికి సూచనలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *