ఏపీలో ఫ్యాక్షన్ రాజకీయాలకు చెక్

* మంత్రి నారా లోకేశ్ కీలక ప్రకటన

సాక్షి డిజిటల్ న్యూస్ : ‘అన్న ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యక నేను 1983లో జన్మించా. నాకు ఊహ వచ్చినప్పటి నుంచి నేను రాజకీయాలను క్లోజ్ గా గమనిస్తూ వచ్చా. అంతకుముందు ఫ్యాక్టన్ రాజకీయాలకు ఏపీ కేరాఫ్ అడ్రస్ గా ఉండేది’అని మంత్రి నారా లోకేశ్ అన్నారు. ఏ పార్టీకి చెందిన వారైనా ఫ్యాక్షన్ రాజకీయాలకు ఫుల్ స్టాప్ పెట్టాలి. ఫ్యాక్షన్ అంటే రాజకీయ హత్యలు. ఒక కుటుంబాన్ని ఆర్థికంగా దెబ్బతీసి, పెద్దదిక్కు లేకుండా చేసి యావత్ కుటుంబాలను రోడ్డుపైకి తేవడమే ఫ్యాక్షనిస్టుల ప్రధాన లక్ష్యం’అని మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. ‘పల్నాడులో బీసీ నాయకుడు తోట చంద్రయ్యను అతి కిరాతకంగా హతమార్చిన ఆనాటి విజువల్స్ ఏపీలోనే కాదు, భారతదేశంలోని చాలామంది ప్రజలు చూశారు. వీడియో రికార్డు కూడా ఉంది. అటువంటి చంద్రయ్య కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని మేము నిర్ణయించాం. ఫ్యాక్షన్ రాజకీయాలకు ఫుల్ స్టాప్ పెట్టేందుకే ఈ బిల్లు తెస్తున్నాం’అని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. ఏపీ పబ్లిక్ సర్వీసు నియామకాల సవరణ బిల్లును మంత్రి లోకేశ్ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ మాట్లాడుతూ… ఈ విషయమై కేవలం టీడీపీలోనే కాకుండా కూటమిలో ఉన్న జనసేన, బీజేపీ నాయకులతో కూడా చర్చించాం. కేబినెట్ లో కూడా పవనన్నతో మాట్లాడితే ఆయన ఇది మంచి నిర్ణయమని అన్నారు. ఫ్యాక్షన్ లో చనిపోయిన వారి కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం కల్పిస్తే, వారి జోలికిరావడానికి ప్రత్యర్థులు భయపడతారని భావించి కేబినెట్ లో చర్చించి ఈ బిల్లు తీసుకువచ్చాం. కేబినెట్ ఆమోదం తెలిపింది. శాసనసభకు తీసుకువచ్చాం. 2025 సెప్టెంబర్ లో ఈ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది’అని మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. ఫ్యాక్షన్‌కి ఫుల్ స్టాప్ పెట్టాలి ‘బీసీ బిడ్డకు ఉద్యోగం ఇవ్వాలని మేం కౌన్సిల్ కు బిల్లు పంపిస్తే కావాలని అక్కడ ముందుకు వెళ్లకుండా అడ్డుకున్నారు. బిల్లును వారు మండలిలో తిరస్కరించినా, నిబంధనలకు లోబడి మేం అసెంబ్లీలో పాస్ చేస్తామని చెప్పాం. కానీ, బిల్లుపై ఏ నిర్ణయం తీసుకోకుండా అక్కడ తొక్కిపట్టారు. దీంతో ఒక బాధ్యతగా భావించి మళ్లీ ఈ బిల్లు శాసనసభకు తీసుకొచ్చాం, దీనిని ఎవరూ ఆపలేరు’అని మంత్రి నారా లోకేశ్ చెప్పుకొచ్చారు. ‘దీనిపై ముందుకు వెళ్లేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఒక్క తోట చంద్రయ్య కుటుంబానికే కాదు, ఏపీలో ఏ కుటుంబానికి ఈ విధంగా అన్యాయం జరగకూడదన్నదే మా లక్ష్యం. ఇది ఒక ఫేవర్, చారిటీ కాదు. ఇది మనందరి బాధ్యత. ఫ్యాక్షన్ కి ఫుల్ స్టాప్ పెట్టాలి. ఇలాంటి కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది’అని మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. అందుకే ఈ బిల్లును శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించాల్సిందిగా మంత్రి లోకేశ్ సహచర శాసన సభ్యులకు విజ్ఞప్తి చేశారు. చంద్రయ్యను దారుణంగా హత్య చేశారు ‘ఏ పార్టీకి చెందిన వారైనా ఫ్యాక్షన్ రాజకీయాలకు ఫుల్ స్టాప్ పెట్టాలి. ఫ్యాక్షన్ అంటే రాజకీయ హత్యలు. ఒక కుటుంబాన్ని ఆర్థికంగా దెబ్బతీసి, పెద్దదిక్కు లేకుండా చేసి యావత్ కుటుంబాలను రోడ్డుపైకి తేవడమే ఫ్యాక్షనిస్టుల ప్రధాన లక్ష్యం’అని మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *