అంబటి రాంబాబుకు భారీ షాక్

*ఆ కేసులో రిమాండ్ పొడిగింపు!

సాక్షి డిజిటల్ న్యూస్ : మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబుకు మరో బిగ్ షాక్ తగిలింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబుకు మరో బిగ్ షాక్ తగిలింది. సత్తెనపల్లిలో సంక్రాంతి సంబరాల లక్కీడ్రా టికెట్ల అవినీతి ఆరోపణలకు సంబంధించిన కేసులో అంబటి రాంబాబును పీటీ వారెంట్ దాఖలు చేసి పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. అనంతరం ఆయనను గురువారం రోజున గుంటూరులోని ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. ఈ క్రమంలోనే అంబటి రాంబాబుకు న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో అంబటి రాంబాబుకు జైలుకు తరలించనున్నారు. దీంతో అంబటి రాంబాబు జైలు నుంచి విడుదల మరింత ఆలస్యం కానుంది. అప్పటి నుంచి జైలులోనే… సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలకు సంబంధించి నమోదైన కేసులో అంబటి రాంబాబును గత నెల 31న పోలీసులు అరెస్ట్ చేసిని సంగతి తెలిసిందే. ఈ కేసులో కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. దీంతో ఆయనను రాజమండ్రి జైలుకు తరలించారు. అయితే ఆ తర్వాత గతేడాది నవంబర్ 12న వైసీపీ చేపట్టిన నిరసనల్లో పాల్గొన్న సమయంలో పట్టాభిపురం పోలీసు స్టేషన్‌లో నమోదైన కేసుకు సంబంధించి పీటీ వారెంట్ దాఖలు చేసిన పోలీసులు అంబటి రాంబాబును అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆయనను రాజమండ్రి జైలు నుంచి గుంటూరుకు తరలించారు. అనంతరం అంబటి రాంబాబును గుంటూరు స్పెషల్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. దీంతో ఇరువాదనల అంబటి రాంబాబుకు 14 రోజులపాటు రిమాండ్ విధిస్తూ స్పెషల్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ తీర్పు ఇచ్చారు. మరోవైపు చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల కేసులో అంబటి రాంబాబుకు బెయిల్‌ మంజూరు అయింది. అయితే పట్టాభిపురం పోలీసు స్టేషన్‌లో నమోదైన కేసులో రిమాండ్ ఉండటంతో అంబటి రాంబాబు జైలులోనే ఉండాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే అంబటి రాంబాబు గుంటూరు కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ బెయిల్ పిటిషన్‌పై విచారణ చేపట్టిన గుంటూరు కోర్టు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు వెల్లడించారు. దీంతో అంబటి రాంబాబు జైలు నుంచి విడుదలకు లైన్ క్లియర్ అయిందని వైసీపీ శ్రేణులు భావించాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *