జనం న్యూస్: ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై మాజీ మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుమల లడ్డూ ప్రసాదం అంశంపై చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్టుగా తెలిపారు. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై మాజీ మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుమల లడ్డూ ప్రసాదం అంశంపై చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్టుగా తెలిపారు. ఆ వ్యాఖ్యలతోనే చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు వాళ్ల పార్టీలకు వారే సమాధి కట్టుకున్నారని అన్నారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేష్ నివాసంపై ఇటీవల దాడి జరగగా తాజాగా శుక్రవారం ఉదయం రోజా ఆయన నివాసానికి వెళ్లారు. జోగి రమేష్‌ను, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్బంగా రోజా మాట్లాడుతూ మాజీ మంత్రి ఇంటిపైనే దాడులకు పాల్పడటం రాష్ట్రంలో భద్రతా పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో చూపిస్తోందని విమర్శించారు. మాజీ మంత్రి ఇంటిపైనే దాడి చేస్తే సాధారణ ప్రజల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చని రోజా అన్నారు. రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. పోలీసుల సమక్షంలోనే దాడులు జరుగుతున్నాయని ఆరోపణలు చేశారు. ‘‘పవన్ కల్యాణ్ ఎప్పటికప్పుడు కొత్త వేషాలు వేసుకుంటున్నాడు. గతంలో తిరుపతి లడ్డూలో జంతు కొవ్వు, ఫిష్ ఆయిల్ కలిసిందని పవన్ కల్యాణ్ మాట్లాడాడు. అయోధ్యకు పంపిన లడ్డూలలో జంతు కొవ్వు కలిసిందని చెప్పాడు. కానీ ఈరోజు తిరుపతి లడ్డూలో జంతుకొవ్వు, పంది కొవ్వు లేదని సీబీఐ చెప్పింది. అయోధ్యకు పంపిన లడ్డూలలో నాణ్యమైన నెయ్యిని వాడారని… జంతు కొవ్వు, పంది కొవ్వు వాడలేదని ప్రత్యేకంగా మెన్షన్ చేసింది. మరి పవన్ కల్యాణ్ ఎన్నిసార్లు హిందూవులకు, వెంకటేశ్వరస్వామి భక్తులకు క్షమాపణ చెప్పాలి. కానీ నిన్న ప్రెస్ మీట్ వాళ్లకే క్షమాపణ చెప్పాలని మాట్లాడుతున్నాడు. మీకెందుకు క్షమాపణ చెప్పాలి?. చంద్రబాబు బూట్లు వేసుకుని పూజలు చేస్తున్నందుకా?, పవిత్రమైన తిరుమల లడ్డూ మీద అబద్దాలు చెప్పినందుకా?.