జనం న్యూస్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీమంత్రి మోత్కుపల్లి నర్సింహులు సంచలన ఆరోపణలు చేశారు. 200 సార్లు ఫోన్ చేసినా రేవంత్ రెడ్డి నాకు అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు అని ఆరోపించారు.వందల కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తూ మా వర్గానికి ఒకటే ఇచ్చారు. అన్నిచోట్ల మా వర్గానికి అన్యాయమే చేశారు కాంగ్రెస్ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. ‘ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 200 సార్లు ఫోన్ చేశాను. కనీసం ఒక్కసారైనా లిఫ్ట్ చేయడం లేదు. అపాయింట్మెంట్ కోసం ఎంతో ప్రయత్నించాను. కానీ అవ్వడం లేదు.రెండున్నరేళ్లుగా కలిసేందుకు ప్రయత్నిస్తున్నా కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదు’అని కాంగ్రెస్ నేత, మాజీమంత్రి మోత్కుపల్లి నర్సింహులు సీఎం రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘మా మాదిగ జాతి సమస్యలు చెప్పుకుందామని రెండున్నరేళ్లుగా ముఖ్యమంత్రిని కలవడానికి ప్రయత్నిస్తున్నాను. కానీ ఆయన దొరకడం లేదు. 200 సార్లు ఫోన్ చేసినా తన ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. చివరికి అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు’అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి, కాంగ్రెస్ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు సంచలన ఆరోపణలు చేశారు. ఒక యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. రెండున్నరేళ్లుగా అపాయింట్మెంట్ దొరకడం లేదు. ‘తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ కోసం పోరాడి అమరులైన వారు ఉన్నారు. ఆ కుటుంబాలను ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ఈ క్రమంలో ఆ కుటుంబాలకు ఆర్థిక సహాయం కోసం అడుగుదామని ప్రయత్నిస్తే సీఎం అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు’అని మాజీమంత్రి, కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ఆరోపించారు. మాదిగలకు ఐదు ఎకరాల భూమి ఇస్తే తాము మాదిగ భవనం నిర్మించుకుంటామని చెప్పుకొచ్చారు.కాంగ్రెస్ రెండున్నరేళ్ల పాలనలో మాదిగ సామాజిక వర్గానికి అన్యాయమే జరిగిందే తప్ప న్యాయం జరగలేదు అని మాజీమంత్రి మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. మా భుజాన మోస్తామని చెప్పా మాదిగ ఎంప్లాయిస్ అసోషియేషన్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సన్మాన సభకు సైతం తనను పిలవలేదు అని మాజీమంత్రి మోత్కుపల్లి నర్సింహులు వాపోయారు. ముఖ్యమంత్రి తనను పిలవలేదు కాబట్టి నిర్వాహకులు కూడా పట్టించుకోలేదేమో అని వాపోయారు. ఇక తన రాజకీయ జీవితం కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతుంది అని చెప్పుకొచ్చారు. ‘ఎంతకాలమైనా ముఖ్యమంత్రి పదవిలో ఉండు. నిన్ను మా భుజాన మోస్తాం అని గతంలో రేవంత్ రెడ్డితో తాను చెప్పానని కానీ ఆయన మాత్రం తనకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదు’అని మాజీమంత్రి మోత్కుపల్లి నర్సింహులు ఆవేదన వ్యక్తం చేశారు.