జనం న్యూస్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు 11 మంది ఉన్నా 1100 మంది ఉన్నట్లు మాట్లాడుతున్నారని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. కానీ ఎందుకో 164 మంది సభ్యులు ఉన్నా కూటమి సభ్యులు ఎందుకో చేసింది చెప్పుకోలేకపోతున్నాం అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. కూటమిలో పార్టీలు కలిసికట్టుగా ఉండాలి అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హితబోధ చేశారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూటమి సభ్యులపై కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ సభ్యులు 11 మంది ఉన్నా 1100 మంది ఉన్నట్లు మాట్లాడుతున్నారని… మనం ఎందుకో చేసింది చెప్పుకోలేకపోతున్నాం అని నిట్టూర్చారు. కూటమిలో పార్టీలు కలిసికట్టుగా ఉండాలి అని హితబోధ చేశారు. కూటమిలో పార్టీలు వేరువేరు సమూహాల నుంచి వచ్చాయి.మరో 15 ఏళ్లు రాష్ట్రం కోసం కలిసి పాటుపడదాం అని కూటమి పార్టీలకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. నేను పార్టీ పరంగా తగ్గి..నేను ఇండివిజ్యూవల్గా సాధించడం కంటే కూడా నేను కోరుకుంది 5 కోట్ల మంది ప్రజల ఆకాంక్షల్ని,ఆశయాల్ని ముందుకు తీసుకువెళ్లాలి అనేది నా తపన. ఇది ఎట్టి పరిస్థితుల్లో చెరిగిపోకూడదు. ఇంకా ముందుకు వెళ్లాలి. ఇప్పుడిప్పుడే రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటున్నాం. మరో 15 ఏళ్లపాటు ఈ అభివృద్ధి ఇలాగే కొనసాగాలి అని ఆకాంక్షించారు. ఇది జరగాలంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి, ప్రభుత్వానికి బలంగా నిలబడాలి అని కోరుకుంటున్నట్లు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అసెంబ్లీలో వ్యాఖ్యానించారు. వైసీపీ విధ్వసంతో 30 ఏళ్లు ఏపీ వెనక్కి ద్రవ్యవినిమయ బిల్లుపై పవన్ కల్యాణ్ అసెంబ్లీలో శుక్రవారం ప్రసంగించారు. ఈ సందర్భంగా మంత్రి పయ్యావుల కేశవ్ అసెబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ ఐదుకోట్ల ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేలా ఉందని వ్యాఖ్యానించారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా 3.32లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టారని పేర్కొన్నారు. సామాజిక భద్రత పెన్షన్ల కోసమే రూ.33వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని వివరించారు. ఇలాంటి పరిస్థితిని తట్టుకోవటం, పథకాలు ఇవ్వటానికి సీఎం చంద్రబాబుకు ఎంతో ధైర్యం ఉండాలంటూ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రశంసించారు. వైఎస్ జగన్ హయాంలో ఆర్థిక విధ్వసం జరిగింది అని ఆంధ్రప్రదేశ్‌ని గందరగోళంలోకి నెట్టివేశారని డిప్యూట సీఎం పవన్ కల్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆర్థిక విధ్వంసం వల్ల ఆంధ్రప్రదేశ్ 30ఏళ్లు వెనక్కు వెళ్లిందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మండిపడ్డారు. ట్రూ అప్ చార్జీలతోపాటు ట్రూడౌన్ చార్జీలు తగ్గించాం. ‘నేను నాటిన చెట్ల ఫలాలు నా కోసం కాదని. భావితరాల కోసం’ అన్న రవీంద్రనాథ్ ఠాగూర్ సూక్తులను డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రత్యేకంగా ప్రస్తావించారు.పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టి బడ్జెట్లో చంద్రబాబు నాయుడు దూరదృష్టి, దక్షత, దార్శనికత అడుగడుగునా ఉందంటూ ప్రశంసించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో చేపట్టిన విద్యుత్ కొనుగోళ్ల కారణంగా డిస్కంలకు రూ.12,250కోట్ల నష్టం వచ్చిందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు. కరెంట్ సరఫరాలో కూడా ఇబ్బందులు వచ్చాయని అసెంబ్లీలో వివరించారు. రూ.1.29 లక్షల కోట్లు విద్యుత్ సంస్థలు నష్టపోయాయని. ఆ భారాన్ని ప్రజలపై మోపారంటూ ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ట్రూఅప్ చార్జీలు రద్దు చేసి ట్రూడౌన్ పేరిట ఛార్జీలు తగ్గించామని డిప్యూటీ సీఎ పవన్ కల్యాణ్ సభలో ప్రస్తావించారు. జలజీవన్ మిషన్‌కు అత్యధిక ప్రాధాన్యత. కూటమి ప్రభుత్వం ఏర్పడే సరికి వైసీపీ ప్రభుత్వం రూ.9లక్షల కోట్ల మేర అప్పుల భారం తమ ప్రభుత్వంపై పడింది అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు. రూ.35వేల కోట్ల బిల్లులను పెండింగ్‌లో పెట్టి వెళ్లారని అందులో రూ.25వేల కోట్లు చెల్లించామని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు. అంతేకాదు కేంద్ర పథకాలకు రాష్ట్ర వాటా రూ.7వేల కోట్లకు పైగా జత చేశామని. గతంలో వైసీపీ రాష్ట్ర వాటా ఇవ్వకపోవటం వల్ల రూ.8,700 కోట్లు జలజీవన్ మిషన్ నిధులు నిరుపయోగమయ్యాయని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.