పయనించే సూర్యుడు న్యూస్ : దేశం కోసం రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే లక్ష్యమని తెలుగు రాష్ట్రాల డీసీసీ అధ్యక్షుల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. వికారాబాద్‌లోని హరిత రిసార్ట్ వేదికగా తెలుగు రాష్ట్రాల డీసీసీ అధ్యక్షుల శిక్షణా ముగింపు సమావేశం నిర్వహించారు. దేశం కోసం రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే లక్ష్యమని తెలుగు రాష్ట్రాల డీసీసీ అధ్యక్షుల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. వికారాబాద్‌లోని హరిత రిసార్ట్ వేదికగా తెలుగు రాష్ట్రాల డీసీసీ అధ్యక్షుల శిక్షణా ముగింపు సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సంఘటన సృజన్ అభియాన్ అనే నామకరణం చేశారు. ఈ క్రమంలో డీసీసీ అధ్యక్షుల పది రోజుల శిక్షణ శిబిరం నిర్వహించారు. ఈ ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాహుల్ గాంధీ, కేసీ వేణు గోపాల్, సీఎం రేవంత్ రెడ్డి విచ్చేశారు. వారికి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, ప్రజా జీవితంలో తానెప్పుడూ పైరవీలు చేయలేదని అన్నారు. గతంలో ప్రజా సమస్యలపై గళం విప్పిన తనపై కేసులు నమోదు చేశారని గుర్తు చేశారు. ఆదివారం కూడా తాను కోర్టుకు వెళ్లి వచ్చానని తెలిపారు. ఈ 19 ఏళ్లలో జడ్పీటీసీ నుంచి సీఎం వరకు అన్ని పదవులు చూశానని తెలిపారు. ఈ క్రమంలో పార్టీ పదవులు సైతం నిర్వహించానని చెప్పుకొచ్చారు. అయితే ఎమ్మెల్యేగా తాను మంచి అనుభవం సంపాదించానని వివరించారు. ఈ క్రమంలో తనపై అనేక కేసులు పెట్టారని, పరువు నష్టం దావాలు కూడా వేశారని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. దేశం కోసం, తమ కోసం రాహుల్ గాంధీ ప్రధాని కావాలని స్పష్టం చేశారు. సోనియా గాంధీ పేరుతో తెలంగాణలో అధికారంలోకి వచ్చామన్నారు. ఐదేళ్లు చేసిన పోరాటాల వల్ల రాహుల్ గాంధీ ప్రధాన ప్రతిపక్ష నేతగా అయ్యారన్నారు. దేశం కోసం రాహుల్ గాంధీ ప్రధాని కావాలని, దేశంలో అనేక సమస్యలపై రాహుల్ గాంధీ పోరాటం చేశారని సీఎం రేవంత్ రెడ్డి అనేక విషయాలను గుర్తు చేశారు. తనపై అనేక కేసులు పెట్టారని.. పరువు నష్టం దావాలు కూడా వేశారని పేర్కొన్నారు. సోనియా గాంధీ పేరుతోనే తెలంగాణలో అధికారంలోకి వచ్చామని వివరించారు. ఐదేళ్లు చేసిన పోరాటాల వల్ల రాహుల్ గాంధీ ప్రధాన ప్రతిపక్ష నేత అయ్యారని వివరించారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ ఇంఛార్జి మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ కౌడ్, ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, ఏఐసీసీ సెక్రటరీ సచిన్ సావంత్ తదితరులు పాల్గొన్నారు. పది రోజులపాటు కొనసాగిన ఈ శిక్షణ శిబిరంలో పార్టీ సంస్థాగత బలోపేతం, నాయకత్వ సామర్థ్యాల అభివృద్ధి, ప్రజలతో అనుసంధానం, ఎన్నికల వ్యూహరచన వంటి అంశాలపై సమగ్ర చర్చలు జరిగాయి. సంఘటన్ సృజన్ ప్రోగ్రాం ఛైర్మన్ సచిన్ రావ్ ఆధ్వర్యంలో ఆర్గనైజింగ్ సెక్రటరీ చల్లా వంశీ చందర్ రెడ్డి, ఎమ్మెల్యే పరిగి రాంమోహన్ రెడ్డి నేతృత్వంలో ఈ శిబిరం సమర్థవంతంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమం ముగిసిన అనంతరం వికారాబాద్ నుంచి హెలికాప్టర్లో హైదరాబాద్‌కు రాహుల్ గాంధీ బయలుదేరి వెళ్లారు.