జనం న్యూస్: లోక్‌సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనకు రానున్నారు. ఈ నెల 2వ తేదీన రాహుల్ గాంధీ తెలంగాణలో పర్యటించనున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. లోక్‌సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనకు రానున్నారు. ఈ నెల 2వ తేదీన రాహుల్ గాంధీ తెలంగాణలో పర్యటించనున్నారు. వికారాబాద్‌లో జరుగుతున్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ డీసీసీ అధ్యక్షుల శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరవుతారు. . ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కాంగ్రెస్ వర్గాల సమాచారం ప్రకారం రాహుల్ గాంధీ సోమవారం ఉదయం శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో వికారాబాద్‌కు వెళతారు. అక్కడ జరిగుతున్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు చెందిన జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షులతో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో ప్రసంగించనున్నారు. అంతకంటే ముందు రాహుల్ గాంధీ డీసీసీ నాయకుల కుటుంబ సభ్యులతో మాట్లాడటంతో పాటు, వారితో కలిసి ఫొటోలు దిగనున్నారు. ఈ సమావేశంలో రాహుల్ గాంధీ పార్టీని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేయడానికి సంబంధించి డీసీసీ అధ్యక్షులకు దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే ప్రత్యర్థి పార్టీల ప్రచారాన్ని ఎదుర్కొవడంపై కూడా సూచనలు చేసే అవకాశం ఉంది. పార్టీ సిద్దాంతాలకు కట్టుబడి పనిచేయాలని, ప్రజలతో మమేకం కావాలని కూడా పార్టీ శ్రేణులకు రాహుల్ గాంధీ దిశానిర్దేశం చేయనున్నారు. అయితే తెలంగాణలో రెండు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలకు జరగనున్న నేపథ్యంలో ఆ స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికకు సంబంధించి రాహుల్ గాంధీతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ చర్చించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక, రాహుల్ గాంధీ పర్యటనలో ఇటీవల లొంగిపోయిన మావోయిస్ట్ మాజీ అగ్రనేతలను కలవనున్నారు. మరోవైపు రాహుల్ గాంధీ పర్యటన దృష్ట్యా వికారాబాద్ హరిత హోటల్ పరిసరాల్లో పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు.