సీఎస్‌గా సాయిప్రసాద్ బాధ్యతలు చేపట్టారు

* ప్రభుత్వం కీలక నిర్ణయాలకు సిద్ధం.

జనం న్యూస్: ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా జి.సాయిప్రసాద్ శనివారం ఉదయం బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుత సీఎస్ కె. విజయానంద్ ఉద్యోగ విరమణ అనంతరం నూతన సీఎస్ సాయిప్రసాద్ ను నియమిస్తూ ప్రభుత్వం గతేడాది నవంబరు 29వ తేదీన ఉత్తర్వులు జారీ చేసింది.ఈ నేపథ్యంలో జీ సాయిప్రసాద్ శనివారం ఉదయం 11:33 గంటలకు నూతన సీఎస్‌గా బాధ్యతలు చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా జి.సాయి ప్రసాద్ బాధ్యతలు చేపట్టారు. వెలగపూడి సచివాలయంలో శనివారం ఉదయం 11:33గంటలకు బాధ్యతలు స్వీకరించారు. తొలుత ఇప్పటి వరకు సిఎస్ గా పని చేసిన కె.విజయానంద్ శనివారం పదవీ విరమణ చేస్తుండడంతో ఆయన నుండి సాయి ప్రసాద్ సీఎస్‌గా గా బాధ్యతలు స్వీకరించారు. కే విజయానంద్ పదవీ విరమణ అనంతరం జీ సాయిప్రసాద్‌ను తదుపరి సీఎస్‌గా నియమిస్తూ గత ఏడాది నవంబర్‌ 29న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. సీఎస్‌గా బాధ్యతలు స్వీకరించిన జీ సాయిప్రసాద్‌ను ముందుగా తిరుమల తిరుపతి దేవస్థానం, విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానాల వేద పండితుల ఆశ్వీర్వచనాలు అందజేశారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు ఎస్.ఎస్.రావత్, యం.టి.కృష్ణ బాబు,ఎక్స్ అఫిషియో స్పషల్ సిఎస్ బి.రాజశేఖర్, ముఖ్య కార్యదర్శులు శ్యామల రావు, ముఖేశ్ కుమార్ మీనా, కాంతిలాల్ దండే, పలువురు కార్యదర్శులు, వివిధ శాఖాధిపతులు, రాష్ట్ర సచివాలయం సహా వివిధ ఉద్యోగ సంఘాల ప్రతినిథులు సీఎస్ జీ సాయిప్రసాద్‌కు పుష్ప గుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన జీ సాయిప్రసాద్‌కు 20 సూత్రాల కార్యక్రమం అమలు చైర్మన్ లంకా దినకర్ సహా వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు సిఎస్ సాయి ప్రసాద్‌కు శుభా కాంక్షలు తెలిపారు. 1991 ఐఏఎస్‌ బ్యాచ్‌కు చెందిన సాయి ప్రసాద్. 1991 ఐఏఎస్ బ్యాచ్ ఏపీ క్యాడర్‌కు చెందిన సాయి ప్రసాద్ ఎంటెక్ పట్టభద్రులు కాగా 1991 సెప్టెంబరు 15న ఐఏఎస్‌కు ఎంపికయ్యారు. 1992 జూన్ నుండి 1993 మే వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వరంగల్ అసిస్టెంట్ కలెక్టర్‌గా పని చేశారు. అనంతరం 1993 సెప్టెంబరు నుండి 1995 ఏప్రిల్ వరకు పాడేరు అసిస్టెంట్ కలెక్టర్‌గా,1995 ఆగస్టు నుండి 1997 మార్చి వరకు గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కమీషనర్ గా పని చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *