రేవంత్ రెడ్డి! మళ్ళీ నువ్వు చిప్పకూడు తినే టైం వస్తుంది

*కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు

సాక్షిడిజిటల్ న్యూస్ : ‘రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి వాళ్లకు ఒక నీతి, ప్రతిపక్షంలో ఉన్నాము కాబట్టి మాకు ఒక నీతి అనే విషయాన్ని డీజీపీ తెలియజేయాలి. డీజీపీ గానీ, రేవంత్ రెడ్డి గానీ అధికారం ఎవడికీ శాశ్వతం కాదన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. రానున్న రెండు సంవత్సరాల్లో కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారు, రాష్ట్రంలో గులాబీ జెండా ఎగురుతుంది. కచ్చితంగా మీ అరాచకాలకు అప్పుడు తగిన శిక్షను అనుభవిస్తారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి మళ్లీ జైలుకెళ్లడం ఖాయం అని అన్నారు.‘ఒక్కటి మాత్రం గుర్తు పెట్టుకో రేవంత్ రెడ్డి, మళ్ళీ నువ్వు చిప్పకూడు తినే టైం వస్తుంది. తప్పకుండా ఆ రోజు నువ్వు తగిన శిక్షను అనుభవిస్తావు’అంటూ శాపనార్థాలు పెట్టారు. ఆదిలాబాద్ జిల్లా జైలులో ఉన్నమాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌తోపాటు ఇతర పార్టీ నేతలను ములాఖత్ ద్వారా కేటీఆర్ పరామర్శించారు. అనంతరం జైలు బయట కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.‘రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల్లో ఎన్ని అరాచకాలు చేసినా కాంగ్రెస్ పార్టీకి,బీజేపీకి ప్రజలు బుద్ధి చెప్పారు. మా పార్టీ అభ్యర్థులను బెదిరించడం, భయపెట్టడం, దాడులు చేయడం కాంగ్రెస్ పార్టీ చేసింది. ఇదే కాకుండా ప్రజలు ఇచ్చిన తీర్పును అపహాస్యం చేసే విధంగా అనేక మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ చేసిన అరాచకాలను, దుర్మార్గాలను మొత్తం రాష్ట్రం గమనించింది’అని కేటీఆర్ చెప్పుకొచ్చారు. క్యాతన్‌పల్లిలో ప్రజాతీర్పు అపహాస్యం ‘మంచిర్యాల జిల్లా క్యాతన్‌పల్లి మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీకి 10 స్థానాలు, మాతో పొత్తులో ఉన్న సిపిఐ పార్టీకి 4 స్థానాలు వచ్చాయి. అంటే మెుత్తం 14 స్థానాల్లో గెలుపొందాం.కాంగ్రెస్ కేవలం 7 స్థానాల్లోనే గెలుపొందింది.అత్యధిక స్థానాల్లో తాము గెలుపొందినా మున్సిపల్ చైర్మన్‌ పదవిని చేజిక్కకుండా కాంగ్రెస్ పార్టీ అరాచకాలు చేసింది’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. కేవలం ఏడు స్థానాలు గెలిచి అప్రజాస్వామికంగా ఆ మున్సిపాలిటీని దక్కించుకునే అధికార దాహం, కక్కుర్తి కాంగ్రెస్ పార్టీ చూపించింది అని మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచన మేరకు స్థానిక మంత్రి వివేక్ దురాగతాలు, అధికార యంత్రాంగం పూర్తిగా అరాచకంగా ప్రవర్తించి ప్రజలు ఇచ్చిన తీర్పును అపహాస్యం చేశారు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *