జనం న్యూస్: వంగవీటి రంగా కుమార్తె వంగవీటి ఆశాలత తన రాజకీయ భవిష్యత్తుపై కీలక కామెంట్స్ చేశారు. తాను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై వంగవీటి ఆశాలత స్పందించారు. వంగవీటి రంగా కుమార్తె వంగవీటి ఆశాలత తన రాజకీయ భవిష్యత్తుపై కీలక కామెంట్స్ చేశారు. తాను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై వంగవీటి ఆశాలత స్పందించారు. విజయవాడ నుంచి అహోబిలం పుణ్యక్షేత్రానికి వెళ్తూ మార్కాపురం జిల్లా కంభంలోని కాపు నేతలతో మాట్లాడిన ఆశాలత. తన రాజకీయ ప్రవేశం గురించి మాట్లాడారు. రాజకీయాలపై తాను అప్పుడే ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. వంగవీటి రంగా అభిమానుల కోసం రాధా రంగా మిత్ర మండలిని నడుపుతున్నానని తెలిపారు. తన రాజకీయ నిర్ణయానికి. రాధా రంగా మిత్ర మండలికి ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. రాధా రంగా మిత్రమండలిలో అన్ని పార్టీలు, కులాలు, మతాల వారు ఉన్నారని చెప్పారు. కొంతకాలంగా తన రాజకీయ ప్రవేశంపై ఊహాగానాలు వస్తున్నాయని, కొందరు కావాలనే సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని ఆశాలత అన్నారు. అయితే తన రాజకీయ భవిష్యత్తులపై వస్తున్న ఇలాంటి తప్పుడు వార్తలను నమ్మవద్దని వంగవీటి రంగా అభిమానులకు, ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నట్టుగా ఆశాలత తెలిపారు. తాను ప్రస్తుతం రాధా రంగ మిత్ర మండలిని ఏకతాటిపైకి తీసుకొచ్చి బలోపేతం చేయడంపై దృష్టి పెట్టానని చెప్పారు. తాను రాజకీయాల్లోకి వెళ్లేందుకు ఇంకా చాలా సమయం ఉందని.. ఇప్పుడంత తొందరేం లేదని ఆశాలత స్పష్టం చేశారు. వంగవీటి మోహన రంగా ఆశయాలకు అనుగుణంగా నడుచుకుంటామని భవిష్యత్తులో తన రాజకీయ ప్రస్థానం గురించి మాట్లాడుతానన్నారు. అనంతరం ఆమె అహోబిలం బయలుదేరి వెళ్లారు. ఇక, వంగవీటి రంగ మరణం తర్వాత ఆయన భార్య రత్నకుమారి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత వంగవీటి రంగా కుమారుడు వంగవీటి రాధా 2004లో విజయవాడ తూర్పు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు.