తెలంగాణ రాజకీయాల్లో ఉద్రిక్తత

* బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు అరెస్ట్.

జనం న్యూస్: తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు. తార్నాకలోని తన నివాసం నుంచి కామారెడ్డి వెళ్లేందుకు బయలుదేరుతుండగా పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు రావును పోలీసులు అరెస్ట్ చేశారు. కామారెడ్డి వెళ్లేందుకు బయలుదేరిన ఆయనను పర్మిషన్ లేదని పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో తార్నాకలోని ఆయన ఇంటివద్దకు భారీగా బీజేపీ కార్యకర్తలు చేరుకోవడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అయితే కామారెడ్డి వెళ్లి తీరుతానని రాంచందర్ రావు బయలుదేరారు. దీంతో రాంచంద్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు. అడ్డుకున్న బీజేపీ కార్యకర్తలను సైతం పోలీసులు అడ్డుకున్నారు. రాంచందర్ రావుతోపాటు పలువురు బీజేపీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు.ఇదిలా ఉంటే ఎవరూ కామారెడ్డి వెళ్లకుండా పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. బీజేపీ ముఖ్య నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. ఇదిలా ఉంటే కామారెడ్డిలో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టుగా వాతావరణం కనిపిస్తోంది.నేతలు సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకుంటున్నారు. ఈ క్రమంలో బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి , కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీకి బహిరంగ సవాల్ చేశారు. కలెక్టరేట్ వద్ద అన్ని విషయాలు తేల్చుకుందామని సవాల్ విసిరారు. ఈ ఉద్రిక్తత నేపథ్యంలోనే రాంచందర్ రావు కామారెడ్డికి వెళ్లేందుకు ప్రయత్నించగా ఉదయం నుండి ఆయన ఇంటివద్ద పోలీసులు మోహరించి చివరకు అరెస్ట్ చేశారు. బీజేపీ చీఫ్ అరెస్టును ఖండించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ బీజేపీ చీఫ్ రాంచంద‌ర్ రావు అరెస్ట్‌పై కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాంచందర్ రావు అరెస్ట్‌ను ఖండించారు. కామారెడ్డిలో నెల‌కొన్న ప‌రిస్థితుల‌పై కిష‌న్ రెడ్డి ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. తెలంగాణ‌లో ప్ర‌జాస్వామ్యాన్ని ప్ర‌భుత్వం దెబ్బ‌తీస్తోంద‌ంటూ మండిపడ్డారు.ఎమ్మెల్యే వెంక‌ట‌ర‌మ‌ణ రెడ్డిపై కాంగ్రెస్ ప్రభుత్వం క‌క్ష సాధింపు చ‌ర్య‌ల‌కు పాల్పడుతుంది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస ప్ర‌భుత్వం ప్ర‌తీకార రాజ‌కీయాలు చేస్తోంద‌ని ఇకనైనా మానుకోవాలని కేంద్రమంత్రి కిష‌న్ రెడ్డి సూచించారు. ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా రాంచందర్ రావుఅరెస్ట్: ఈటల రాజేందర్ కామారెడ్డికి వెళ్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావును పోలీసులు అరెస్ట్ చేయడాన్ని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ తీవ్రంగా ఖండించారు. రాష్ట్ర అధ్యక్షుడిగా తన పార్టీ ఎమ్మెల్యేకు సంఘీభావం తెలపడానికి వెళ్లడం కూడా నేరమా అని ప్రశ్నించారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఇదే తరహా అరెస్టులతో ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసిందని. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి అదే విధానాన్ని అనుసరిస్తున్నారంటూ మండిపడ్డారు.ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన ప్రభుత్వమే ప్రతిపక్షాలపై ఆంక్షలు విధించడం ఏమాత్రం సరికాదు అని అన్నారు.మరోవైపు కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణరెడ్డికి సంఘీభావం తెలిపేందుకు వెళ్తున్న బీజేపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలను హౌస్ అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఈటల రాజేందర్ అభిప్రాయపడ్డారు. తెల్లవారు జాము నుంచే రాంచందర్ హౌస్ అరెస్ట్ కామారెడ్డిలో చోటు చేసుకున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో నేడు చలో కామారెడ్డికి తెలంగాణ బీజేపీ పిలుపు ఇచ్చిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో బాన్సువాడ, కామారెడ్డిలోపర్యటించేందుకు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు ప్రయత్నించారు.దీంతో పోలీసులు రాంచందర్ రావు ఇంటికి చేరుకుని ఆయనను హౌస్ అరెస్ట్ చేశారు. తెలంగాణ బీజేపీ చీఫ్ రాంచందర్ రావుతోపాటు ముఖ్య నేతల ఇళ్ల దగ్గర పోలీసుల మోహరించారు.కామారెడ్డికి వెళ్లకుండా ముందస్తు హౌస్‌ అరెస్ట్‌లు చేస్తున్నారు. పోలీసుల హౌస్ అరెస్టులపై టీ బీజేపీ చీఫ్ రాంచందర్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ నేతలను పోలీసులు గృహనిర్బంధం చేయడం రేవంత్ రెడ్డి ప్రభుత్వ భయాన్ని బహిర్గతం చేస్తోంది అని టీ బీజేపీ చీఫ్ రాం చందర్ రావు విమర్శించారు. అరెస్టులతో ఆపలేరు. నిర్బంధాలతో అడ్డుకోలేరు అని హెచ్చరించారు. ప్రశ్నించే గొంతుకను చూసి ఎందుకు ఈంత భయం? ప్రజల సమస్యలపై నిలబడే నాయకుడిని అడ్డుకోవడం ప్రజాస్వామ్యానికి అవమానం. ఈ పిరికిపంద చర్యలను తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు అని టీ బీజేపీ చీఫ్ రాం చందర్ రావు చెప్పుకొచ్చారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా బాన్సువాడ వెళ్తా: రాంచందర్ రావు. ‘కామారెడ్డిలో బీజేపీ ఎమ్మెల్యే కార్యాలయంపై దాడి చేశారు.బాన్సువాడ వెళ్లకుండా నన్ను హౌస్ అరెస్ట్ చేశారు.బాన్సువాడలో మా ఎమ్మెల్యేపై దాడి జరిగింది’అని టీ బీజేపీ చీఫ్ రాం చందర్ రావు ఆరోపించారు.‘మా ఎమ్మెల్యేపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారు. ప్రశ్నిస్తే కాంగ్రెస్ నేతలు దాడి చేస్తున్నారు. కాంగ్రెస్‌ నేతలే కారు ధ్వంసం చేసి…బీజేపీ నేతలపై ఆరోపణలు చేస్తున్నారు’అని రాంచందర్ మండిపడ్డారు.‘మా కార్యకర్తలు మా కోసం ఎదురుచూస్తున్నారు.ఎట్టి పరిస్థితుల్లో బాన్సువాడ వెళ్లి తీరుతాం.ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా వెళ్లడం ఖాయం’ అని తెలంగాణ బీజేపీ చీఫ్‌ రాంచందర్‌రావు స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *