అమరావతి క్వాంటం వ్యాలీపై ప్రపంచ దృష్టి

*సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

సాక్షి డిజిటల్ న్యూస్ : రాబోయే రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అద్భుతాలను సాధిస్తుందన్న విశ్వాసం ఉంది అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు.ఆంధ్రప్రదేశ్‌ను భవిష్యత్ టెక్నాలజీ రంగంలో ఛాంపియన్‌గా నిలిపేలా రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. అమరావతిని క్వాంటం వ్యాలీగా అభివృద్ధి చేసే ప్రక్రియలో భాగంగా అమరావతి క్వాంటం కంప్యూటింగ్ సెంటర్ నిర్మాణానికి శంకుస్థాపన చేసింది. గూగుల్ లాంటి సంస్థల రాకతో ఏపీలోని విశాఖపట్నం ఏఐ డేటా హబ్‌గా మారుతుంది అని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు.సమీప భవిష్యత్‌లో అమరావతి క్వాంటం వ్యాలీ గురించి ప్రపంచం అంతా మాట్లాడే రోజు వస్తుంది అని చెప్పుకొచ్చారు.‘వరల్డ్ ఎకనామిక్ ఫోరం నిర్వహిస్తున్న కృత్రిమ మేధస్సు ద్వారా పోటీతత్వం అంశంపై జరుగుతున్న రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్‌కు హాజరైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక ప్రసంగం చేశారు. ప్రపంచానికి క్వాంటం కంప్యూటింగ్‌కు సంబంధించిన పరికరాలను కూడా తయారు చేసేలా క్వాంటం ఎకో సిస్టం రూపకల్పన చేయాలని సూచించారు. దేశాన్ని అగ్రస్థానంలో నిలబెట్టాలన్న ఆకాంక్షతో ప్రధాని మోడీ పనిచేస్తున్నారు. దేశం దానిని సాధించి తీరుతుంది అని సీఎం చంద్రబాబు నాయుుడు విశ్వాసం వ్యక్తం చేశారు. ఏఐ అద్భుతాలు సృష్టిస్తోంది రాబోయే రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అద్భుతాలను సాధిస్తుందన్న విశ్వాసం ఉంది అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. పౌరులందరికీ ప్రయోజనం కలిగేలా సావరిన్ ఏఐ ని వినియోగించేందుకు ప్రభుత్వ పరంగా ప్రయత్నం చేస్తున్నాం అని చెప్పుకొచ్చారు. డీపీ టెక్నాలజీ రంగంలో మరింత ముందుకు వెళ్లేలా ఏపీ దృష్టి సారిస్తోంది అని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో స్పేస్, డ్రోన్, ఎలక్ట్రానిక్స్, మెడ్‌టెక్ పార్క్ లాంటి ప్రత్యేక పారిశ్రామిక క్లస్టర్లు ఉన్నాయని చెప్పుకొచ్చారు. ఈ రంగాల్లో పెద్దఎత్తున పెట్టుబడులను ఆకర్షించటంతో పాటు… క్వాంటం ఎకోసిస్టంను తీర్చిదిద్దుతున్నాం అని సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సుకు సీఎం చంద్రబాబు నాయుడుతోపాటు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్, వరల్డ్ ఎకనామిక్ ఫోరం సీఈఓ బోర్కే బ్రెండే‌సైతం పాల్గొన్నారు. టెక్నాలజీ రంగంలో ఛాంపియన్‌గా ఏపీని తీర్చిదిద్దుతాం ఆంధ్రప్రదేశ్‌ను భవిష్యత్ టెక్నాలజీ రంగంలో ఛాంపియన్‌గా నిలిపేలా రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. అమరావతిని క్వాంటం వ్యాలీగా అభివృద్ధి చేసే ప్రక్రియలో భాగంగా అమరావతి క్వాంటం కంప్యూటింగ్ సెంటర్ నిర్మాణానికి శంకుస్థాపన చేసింది. ఈ క్రమంలో ఢిల్లీలోని భారత మండపంలో జరుగుతున్న ఇండియా-ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ లో రాష్ట్ర ప్రభుత్వం ఏడు ఒప్పందాలు కుదుర్చుకుంది. ఐబీఎం సహా వివిధ ప్రముఖ సంస్థలతో కుదుర్చుకున్న ఈ ఒప్పందాలు సీఎం చంద్రబాబు సమక్షంలో కుదిరాయి. ఏపీలో క్వాంటం-ఏఐ రంగాల్లో నైపుణ్యాభివృద్ధి, మౌలిక వసతుల కల్పన దిశగా ఈ ఒప్పందాలు ఉపయోగపడ నున్నాయి. ఏపీని క్వాంటం-ఏఐ హబ్ గా తీర్చిదిద్దడం అమరావతిలోని క్వాంటం వ్యాలీకి జాతీయ, అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తేవడానికి, ఏపీలో ఏఐ-క్వాంటం ఎకో సిస్టం పెంపొందించడానికి బాటలు వేసేలా ఈ ఏడు ఎంఓయులను ప్రభుత్వం కుదుర్చుకుంది. అలాగే భవిష్యత్ టెక్నాలజీని అందిపుచ్చుకునేలా విద్యార్థులు, యువతకు ఏఐ-క్వాంటం రంగాల్లో శిక్షణ ఇవ్వనున్నారు. ప్రభుత్వ శాఖల్లో ఏఐ-క్వాంటం వినియోగం, టెక్నాలజీ ద్వారా ప్రజలకు సేవలను సులభతరం చేయడం వంటి అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారించింది. వైజర్ సంస్థతో ఒప్పందం అమరావతి క్వాంటం వ్యాలీలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేసేలా వైజర్ సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఈ ఏడాది చివరి నాటికి 3.50 లక్షల మంది ఏఐ-క్వాంటం లెర్నర్లు, 2027 నాటికి 6 లక్షల మందిని సిద్ధం చేసేలా ఈ ఒప్పందం ఉంది. ఈ ఎంఓయూలో క్వాంటం సొల్యూషన్స్ హెడ్ వర్ధన్ సెహగల్, రాజ్ వట్టికూటి బృందం పాల్గొంది. ఏపీలో ఏఐ ట్యూటర్ ఏర్పాటు కోసం ఐఐటీ మద్రాస్‌తో ఒప్పందం ఏపీలో ఏఐ ట్యూటర్ ఏర్పాటు అంశంపై ఐఐటీ మద్రాస్ తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాల విద్యార్థుల కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ట్యూటర్ ను అందుబాటులోకి తీసుకువచ్చేలా ఎంఓయూ కుదిరింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *