కరీంనగర్ కార్పొరేషన్‌పై బీజేపీ విజయం

* కొత్త మేయర్‌, డిప్యూటీ మేయర్ బాధ్యతలు.

జనం న్యూస్:జగిత్యాల మున్సిపాలిటీ చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్‌ ఎన్నికకు సంబంధించి కొనసాగుతున్న ఉత్కంఠకు కాంగ్రెస్ అధిష్టానం తెరదించింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. జగిత్యాల మున్సిపాలిటీ చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్‌ ఎన్నికకు సంబంధించి కొనసాగుతున్న ఉత్కంఠకు కాంగ్రెస్ అధిష్టానం తెరదించింది. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వర్గానికి చైర్‌పర్సన్, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి వర్గానికి వైస్ చైర్‌పర్సన్ పదవి ఇవ్వాలని నిర్ణయించింది. వివరాలు జగిత్యాలలో తాజా ఎమ్మెల్యే సంజయ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిల మధ్య వర్గపోర కాంగ్రెస్ అధిష్టానానికి ఇబ్బందికరంగా మారిన సంగతి తెలిసింది. ఇటీవలి మన్సిపల్ ఎన్నికలలో కూడా సంజయ్ కుమార్, జీవన్ రెడ్డి చెందిన పలువురికి టికెట్లు కేటాయించగా పలుచోట్లు ఇరువురు నేతలకు చెందిన మద్దతుదారులు రెబల్స్‌గా బరిలో నిలిచారు. జగిత్యాల మున్సిపాలిటీలో మొత్తం 50 స్థానాలు ఉండగా కాంగ్రెస్ 23 చోట్ల, బీజేపీ 6 చోట్ల, బీఆర్ఎస్ 4 చోట్ల, ఎంఐఎం రెండు చోట్ల, స్వతంత్రులు 15 చోట్ల విజయం సాధించారు. కాంగ్రెస్‌కు సంబంధించి ఎమ్మెల్యే సంజయ్ వర్గం నుంచి 33 మంది పోటీ చేయగా 14 మంది విజయం సాధించారు. అదే సమయంలో జీవన్ రెడ్డి వర్గం నుంచి 17 మంది పోటీ చేయగా, 9 మంది గెలుపొందారు. ఇక, స్వతంత్రుల విషయానికి వస్తే జీవన్ రెడ్డి వర్గానికి చెందిన 9 మంది, సంజయ్ కుమార్ వర్గానికి చెందిన నలుగురు ఉన్నారు. దీంతో జగిత్యాల చైర్‌పర్సన్ పీఠం కాంగ్రెస్‌ పార్టీ ఖాతాలో చేరడం ఖాయంగానే కనిపించినప్పటికీ జీవన్ రెడ్డి, సంజయ్‌ల మధ్య విబేధాలతో ఉత్కంఠ నెలకొంది. దీంతో కాంగ్రెస్ అధిష్టానం రంగంలోకి దిగింది. ఈ సమస్యను పరిష్కరించాల్సిందిగా. ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్, జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌లకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. దీంతో వారు వేర్వేరుగా జీవన్ రెడ్డి, సంజయ్ కుమార్‌లతో చర్చలు జరిపారు. చాలా కాలంగా పార్టీ కోసం పనిచేస్తున్న నాయకుడికి చైర్మన్ పదవి ఇవ్వాలని జీవన్ రెడ్డి పట్టుబట్టినట్లు సమాచారం. చైర్మన్ పదవి ఒక వర్గానికి, వైస్ చైర్మన్ పదవి మరొక వర్గానికి వెళ్తుందని హామీ ఇచ్చిన తర్వాత ఇద్దరు నాయకులు ఒప్పుకున్నారని తెలిసింది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ అధిష్టానం రాజీ ఫార్ములాను రూపొందించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *