అమరావతి నిర్మాణంపై బిల్ గేట్స్ ప్రశంసలు

* సీఎం చంద్రబాబు విజన్‌కు గుర్తింపు.

జనం న్యూస్: ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి సచివాలయంలో ఆర్టీజీఎస్ కేంద్రాన్ని గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ సందర్శించారు. ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి పాలనలో టెక్నాలజీ వినియోగాన్ని బిల్ గేట్స్ పరిశీలించారు. వెలగపూడి సచివాలయంలోని రియల్ టైమ్ గవర్నెన్సు కేంద్రాన్ని గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ సందర్శించారు. ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి ప్రభుత్వ పాలనలో టెక్నాలజీ వినియోగంపై ఆరా తీశారు. ఈ సందర్భంగా రియల్ టైమ్ గవర్నెన్సు ద్వారా పౌర సేవల్ని వేగంగా అందిస్తున్న తీరు..దాని ద్వారా సాధిస్తున్న ఫలితాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్, ఆయన బృందానికి వివరించారు. డేటాలేక్, అవేర్ 2.0, వాట్సప్ గవర్నెన్స్, సంజీవని ప్రాజెక్టు, రాజధాని అమరావతి ప్రాజెక్టుల గురించి బిల్ గేట్స్ అడిగి తెలుసుకున్నారు. అలాగే ఆర్టీజీఎస్‌లోని డిస్ ప్లే వాల్స్‌పై ప్రజంటేషన్లను బిల్ గేట్స్ ఆసక్తిగా పరిశీలించారు. డేటా లేక్ ద్వారా అన్ని ప్రభుత్వ శాఖలను అనుసంధానించామని సీఎం చంద్రబాబు నాయుడు వివరించగా డేటా లేక్, వాట్సప్ గవర్నెన్స్ ద్వారా పౌర సేవల్ని సులభతరం చేయడం బాగుందని బిల్ గేట్స్ కితాబిచ్చారు. ప్రాపర్టీ రికార్డుల భద్రతపై గేట్స్ ఆరా అవేర్ 2.0 ద్వారా రియల్ టైమ్‌లో సమారాచాన్ని సేకరించి, వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నట్టు బిల్‌గేట్స్‌కు సీఎం చంద్రబాబు నాయుడు వివరించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, పాలసీల అమలుపై ప్రజాభిప్రాయం సేకరిస్తున్న తీరును కూడా బిల్ గేట్స్ పరిశీలించారు. కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ ద్వారా జీఎస్డీపీ పెరుగుదలను ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నట్టు ముఖ్యమంత్రి తెలిపారు. ప్రాపర్టీ రికార్డుల భద్రతకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారని బిల్ గేట్స్ పరిశీలించగా బ్లాక్ చెయిన్ టెక్నాలజీతో ల్యాండ్ రికార్డులు భద్రపరుస్తున్నామని అలాగే, భూ రికార్డులపై క్యూఆర్ కోడ్ వంటి విధానాలతో పారదర్శకంగా ఉండేలా చర్యలు తీసుకున్నామని అధికారులు గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్‌కు వివరించారు. ట్యాక్స్ కలెక్షన్ ప్రక్రియకు కితాబు ‘ట్యాక్స్ కలెక్షన్ ప్రక్రియ అద్భుతంగా ఉందన్న గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్‌ గేట్స్ ప్రశంసించారు. జీఎస్టీ విధానంతో దేశంలో పన్నుల వసూళ్లు కూడా గణనీయంగా పెరిగిందని సీఎం చంద్రబాబు నాయుడు వివరించారు.‘తమ గేట్స్ ఫౌండేషన్ సహకారంతో చిత్తూరు జిల్లాలో నడుస్తున్న సంజీవని ప్రాజెక్టు అమలు గురించి అడిగి తెలుసుకున్నారు. బ్లడ్ ప్రెషర్, డయాబెటీస్ లాంటి పరీక్షల వివరాలను ఎలా నమోదు చేస్తున్నారని బిల్ గేట్స్ అడిగి తెలుసుకున్నారు. కుప్పంలో అమలు చేసిన సంజీవని ప్రాజెక్టు చాలా చక్కగా ఉందని అభిప్రాయం వ్యక్తం చేస్తూ దట్స్ నైస్ అంటూ బిల్ గేట్స్ వ్యాఖ్యానించారు. ప్రజల డిజిటల్ హెల్త్ రికార్డులను అనుసరించి వారి లైఫ్ స్టైల్, ఆహారం తదితర అంశాల్లో సలహాలు ఇస్తున్నామని అధికారులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *