జనం న్యూస్: తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. ఈ ఫలితాల్లో ఖమ్మం మధిర మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ఇకపోతే మధిర మున్సిపాలిటీలో టీడీపీ అభ్యర్థి రేవతి ఘన విజయం సాధించారు. విచిత్రం ఏమిటంటే టీడీపీ అభ్యర్థికి కాంగ్రెస్ పార్టీ మద్దతు పలికారు. ఖమ్మం జిల్లా మధిర మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఇలాఖాలో కాంగ్రెస్ జెండా ఎగిరింది. మధిర మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. మొత్తం 22 వార్డులకు గాను 11 చోట్ల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందారు. దీంతో మధిర మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. మరోవైపు మధిర మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్లో ఆశించినట్టుగానే 10వ వార్డు అభ్యర్థిని బోడేపూడి రేవతి భారీ మెజారిటీతో విజయం సాధించారు.నేడు జరిగిన ఓట్ల లెక్కింపులో తొలి రౌండ్ నుంచే రేవతి స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించారు. ప్రత్యర్థులకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ఓటర్లు ఆమె వైపు మొగ్గు చూపారు. కౌంటింగ్ కేంద్రం నుంచి రిటర్నింగ్ అధికారి రేవతి గెలుపును అధికారికంగా ప్రకటించడంతో ఆమె అనుచరులు, మద్దతుదారుల సంబరాలు మిన్నంటాయి. మరోవైపు రేవతికి కాంగ్రెస్ పార్టీ సైతం మద్దతు ప్రకటించడం విశేషం. ఫలితాల వివరాలు ఇవే విజేత: బోడేపూడి రేవతి (334 ఓట్లు) ప్రత్యర్థి: పెదపూడి సుధాకర్ (168 ఓట్లు) మెజారిటీ: 166 ఓట్లు మధిర మున్సిపల్ ఎన్నికల తుది ఫలితాలు. ఇకపోతే మధిర మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ జోరు మీద ఉంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు వరుసగా గెలుపొందుతున్నారు.ఇప్పటివరకు ప్రకటించిన వార్డుల ఫలితాలు ఇలా ఉన్నాయి. 1వ వార్డు: దోర్నాల శిరీష(కాంగ్రెస్) 2వ వార్డు: రమణ నాయక్(కాంగ్రెస్) 3వ వార్డు: రాజు(కాంగ్రెస్) 4వ వార్డు: సామినేని సుజాత(కాంగ్రెస్) 5వ వార్డు: పిల్లి సునీత(కాంగ్రెస్) 6వ వార్డు: వేమిరెడ్డి లక్ష్మీ తులసి(కాంగ్రెస్) 7వ వార్డు: నర్సిరెడ్డి(కాంగ్రెస్) 8వ వార్డు: యన్నం కోటేశ్వరరావు(కాంగ్రెస్) 9వ వార్డు: చారులత( కాంగ్రెస్) 10వ వార్డు:బోడపూడి రేవతి(టీడీపీ) 11వ వార్డు: మాధురి(కాంగ్రెస్) మధిర మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా ఎగిరింది. ఇదిలా ఉంటే పోస్టల్ బ్యాలెట్ఓట్లలోనూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు దూసుకెళ్లారు.మధిర మున్సిపాలిటీలో మొదటి రౌండ్ 1 నుండి 11 వార్డులో పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో కాంగ్రెస్ పార్టీకి అత్యధిక ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీకి 29 ఓట్లు రాగా బీఆర్ఎస్కి 5 ఓట్లు నోటాకి ఒక ఓటు వచ్చింది. వివరాలు ఇవే కాంగ్రెస్ కూటమి కి 29 బి ఆర్ ఎస్ కూటమి కి 5 నోటా కి 1.