సాక్షి డిజిటల్ న్యూస్ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్ రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఓటుకు నోటు కేసులో రేవంత్ జైలుకు పోవడం ఖాయమని అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్ రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఓటుకు నోటు కేసులో రేవంత్ జైలుకు పోవడం ఖాయమని అన్నారు. అందుకే ఫోరెన్సిక్ ల్యాబ్‌ను దగ్దం చేశాడని ఆరోపించారు. మెదక్‌లో నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో హరీష్ రావు మాట్లాడుతూ… ఫోరెన్సిక్ ల్యాబ్ జరిగిన అగ్ని ప్రమాదం వెనుక రేవంత్ రెడ్డి హస్తం ఉందని అన్నారు. ఓటుకు నోటు కేసులో దొరికిపోయిన దొంగ అని ఆరోపించారు. రేవంత్ రెడ్డి జైలుకు పోయే సమయం దగ్గరకు వచ్చిందని… అందుకే సాక్ష్యాలు మాయం చేసేందుకు హైదరాబాద్‌లో ఫోరెన్సిక్ ల్యాబ్‌ను దగ్ధం చేశారని సంచలన ఆరోపణలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి పోలీసుల సహకారంతో ఈ కుట్ర పన్నారని హరీష్ రావు ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్‌లో పేదల బతుకులు కూల్చిండని విమర్శించారు. జైలుకు పోకుండా ఉండేందుకు సాక్ష్యాలను మాయం చేశారని… ఇది రేవంత్ డైరెక్షన్లో పోలీసులు చేసిన దహనకాండ అని ఆరోపించారు. అయితే ఓటుకు నోటు కేసులో రేవంత్‌కు శిక్ష పడక తప్పదని, జైలుకు పోక తప్పదని అన్నారు. రెండున్నరేళ్ల కాలంలో కాంగ్రెస్ చేసింది గుండు సున్నా అని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి మిర్యాలగూడ, భూపాలపల్లి, నిజామాబాద్ వెళ్లారని.. కానీ మెదక్‌కు వచ్చేందుకు ముఖం లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏడుపాయల అమ్మవారి మీద ఒట్టు వేసి మాట తప్పిండు కాబట్టి సీఎం రేవంత్ రెడ్డికి భయం అని ఆరోపించారు. రుణమాఫీ మాట తప్పి మోసం చేశారని, రైతుబంధు ఎగ్గొట్టిండు.. ఎరువుల కరువు తెచ్చారని ఆరోపణలు చేశారు. రేవంత్ బూతులు మాట్లాడటం తప్ప ఒక్క మంచి పని చేయలేదని విమర్శించారు. రంజాన్ తోఫా కూడా ఇవ్వడం లేదని, షాదీ ముబారక్ చెక్కులు రావడం లేదని, తులం బంగారంకు దిక్కు లేదని విమర్శించారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ మైనార్టీ గురుకులాలు కట్టారని, షాదీఖానా ఏర్పాటు చేశారని… బీఆర్ఎస్ పార్టీని సెక్యూలర్ పార్టీగా నిలబెట్టారని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హిందూ ముస్లింలను అన్నదమ్ములుగా చూసిందని తెలిపారు.