బర్డ్ ఫ్లూ ప్రభావంపై ప్రభుత్వం అప్రమత్తం

* మంత్రి అచ్చెన్నాయుడు సూచనలు.

జనం న్యూస్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బర్డ్ ఫ్లూపై ఎలాంటి ఆందోళన అవసరం లేదు అని మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు. ఏవియన్ ఇన్‌ఫ్లూయెంజా (బర్డ్‌ఫ్లూ)ను నియంత్రణలోకి తీసుకువస్తున్నట్లు వెల్లడించారు. ప్రజాలు ఈ బర్డ్ ఫ్లూపై ఎలాంటి ఆందోళనలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు అని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఏవియన్ ఇన్‌ఫ్లుయెంజా (పక్షి ఫ్లూ)కేసులపై ప్రభుత్వం అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తోంది అని మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటించారు. NIHSAD, భోపాల్ ప్రయోగశాల నుంచి వచ్చిన నివేదికల ఆధారంగా భారత ప్రభుత్వ పశుసంవర్ధక & డెయిరీయింగ్ శాఖ (DAHD) ద్వారా ఫిబ్రవరి 8న వ్యాధి నిర్ధారణ జరిగినట్లు ఆయన వెల్లడించారు. నిర్ధారణ వెలువడిన వెంటనే ప్రభావిత ప్రాంతాల్లో రాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ (RRTs) ను మోహరించి, నిర్ణీత ప్రామాణిక కార్యాచరణ విధానాల (SOPs) ప్రకారం కట్టుదిట్టమైన కల్లింగ్ (తొలగింపు) చర్యలు చేపట్టినట్లు మంత్రి తెలిపారు. ఈ ప్రక్రియ జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో పశుసంవర్ధక, రెవెన్యూ, పోలీస్, పంచాయతీరాజ్, వైద్య ఆరోగ్య శాఖల సమన్వయంతో సమర్థవంతంగా కొనసాగుతున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. వ్యాధి మరింత వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ప్రభావిత ప్రాంతాల్లోనే కాకుండా పరిసర ప్రాంతాల్లో కూడా పర్యవేక్షణను మరింత బలోపేతం చేసినట్లు మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *