ప్రజాస్వామ్యంపై దాడి-ఫోరెన్సిక్ ల్యాబ్ దగ్ధంపై కేటీఆర్ మండిపాటు

జనం న్యూస్ :  నాంపల్లి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌లో జరిగిన అగ్ని ప్రమాదానికి కారణం ఓటుకు నోటు కేసులో నిందితుడిగా ఉన్న ముఖ్యమంత్రే కుట్ర చేసి సాక్ష్యాధారాలను దగ్ధం చేశారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఈ ఫోరెన్సిక్ ల్యాబ్ ప్రమాదంపై హనుమకొండలో మీడియా సమావేశం నిర్వహించారు.  నాంపల్లి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌లో జరిగిన అగ్ని ప్రమాదానికి కారణం ఓటుకు నోటు కేసులో నిందితుడిగా ఉన్న ముఖ్యమంత్రే కుట్ర చేసి సాక్ష్యాధారాలను దగ్ధం చేశారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఈ ఫోరెన్సిక్ ల్యాబ్ ప్రమాదంపై హనుమకొండలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పలు వివరాలను వెల్లడించారు. ఓటుకు నోటు కేసు దాదాపు ముగింపు దశకు వచ్చి శిక్ష పడుతుందన్న కారణంగానే రాష్ట్ర ముఖ్యమంత్రి, హోం శాఖ మంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి ఈ ప్రమాదం వెనుక ఉన్నారని కేటీఆర్ తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. ఇదే అభిప్రాయాన్ని రాష్ట్ర ప్రజలు కూడా వ్యక్తం చేస్తున్నారని అన్నారు. ఇప్పటికే రేవంత్ రెడ్డి లాంటి ఒక క్రిమినల్, దొంగ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండడం వల్ల అనేక దుర్మార్గాలను తెలంగాణ గత రెండు సంవత్సరాలుగా చవిచూస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి వరుస సంఘటనల్లోనే తాజాగా నాంపల్లిలో ఫోరెన్సిక్ ల్యాబ్ అగ్ని ప్రమాదం జరిగిందన్నారు. మొదటి అంతస్తులో అగ్నికీలలు ఆర్పడానికి మూడు గంటలా:  అయితే ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికి ఆ కేసులోని ఆధారాలన్నింటినీ భద్రపరిచిన ఫోరెన్సిక్ లాబొరేటరీని కుట్రపూరితంగా ఆధారాలన్నీ ధ్వంసం చేసేటట్లు అగ్ని ప్రమాదంగా చిత్రీకరిస్తున్నారని ఆయన విమర్శించారు. కేవలం మూడు అంతస్తుల భవనంలో జరిగిన ప్రమాదాన్ని, మొదటి అంతస్తులో ఉన్న అగ్నికీలలను ఆర్పడానికి మూడున్నర గంటల సమయం పట్టింది అంటే ఇంతకు మించి కుట్ర అనడానికి వేరే విషయం అవసరం లేదన్నారు. ఈ ప్రమాదం జరిగిన తీరుపైనా కేటీఆర్ అనేక అనుమానాలను వ్యక్తం చేశారు. చలికాలంలో అగ్ని ప్రమాదం ఏంటి?: “అత్యంత కట్టుదిట్టమైన భద్రత కలిగిన ఫోరెన్సిక్ ల్యాబ్‌లో చలికాలం అగ్ని ప్రమాదం జరగడం, 24 గంటలు ఉద్యోగులు ఉండాల్సిన చోట ఉద్యోగులు ఎవరూ లేరని చెప్పడం, శనివారం ప్రమాదం పెద్దగా జరగలేదని చెప్పిన ప్రభుత్వం ఈరోజు మొత్తం 2015 నుంచి 10 సంవత్సరాల పాటు అనేక కేసులకు సంబంధించిన సాక్ష్యాధారాలు పూర్తిగా దగ్ధమయ్యాయని ప్రకటించడం చూస్తుంటే ఇది కచ్చితంగా రేవంత్ రెడ్డి చేయించిన పనే” అని కేటీఆర్ అన్నారు. దిల్లీలోని కొంత మంది వ్యక్తుల సూచన మేరకు: 11 సంవత్సరాలుగా ఓటుకు నోటు కేసు కొనసాగుతున్నదని, అది ప్రస్తుతం చివరి దశలో ఉన్నదని, అందులో నుంచి బయటపడడానికే ఈ అగ్ని ప్రమాదం నాటకం, కుట్ర అని కేటీఆర్ తెలిపారు. దిల్లీలో బీజేపీతో అంటకాగుతున్న కొంతమంది వ్యక్తుల సూచన మేరకు, దిల్లీ పెద్దలు ఇచ్చిన ఆదేశాల మేరకు ఫోరెన్సిక్ ల్యాబ్‌ని రేవంత్ రెడ్డి తగలబెట్టారని కేటీఆర్ అనుమానం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *