ఎన్నికల ప్రచారానికి పవన్ కళ్యాణ్ దూరం

* కూటమి వ్యూహంపై ప్రభావం.

జనం న్యూస్: తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న బీజేపీ, జనసేన అభ్యర్థులకు బిగ్ షాక్ తగిలింది. ఎన్నికల ప్రచారానికి వస్తారనుకున్న జనసేన పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటన రద్దు అయ్యింది. దీంతో వారిలో నిరాశ నెలకొంది. పవన్ కల్యాణ్ పర్యటిస్తే తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల వేడి రాజుకుంటుంది. మరికొన్ని రోజులు మాత్రమే సమయం ఉండంటతో రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఈనెల 11వ తేదీన రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికల్లో జనసేన పార్టీ 336 వార్డుల్లో తమ అభ్యర్థులను బరిలోకి దింపింది. అభ్యర్థులు ప్రస్తుతం ప్రచారంలో హోరాహోరీగా పాల్గొంటున్నారు.మరోవైపు మున్సిపల్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ కూడా ప్రచారాన్ని ఉధృతం చేస్తుంది. అయితే తాజా సమాచారం ప్రకారం తెలంగాణలో బీజేపీకి మద్దతు ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ ప్రచారం చేయనున్నట్టుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్ రామచందర్ రావు ప్రకటన చేశారు.అయితే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఈనెల 7, 8వ తేదీల్లో తెలంగాణలో పర్యటించనున్నట్లు ప్రకటించినప్పటికీ బీజేపీ తాజాగా పవన్ పర్యటన రద్దు అయినట్లు ప్రకటించింది. తెలంగాణలో పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం రద్దు. తెలంగాణ రాష్ట్రంలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పర్యటన రద్దు అయ్యింది. మున్సిపల్ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ తరఫున మాత్రమే కాకుండా, బీజేపీ అభ్యర్థుల తరఫున కూడా ప్రచారం చేయాలని భావించారు. ఈ మేరకు ప్రకటన సైతం విడుదల అయ్యింది. పవన్ కళ్యాణ్ ఈనెల 7, 8వ తేదీన నల్గొండలో నిర్వహించనున్న మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని బీజేపీ ముందుగా ప్రకటించింది. అయితే, పవన్ కల్యాణ్ తన పర్యటనను రద్దు చేసుకున్నారు. అటు రాజకీయంగా ఇటు పాలనా పరంగా బిజీబిజీగా ఉండటంతో పర్యటన రద్దు అయ్యింది. ఈ విషయాన్ని బీజేపీ అధికారికంగా ప్రకటించింది. 336 వార్డుల్లో పోటీ చేస్తున్న జనసేనతమ గెలుపు ఖాయం అవుతుందని ఆశించిన వారి ఆశలపై పవన్ కల్యాణ్ నీళ్లు చల్లినట్లు అయ్యింది. జనసేన పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటన రద్దు కావడంతో జనసేన, బీజేపీ పార్టీ అభ్యర్థులు, శ్రేణులు, కార్యకర్తలు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. ఈ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థులు సైతం గాజు గ్లాస్ గుర్తుపై పోటీ చేయనున్నారు. పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తే విజయావకాశాలు పెరుగుతాయని అభ్యర్థులు ఆశించారు, కానీ ఆయన పర్యటన రద్దు కావడంతో వారు నిరాశ చెందారు. తెలంగాణలోని జిల్లాల వారీగా జనసేన పోటీ చేసే వార్డుల సంఖ్య ఈ విధంగా ఉంది: నిజామాబాద్-48, కొత్తగూడెం-22, రంగారెడ్డి-21, ఖమ్మం-17, వరంగల్-20, నల్గొండ-46, మహబూబ్‌నగర్-44, మహబూబాబాద్-5, మెదక్-18, కరీంనగర్-56, ఆదిలాబాద్-39 వార్డులలో మెుత్తం 336 వార్డులలో జనసేన పోటీ చేస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *