జనం న్యూస్: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో విచారణకు సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో సీబీఐ తదుపరి దర్యాప్తునకు సంబంధించి సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో విచారణకు సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో సీబీఐ తదుపరి దర్యాప్తునకు సంబంధించి సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తుపై సీబీఐ కోర్టు ఆదేశాలలో సుప్రీం కోర్టు మార్పు చేసింది. సీబీఐ కోర్టు విధించిన నెల రోజుల కాల పరిమితిని తొలగించి. వీలైనంత త్వరగా దర్యాప్తును పూర్తి చేయాలని సీబీఐని ఆదేశించింది. ఈ కేసుతో సంబంధం ఉన్న ఎవరినైనా విచారించవచ్చని కూడా సుప్రీం కోర్టు తెలిపింది. వివేకానందరెడ్డి కుమార్తె సునీత రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్బంగా సుప్రీం కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితులుగా ఉన్నవారికి ఇచ్చిన బెయిళ్లను రద్దు చేయాలని న్యాయస్థానాల్లో పోరాటం చేస్తున్నారు. అలాగే, ఈ కేసులో తదుపరి దర్యాప్తు కోరుతూ సునీత హైదరాబాద్‌లోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అయితే సునీత పిటిషన్‌పై విచారణ జరిపిన సీబీఐ కోర్టు పాక్షికంగా అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఒక నిర్దిష్ట అంశాన్ని మాత్రమే దర్యాప్తు చేయడానికి సీబీఐకి అనుమతిస్తున్నట్టుగా తెలిపింది. అయితే ఈ ఉత్తర్వులను సునీత సుప్రీం కోర్టులో సవాలు చేశారు. ఈ కేసులో పెద్ద కుట్ర కోణాన్ని పరిగణనలోకి తీసుకోకుండా సీబీఐకి పరిమితులు విధిస్తున్నారని పిటిషన్ దాఖలు చేశారు. ఇందుకు సంబంధించి గత నెల 20వ తేదీన జరిగిన విచారణ సందర్బంగా. వివేకానందరెడ్డి హత్య కేసులో తదుపరి దర్యాప్తు అవసరముందా? లేదా? అనేది తెలుపాలని సీబీఐని సుప్రీం కోర్టు ప్రశ్నించింది. దర్యాప్తు అవసరముంటే ఎవరెవరిని విచారించాలో తెలుపాలని పేర్కొంది. తదుపరి విచారణను ఫిబ్రవరి 5వ తేదీకి వాయిదా వేసింది. ఈ క్రమంలోనే సునీత పిటిషన్‌పై జస్టిస్ ఎంఎం సుందరేశ్, జస్టిస్ ఎన్ కోటీశ్వర్‌సింగ్‌తో కూడిన సుప్రీం ధర్మాసనం గురువారం మరోసారి విచారించింది. ఈ సందర్బంగా సీబీఐ న్యాయవాది వాదనలు వినిపిస్తూ. ఇప్పటికే ప్రధాన దర్యాప్తు పూర్తైందని, ట్రయల్ కోర్టు (హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టు) ఆదేశాల ప్రకారం తాము దర్యాప్తు నిర్వహిస్తున్నామని సునీత తరఫున సిద్దార్థ్ లూథ్రా వాదనలు వినిపిస్తూ. ఈ కేసులో సీబీఐ కోర్టు విధించిన కాలపరిమితి నిబంధనను సవరించాలని కోరారు. కాలపరిమితి విధించడం అనేది దర్యాప్తును ఒత్తిడిలోకి నెట్టివేసే అవకాశం ఉంటుందని తెలిపారు. కేవలం నిర్దిష్ట అంశంపైనే దర్యాప్తు చేయాలని సీబీఐని ఆదేశించడం వల్ల వాస్తవాలు వెలుగులోకి రాకుండా పోయే ప్రమాదం ఉందని అన్నారు. దర్యాప్తునకు సంబంధించి ఏదైనా కొత్త విషయాన్ని సీబీఐకి సమర్పించే అవకాశం కల్పించాలని కూడా సుప్రీం ధర్మాసనాన్ని సిద్దార్థ్ లూథ్రా కోరారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న సుప్రీం కోర్టు. సీబీఐ కోర్టు ఉత్తర్వులను సవరించింది. అదే సమయంలో సీబీఐకి కొంత సమయం ఇద్దామని వ్యాఖ్యానించింది. అంతేకాకుండా దర్యాప్తును త్వరగా పూర్తి చేయాలని సీబీఐని ఆదేశించింది. ఈ కేసుకు సంబంధించి ఏదైనా అదనపు సమాచారం ఉంటే. సీబీఐ ముందు ఉంచే స్వేచ్ఛను పిటిషనర్‌కు మంజూరు చేసింది. ఇందుకు సంబంధించిన తదుపరి విచారణను మార్చి 11వ తేదీకి వాయిదా వేసింది.