పయనించే సూర్యుడు న్యూస్ : భారత అమెరికా మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందంలో అత్యంత ముఖ్యమైనది ఎనర్జీ పాలసీ ఇది ప్రస్తుతం పెద్ద వివాదంగా మారింది. ఇందులో భాగంగా భారత్ ఇకపై రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేయదని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తన ట్రూత్ పోస్టులో పేర్కొన్నారు. అయితే దీనిపైన ప్రస్తుతం భారత విదేశాంగ శాఖ సైతం స్పందించింది. ముఖ్యంగా భారత్ ఎనర్జీ పాలసీ అనేది ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు లోను కాలేదని పేర్కొంది ఈ మేరకు భారత విదేశాంగ శాఖ స్పష్టం చేస్తూ ఒక ప్రకటన జారీ చేసింది. భారత్ అమెరికా మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందంలో అత్యంత ముఖ్యమైనది ఎనర్జీ పాలసీ. ఇది ప్రస్తుతం పెద్ద వివాదంగా మారింది. ఇందులో భాగంగా భారత్ ఇకపై రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేయదని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తన ట్రూత్ పోస్టులో పేర్కొన్నారు. అయితే దీనిపైన ప్రస్తుతం భారత విదేశాంగ శాఖ సైతం స్పందించింది. ముఖ్యంగా భారత్ ఎనర్జీ పాలసీ అనేది ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు లోను కాలేదని పేర్కొంది. ఈ మేరకు భారత విదేశాంగ శాఖ స్పష్టం చేస్తూ ఒక ప్రకటన జారీ చేసింది. ముఖ్యంగా దేశ అవసరాలు, మార్కెట్ వాస్తవాలు, ధరల ఆధారంగానే నిర్ణయాలు తీసుకుంటామని ఈ సందర్భంగా పేర్కొంది. తమకు 140 కోట్ల మంది ప్రజల ఎనర్జీ సెక్యూరిటీ అధిక ప్రాధాన్యత కల్పించే అంశమని ఈ సందర్భంగా భారత విదేశాంగ శాఖ తెలిపింది. అయితే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత్ రష్యా నుంచి కొనుగోలు నిలిపి వేస్తుందని ఆయన ఏకపక్షంగా తన సోషల్ మీడియా వేదికగా తెలపడం ప్రస్తుతం ఈ వివాదానికి కేంద్రంగా మారింది అని చెప్పవచ్చు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యల పైన భారత్ స్పష్టంగా తన వైఖరిని తెలియజేసింది. భారత విదేశాంగ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ భారత్ వివిధ దేశాల నుంచి క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకుంటుందని, క్రూడ్ ఆయిల్ కోసం కేవలం ఒక దేశం పైన ఆధారపడే విధానం తమ వద్ద లేదని, మార్కెట్లో ధరలు, అందుబాటు, జాతీయ ప్రయోజనాలే కీలకమని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. అయితే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ రష్యాకు బదులుగా భారత్ ఇకపై అమెరికా నుంచి కానీ, వెనుజులా నుంచి కానీ ఆయిల్ కొనుగోలు చేస్తుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. అయితే దీనిపైన భారత్ వెనుజులా మధ్య గతంలో ఉన్న ఎనర్జీ అనుబంధం గురించి గుర్తు చేసుకోవాల్సి ఉంటుంది. నిజానికి భారత్ అలాగే వెనుజులా రెండు కూడా గతంలో ఎనర్జీ భాగస్వాములు. భారత్ పెద్ద ఎత్తున వెనుజులా నుంచి ఆయిల్ దిగుమతి చేసుకుంది. 2020 సంవత్సరం వరకు ఇది కొనసాగింది. అయితే అమెరికా విధించిన ఆంక్షలు ఫలితంగా, అలాగే అంతర్జాతీయ ఒత్తిళ్ల కారణంగా సరఫరాను నిలిపి వేసుకోవాల్సి వచ్చింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం భారత విదేశాంగ శాఖ రష్యా నుంచి ఆయిల్ కొనడం ఆపుతామని ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఆయిల్ కొనుగోలు కోసం రష్యా సహా పలు దేశాలు తమకు ఆప్షన్లుగా ఉన్నాయని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. భారత్ తన ఇంధన అవసరాల కోసం ఏ ఒక్క దేశం పైన ఆధారపడదని ఈ సందర్భంగా పేర్కొంది. భారత్ తన విదేశాంగ ఎనర్జీ పాలసీలను స్వతంత్రంగా నిర్ణయిస్తుందని, దేశ ప్రయోజనాలే తమకు అంతిమ ప్రాధాన్యమని ఈ సందర్భంగా భారత విదేశాంగ శాఖ తెలిపింది. మరోవైపు భారత్ అమెరికా మధ్య కుదిరినటువంటి వాణిజ్య ఒప్పందం వల్ల మన దేశానికి చెందిన పలు రంగాలకు చెందిన వ్యాపార సంస్థలకు పెద్ద ఎత్తున ఊరట లభించింది అని చెప్పవచ్చు.