సీఎం చంద్రబాబుతో బిల్ గేట్స్ సమావేశం

* అభివృద్ధి అంశాలపై చర్చ.

జనం న్యూస్: మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఈనెల 18న ఏపీ రాజధాని అమరావతిలో పర్యటించనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో బిల్‌గేట్స్‌ భేటీ అయి పలు అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.గత ఏడాది ‘బిల్&మెలిండా గేట్స్ ఫౌండేషన్’తో కుదుర్చుకున్న ఒప్పందాల పురోగతిపై సీఎం చంద్రబాబు నాయుడుతో చర్చించనున్నారు. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఫిబ్రవరి 18న అమరావతిలో పర్యటించనున్నారు. ఈ మేరకు పర్యటన దాదాపు ఖరారు అయినట్లు తెలుస్తోంది. ఈ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై చర్చించే అవకాశం ఉంది. ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం మరియు విద్యలో మెరుగైన ఫలితాలను సాధించడానికి అల్-ఆధారిత సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడానికి రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది మార్చిలో బిల్ మరియు మెలిండా గేట్స్ ఫౌండేషన్‌తో ఒక అవగాహన ఒప్పందం చేసుకుంది. హెల్త్‌కేర్ అనలిటిక్స్, డిజిటల్ అగ్రికల్చర్ మరియు గవర్నెన్స్‌లో టెక్నాలజీని ఉపయోగించడం ద్వారా ప్రజలకు వేగంగా సేవలను అందించడానికి ఈ ఎంఓయూపై సంతకం చేశారు. ఈ ప్రాజెక్టు అమలుపై నాయుడు మరియు బిల్ గేట్స్ మధ్య చర్చ జరిగే అవకాశం ఉంది. వీటితోపాటు మైక్రోసాఫ్ట్ అమరావతిలోని క్వాంటం వ్యాలీలో పెట్టుబడి పెట్టాలని ప్రతిపాదించిందని. చంద్రబాబుతో జరిగే అదే సమావేశంలో మరింత స్పష్టత వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది. గతేడాది బిల్‌గేట్స్‌ను కలిసిన సీఎం చంద్రబాబు. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్‌తో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత ఏడాది మార్చి 19న మర్యాదపూర్వకంగా కలిసి పలు అంశాలపై చర్చించారు. బిల్, మెలిండా గేట్స్ ఫౌండేషన్‌, ఏపీ ప్రభుత్వం మధ్య పలు ఒప్పందాలు చేసుకున్నారు. హెల్త్‌ కేర్‌, విద్యారంగం, పరిపాలన, వ్యవసాయం, ఉద్యోగ కల్పన, ఏఐ టెక్నాలజీ వంటి రంగాల్లో గేట్స్ ఫౌండేషన్ ఏపీ ప్రభుత్వానికి సహకరిస్తామని దావోస్ పర్యటనలో బిల్ గేట్స్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ కీలకమైన రంగాలకు సంబంధించి ఒప్పందాలు జరిగాయి. ఈ ఒప్పందాలపై సీఎం చంద్రబాబు నాయుడు,బిల్‌గేట్స్ మధ్య చర్చలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఏపీ పురోగతికి బిల్ గేట్స్ మద్దతు: సీఎం చంద్రబాబు. దేశరాజధాని ఢిల్లీలో మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్‌తో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశం అయిన సంగతి తెలిసిందే. ఈ భేటీలో రాష్ట్ర ప్రభుత్వంతో గేట్స్ ఫౌండేషన్ సహకారంపై కీలకంగా చర్చించారు. ప్రజల ఆరోగ్య సంరక్షణ, విద్య, వ్యవసాయం, ఉపాధి కల్పన వంటి కీలక రంగాలపై చర్చ జరిగింది. అధునాతన సాంకేతికత పరిజ్ఞానాల వినియోగ అవకాశాలను పరిశీలించినట్లు సీఎం చంద్రబాబు నాయుడు నాడు ప్రకటించిన సంగతి తెలిసిందే.పీ4, స్వర్ణాంధ్ర 2047 దార్శనికత సహకారానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని చంద్రబాబు పేర్కొన్నారు. ఈ లక్ష్యసాధనలో గేట్స్ ఫౌండేషన్ భాగస్వామ్యం కీలక పాత్ర పోషిస్తుందని విశ్వసిస్తున్నట్లు సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు. బిల్ గేట్స్‌తో అద్భుతమైన సమావేశం జరిగిందని కొనియాడారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ప్రిడిక్టివ్ అనలిటిక్స్ వంటి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాల వినియోగాన్ని గురించి చర్చించామని. ఏపీ పురోగతికి బిల్ గేట్స్ తన సమయం, మద్దతు ఇచ్చినందుకు ఎక్స్ వేదికగా సీఎం చంద్రబాబు నాయుడు ధన్యవాదాలు తెలిపిన సంగతి తెలిసిందే. గేట్స్‌ ఫౌండేషన్‌ సహకారంపై చర్చ. గేట్స్‌ ఫౌండేషన్‌ ద్వారా ఆరోగ్యం, విద్య, డిజిటల్‌ పాలన, వ్యవసాయం. గ్రామీణ జీవన వైవిధ్యం, ఏఐ టెక్నాలజీ వంటి రంగాలలో ఏపీ ప్రభుత్వానికి బిల్‌ గేట్స్‌ సహకరిస్తారనే తెలుస్తోంది. విదేశీ పర్యటనలో బిల్‌ట్స్‌‌తో సీఎం చంద్రబాబు నాయుడు భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ ఐదు కీలక రంగాల్లో బిల్‌ గేట్స్‌ ఫౌండేషన్‌ సహకారాన్ని తీసుకునేందుకు బిల్‌ గేట్స్‌, చంద్రబాబు సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందం చేసుకుంది.  ఈ ఒప్పందాల ద్వారా ఆరోగ్యం, విద్యారంగం, పరిపాలన, వ్యవసాయం, ప్రభుత్వ ఉద్యోగులకు ఏఐ టెక్నాలజీపై అవగాహన కార్యక్రమాల్లో బిల్‌ గేట్స్‌ ఫౌండేషన్‌ సహకారం అందించనుంది. వీటితో పాటు మరిన్ని అంశాల్లోనూ, కీలక రంగాల్లోనూ సాంకేతిక సహకారాన్ని అందిస్తామని ఫౌండేషన్‌ ఇప్పటికే పేర్కొనడంతో వాటిని పట్టాలెక్కించే అంశంపై చర్చ జరిగింది. ఈ రంగాలలో ఏయే ప్రాజెక్టులు ఎఫ్పుడు ప్రారంభించాలి అనేదానిపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *