జనం న్యూస్: తెలంగాణలో బీజేపీకి మద్దతు ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రచారం చేయనున్నట్టుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. తెలంగాణలోని ప్రధాన రాజకీయ పార్టీలు మున్సిపల్ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నాయి. మున్సిపల్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ కూడా ప్రచారాన్ని ఉధృతం చేస్తుంది. అయితే తాజా సమాచారం ప్రకారం తెలంగాణలో బీజేపీకి మద్దతు ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రచారం చేయనున్నట్టుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్ రామచందర్ రావు ప్రకటన చేశారు. వివరాలు… కేంద్ర మంత్రి కిషన్, తెలంగాణ బీజేపీ చీఫ్ రామచందర్ రావులు మంగళవారం రాత్రి ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ను కలిశారు. ఈ సందర్బంగా తెలంగాణ మున్సిపల్ ఎన్నికలతో పాటు, ఇతర అంశాలపై చర్చించారు. ఈ సందర్బంగా తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి మద్దతుగా ప్రచారం నిర్వహించాలని పవన్ కల్యాణ్‌ను కిషన్ రెడ్డి, రామచందర్‌రావు కోరినట్టుగా తెలుస్తోంది. ఈ సమావేశం వివరాలను రామచందర్ రావు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. తెలంగాణలో జరగబోయే మున్సిపల్ ఎన్నికలతో సహా పలు కీలక అంశాలపై పవన్ కల్యాణ్‌తో చర్చించినట్టుగా తెలిపారు. బీజేపీకి పవన్ కల్యాణ్ పూర్తి మద్దతు తెలియజేశారని చెప్పారు. తెలంగాణ మున్సిపల్ ఎన్నికలలో బీజేపీ తరపున ప్రచారం చేయడానికి పవన్ కల్యాణ్ అంగీకరించారని రామచందర్‌రావు తెలిపారు. ఇదిలాఉంటే, తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ కూడా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే జనసేన అభ్యర్థులు పలు మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో వివిధ వార్డులు, డివిజన్లలో నామినేషన్లు దాఖలు చేశారు. ప్రచారం కూడా నిర్వహిస్తున్నారు. మరోవైపు తెలంగాణ మున్సిపల్ ఎన్నిలకు బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అయితే తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ, జనసేన పార్టీలు ఎలాంటి పొత్తును అధికారికంగా ప్రకటించలేదు. జనసేన పార్టటీ తెలంగాణ నాయకత్వం మాత్రం. మున్సిపల్ ఎన్నికల్లో ఇరు పార్టీలకు (బీజేపీ, జనసేన) మద్దతుగా 7,8 తేదీలలో ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్ పాల్గొనేందుకు నిర్ణయించుకున్నారని తెలిపింది.