కేంద్ర మంత్రులతో భేటీల కోసం ఢిల్లీకి నారా లోకేశ్

జనం న్యూస్: ఏపీ విద్య, ఐటీ,ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ ఢిల్లీ పర్యటన ఖరారు అయ్యింది. రేపు ఉదయం లోకేష్ పార్లమెంట్ భవనానికి వెళ్లి అక్కడ పలువురు కేంద్ర మంత్రులతో వరస బేటీలు కాబోతున్నారు. రాష్ట్ర విద్య,ఐటీ,ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేశ్ ఢిల్లీలో పర్యటించనున్నారు. ఇవాళ మధ్యాహ్నాం 3 గంటలకు విజయవాడ నుంచి బయలుదేరి సాయంత్రం 5 గంటలకు మంత్రి నారా లోకేశ్ ఢిల్లీ చేరుకున్నారు. రాత్రికి మంత్రి నారా లోకేశ్ ఢిల్లీలోనే బస చేయనున్నారు. ఇకపోతే బుధవారం ఉదయం పార్లమెంట్‌కు వెళ్లి కేంద్రమంత్రులను కలిశారు. అనంతరం గురువారం అర్ధరాత్రికి ఉండవల్లిలోని తన నివాసానికి మంత్రి నారా లోకేశ్ రానున్నారు. మరికాసేపట్లో ఢిల్లీకి మంత్రి లోకేశ్. ఏపీ విద్య, ఐటీ,ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ ఢిల్లీ పర్యటన ఖరారు అయ్యింది. బుధవారం ఉదయం లోకేశ్ పార్లమెంట్ భవనానికి వెళ్లి అక్కడ పలువురు కేంద్ర మంత్రులతో వరస భేటీలు కాబోతున్నారు. రాష్ట్రంలో ఐటీ రంగ విస్తరణతో పాటు ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ల ఏర్పాటుపై కేంద్రమంత్రులతో మంత్రి నారా లోకేశ్ భేటీ కానున్నారు.అంతేకాదు విద్యారంగానికి సంబంధించిన పలు సంస్కరణలపైనా కేంద్రమంత్రులతో మంత్రి నారా లోకేశ్ చర్చించనున్నారు.అలాగే ఏపీ విభజన చట్టంలోని హామీల అమలు, కేంద్ర విద్యాసంస్థలు, నూతన విద్యాసంస్థల మంజూరుపై సంబంధిత కేంద్రమంత్రులతో చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాజధాని అమరావతి నిర్మాణంపై ఫుల్ ఫోకస్ పెట్టిన సంగతి తెలిసిందే. అమరావతి ప్రాంతంలో భారీ కంపెనీలు, పెద్ద పెద్ద విద్యాసంస్థలు సైతం తరలిరానున్న సంగతి తెలిసిందే. వీటికి సంబంధించి నిధులు రాబట్టే అంశంపై సంబంధిత కేంద్రమంత్రులతో చర్చించనున్నట్లు తెలుస్తోంది. అలాగే కొత్త ప్రాజెక్టులు ఇవ్వాలని కూడా కేంద్రపెద్దలను కోరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఏపీకి కేటాయించిన నిధులపై చర్చించే ఛాన్స్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *