తెలంగాణ జాతిపిత అని వాళ్లకే వాళ్లకు వాళ్లే టైటిల్ ఇచ్చేసుకుంటున్నారు

*కేసీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

సాక్షి డిజిటల్ న్యూస్ : బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల కాలంలో కేసీఆర్‌ను ఆ పార్టీ శ్రేణులు జాతిపితగా ప్రకటించేసుకుంటున్నారని వేల కోట్లు కొల్లగొట్టి, వందల ఎకరాలు దోచుకున్న కేసీఆర్ అసలు ఉద్యమకారుడేనా అని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం పోరాడిన సమరయోధుడు రావి నారాయణ రెడ్డికి తెలంగాణ సమాజంలో ప్రభుత్వం సముచిత స్థానం కల్పిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.రావి ారాయణ రెడ్డి చరిత్రను పాఠ్యాంశంగా చేర్చడం, వారి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం వంటి అంశాలపై అందరితో చర్చించి, వారి గౌరవాన్ని పెంచేందుకు మంత్రిమండలిలో నిర్ణయం తీసుకుని సముచితమైన స్థానం కల్పిస్తామని వెల్లడించారు. ‘తెలంగాణ అమరవీరుల స్మారక ట్రస్టు’ ఆధ్వర్యంలో స్వాతంత్య్ర సమరయోధుడు, పద్మవిభూషణ్ ‘రావి నారాయణ రెడ్డి స్మారక జాతీయ పురస్కారం – 2025’ను ముఖ్యమంత్రి చేతుల మీదుగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డికి అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ‘అరాచక శక్తులకు వ్యతిరేకంగా సాయుధ రైతాంగ పోరాటంలో కీలక పాత్ర పోషించిన మహనీయుడు రావి నారాయణ రెడ్డి. భూస్వామ్య కుటుంబంలో పుట్టినా…పేద ప్రజల కోసం తన 500 ఎకరాల భూమిని దానం చేసిన గొప్ప వ్యక్తి’అని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు. రావి నారాయణ రెడ్డికి సముచిత గౌరవం ఇస్తాం ‘బండెనక బండి కట్టి, పదహారు బండ్లు కట్టి’ అని తెలంగాణ సమాజాన్ని చైతన్యం చేసిన బండి యాదగిరి లాంటి నిరక్షరాస్యులను కూడా ప్రభావితం చేసిన గొప్ప నాయకుడు అని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు. ‘దేశంలో మొట్టమొదటి ప్రధాని నెహ్రూ కంటే ఎక్కువ మెజారిటీతో పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ప్రజా తీర్పును ప్రతిబింబించేలా ఆనాడు మొట్టమొదటి పార్లమెంట్ భవనాన్ని రావి నారాయణ రెడ్డితో నెహ్రూ ప్రారంభింపజేశారు. 60 ఏళ్ల వయసులో ప్రజలకు స్ఫూర్తినిస్తూ పార్టీ, రాజకీయ పదవుల నుంచి తప్పుకున్న గొప్ప నేత రావి నారాయణ రెడ్డి. మున్సిపల్ ఎన్నికల అనంతరం రావి నారాయణ రెడ్డికి సముచిత గౌరవం ఇచ్చేందుకు చేపట్టాల్సిన చర్యలు తీసుకుంటాం’అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. సర్వం త్యాగం చేసిన మహనీయుడు రావి నారాయణ రెడ్డి తెలంగాణ ప్రజల స్వేచ్ఛ కోసం, పేదల హక్కుల కోసం పోరాటం చేయడమే కాదు, సర్వం త్యాగం చేసిన మహనీయుడు రావి నారాయణ రెడ్డి.న్యాయ వ్యవస్థ ద్వారా ప్రజల హక్కుల కోసం పని చేసిన, రాజ్యాంగం పట్ల సంపూర్ణ నిబద్ధత కలిగిన జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డికిఈ అవార్డు ప్రదానం చేయడం అత్యంత సముచితం. నేడు దేశంలో రాజ్యాంగ పరిరక్షణ కోసం, ప్రజల ఓటు హక్కు రక్షణ కోసం, ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం రావి నారాయణ రెడ్డి స్ఫూర్తితో పని చేయాల్సిన అవసరం ఉంది’అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ‘నిర్వాహకులు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నారు. తొలితరంలో బూర్గుల రామకృష్ణారావు, రావి నారాయణ రెడ్డి స్ఫూర్తినిస్తే, మలితరంలో ఎస్. జైపాల్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి వంటి వారు తెలంగాణ సమాజానికి స్ఫూర్తినిచ్చారు అని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డి తెలంగాణ సమాజానికి ఒక స్ఫూర్తిగా నిలిచారు. రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో వారు పోషించిన పాత్ర మనందరికీ గుర్తుంది. వారి అనుభవాలు పరిపాలనలో ఉపయోగపడుతున్నాయి’అని సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. కేసీఆర్‌పై నిప్పులు చెరిగిన సీఎం రేవంత్ రెడ్డి. మాజీ సీఎం కేసీఆర్‌పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వేల కోట్లు కొల్లగొట్టి, వందల ఎకరాలు దోచుకున్న కేసీఆర్ అసలు ఉద్యమకారుడేనా అని ప్రశ్నించారు.‘అర్థరాత్రి ప్రొఫెసర్ కోదండరాం ఇంటి తలుపులు పగులగొట్టినప్పుడు ఆయన ఉద్యమకారుడని గుర్తులేదా? అని నిలదీశారు. అర్ధరాత్రి ప్రొఫెసర్ కోదండరాం సారు ఇంటి దర్వాజాలు పలగొట్టినప్పుడు గుర్తు రాలేదా ఆయన ఉద్యమకారుడు అని అన్నారు.నువ్వు ఉద్యమమారుడు కోదండరామ్ సార్‌ని అవమానించినట్లు మేము నిన్ను అవమానించలేదు కదా అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు.‘ఇటీవల కాలంలో కొంతమంది తెలంగాణ జాతిపిత అని వాళ్లకే వాళ్లే టైటిల్ ఇచ్చుకుంటున్నారు. చేసిన తప్పులకు నోటీసులు ఇస్తే.. తెలంగాణ జాతిపితకు నోటీసులు ఇస్తారా? అంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *