కేంద్ర బడ్జెట్లో తెలుగు రాష్ట్రాలపై ప్రత్యేక దృష్టి

పయనించే సూర్యుడు న్యూస్ : కేంద్ర బడ్జెట్‌లో ఏడు హైస్పీడ్ రైలు కారిడార్లను ప్రతిపాదించారు. ఇందులో 3 కారిడార్లు హైదరాబాద్ మీదుగానే వెళ్తుండటం విశేషం. పుణే-హైదరాబాద్, హైదరాబాద్-బెంగళూరు, హైదరాబాద్-చెన్నై కారిడార్లను నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఇందులో రెండు కారిడార్లు ఆంధ్రప్రదేశ్ మీదుగా వెళ్లనున్నాయి. కొబ్బరి రైతులకు ఊరట: కొబ్బరి రైతులకు ప్రయోజనం చేకూర్చడం కోసం కోకోనట్ ప్రమోషన్ స్కీమ్‌ను ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించారు. ఉత్పాదకత సరిగా లేని కొబ్బరి చెట్లను తొలగించి.. వాటి స్థానంలో కొత్త మొక్కలు నాటేందుకు ఈ పథకం తోడ్పాటును అందించనుంది బడ్జెట్ 2026-27లో కోకో, జీడి పప్పు సాగు చేసే రైతుల కోసం కేంద్రం ప్రాధాన్యం ఇచ్చింది.డేటా సెంటర్లకు ట్యాక్స్ హాలిడే: భారత్‌లో ఏర్పాటు చేయనున్న డేటా సెంటర్లకు కేంద్రం గుడ్ న్యూస్ ప్రకటించింది. 2047 వరకు ట్యాక్సులు కట్టాల్సిన అవసరం లేకుండా బడ్జెట్లో కీలక ప్రకటన చేశారు. 20 ఏళ్లపాటు ట్యాక్స్ హాలీడే ప్రకటించడం ద్వారా.. విశాఖ నగరం మరింతగా డేటా సెంటర్ల కోసం పెట్టుబడులను ఆకర్షించే అవకాశం ఉంది. సముద్ర గర్భంలో కేబుల్స్ కనెక్టివిటీ ఉండటంతో విశాఖ నగరం ఇంటర్నేషనల్ డేటా కారిడార్‌గా మారనుంది. రేర్ ఎర్త్ మినరల్స్: ప్రపంచం మొత్తం ఇప్పుడు రేర్ ఎర్త్ మినరల్స్ వైపు చూస్తోంది. దీంతో భారత్ కూడా రేర్ ఎర్త్ మినరల్స్‌ అన్వేషణపై ఫోకస్ పెట్టింది. కేంద్ర బడ్జెట్లో ఏపీ, ఒడిశా, తమిళనాడు,కేరళ రాష్ట్రాల్లో రేర్ ఎర్త్ మినరల్స్ కారిడార్ ఏర్పాటు చేయనున్నారు. దీని వల్ల ఏపీలో పరిశ్రమలు డెవలప్ అయ్యే అవకాశం ఉంది.  టైర్-2, టైర్-3 నగరాలకు నిధులు.. చిన్న పట్టణాలను డెవలప్ చేయడంపై కేంద్రం స్పెషల్ ఫోకస్ పెట్టింది. 5 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న పట్టణాలు, నగరాల అభివృద్ధికి కేంద్రం నిధులు అందించనుంది. దీని వల్ల తెలుగు రాష్ట్రాల్లోని విజయవాడ, విశాఖపట్నం, నెల్లూరు, గుంటూరు, కర్నూలు, వరంగల్, కరీంనగర్ తదితర నగరాలకు ప్రత్యేక గ్రాంట్లు అందనున్నాయి. కొత్త జలమార్గాలు వచ్చే ఐదేళ్లలో దేశవ్యాప్తంగా 20 కొత్త జలమార్గాలను అభివృద్ధి చేయనున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఇప్పటికే ప్రకటించిన 111 జలమార్గాల జాబితా నుంచి ఈ 20 జలమార్గాలను ఎంపిక చేశారు. ఇందులో తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. కాకినాడ-పుదుచ్చేరి కెనాల్, విజయవాడ-ముక్త్యాల, భద్రాచలం-రాజమండ్రి మార్గాలు ఉండనున్నాయి. రొయ్యల మేతపై సుంకాల తగ్గింపు: రొయ్యల సాగులో ఎక్కువ ఖర్చు వాటి మేత కోసం చేయాల్సి ఉంటుంది. కేంద్ర బడ్జెట్లో రొయ్యల మేత తయారీకి అవసరమయ్యే ముడిపదార్థాలపై దిగుమతి సుంకాన్ని తగ్గించారు. దీని వల్ల రైతులకు ప్రయోజనం చేకూరుతుంది. ప్రధాన రిజర్వాయర్లలో చేపల పెంపకం.. దేశవ్యాప్తంగా 500 ప్రధాన రిజర్వాయర్లు, అమృత సరోవర్లలో చేపల పెంపకానికి కేంద్రం శ్రీకారం చుట్టింది. కేజ్ కల్చర్, సీడ్ స్టాకింగ్ బ్రూడ్ బ్యాంకులను ఏర్పాటు చేస్తారు. దీని వల్ల ఏపీ, తెలంగాణల్లోని జలాశయాల్లో చేపల పెంపకానికి మరింత ప్రోత్సాహం లభించనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *