పయనించే సూర్యుడు న్యూస్ : కాలుష్యాన్ని నివారించలేం నియంత్రించవచ్చు అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ‘ఉత్తరాంధ్ర తీర ప్రాంతం ఎంత వేగంగా అభివృద్ధి చెందిందో అంతే వేగంగా ఇక్కడ గాలి నాణ్యత తగ్గుతూ వచ్చింది. గడచిన రెండేళ్ల కాలంలో పరిస్థితులు కాస్త మెరుగుపడినప్పటికీ పరవాడ పారిశ్రామికవాడ పరిధిలోని తాడి గ్రామం లాంటి చోట్ల పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి’అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ‘కాలుష్యం మన దైనందిన జీవితంలో అంతర్భాగంగా మారిపోయింది. రాష్ట్రం ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే కొంత వరకు కాలుష్యాన్ని భరించక తప్పని పరిస్థితి. అయితే కాలుష్యాన్ని పూర్తి స్థాయిలో నివారించలేకపోయినా నిలువరించి నియంత్రించే ప్రయత్నం అయితే జరగాలి. ముఖ్యంగా పారిశ్రామికవాడల్లో కాలుష్య నియంత్రణపై ప్రత్యేక శ్రద్ధపెట్టాలి’అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ నిర్దేశించారు. పరిశ్రమలు కాలుష్య నియంత్రణ మండలి నిబంధనలను తు.చ. నూతన సాంకేతికత సాయంతో వ్యర్థాల నిర్వహణ, గాలి నాణ్యత పెంపు తదితర చర్యలు తీసుకోవాలని తెలిపారు. విశాఖలోని ఓ ప్రైవేటు హోటల్లో శుక్రవారం సాయంత్రం కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో పర్యావరణం, కాలుష్య నియంత్రణ అంశంపై విశాఖ పరిసరాల్లోని పరిశ్రమల యాజమాన్యాలతో సమావేశం అయ్యారు. పోర్టు నుంచి పారిశ్రామికవాడల వరకు యాజమాన్యాలు కాలుష్య నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. తాడిగ్రామంలో ఇంటికొకరు చొప్పున క్యాన్సర్ పేషెంట్స్ ‘ఉత్తరాంధ్ర తీర ప్రాంతం ఎంత వేగంగా అభివృద్ధి చెందిందో అంతే వేగంగా ఇక్కడ గాలి నాణ్యత తగ్గుతూ వచ్చింది. గడచిన రెండేళ్ల కాలంలో పరిస్థితులు కాస్త మెరుగుపడినప్పటికీ పరవాడ పారిశ్రామికవాడ పరిధిలోని తాడి గ్రామం లాంటి చోట్ల పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి’అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు.‘ పరిశ్రమలు నిబంధనలు పాటించవన్న భావన ఉంది ‘రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంటే పరిశ్రమలు రావాలి. అదే సమయంలో ఒక పరిశ్రమను స్థాపించాలి అంటే ఎన్నో సామాజిక అంశాలను పరిగణలోకి తీసుకోవాలి’అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ‘పరిశ్రమలు కాలుష్య నియంత్రణ వ్యవహారంలో నిబంధనలు సరిగా పాటించవన్న భావన ప్రజల్లో బలంగా ఉంది. అన్ని రకాల కాలుష్యాలకు ఉత్తరాంధ్రను డంపింగ్ ప్రాంతం చేశారని ఆ ప్రాంత ప్రజలు వాపోతూ ఉంటారు. పరిశ్రమలు వచ్చిన ప్రతిసారి ప్రజల్లో నిర్లక్ష్యానికి గురవుతున్నామన్న భావన కూడా పెరిగిపోతోంది. పరిశ్రమల యాజమాన్యాలు సాటి మనుషుల పట్ల కనీస బాధ్యతతో స్పందించాల్సిన అవసరం ఉంది. పర్యావరణ పరిరక్షణకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి ‘కూటమి ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది. అందులో భాగంగానే 50 శాతం గ్రీన్ కవర్, గ్రేట్ గ్రీన్ వాల్ ప్రాజెక్టులను ముందుకు తీసుకువెళ్తోంది. ప్రతి పరిశ్రమ 33 శాతం గ్రీన్ బెల్ట్ నిబంధనను పాటించాలి. ‘ఆంధ్రప్రదేశ్ లోని తొమ్మిది కోస్తా జిల్లాల పరిధిలో 970 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది. తీరం మొత్తం 5 కిలోమీటర్ల వెడల్పున, మూడు బఫర్ జోన్లుగా విడగొట్టి మొక్కలతో గోడ నిర్మించేందుకు గ్రేట్ గ్రీన్ వాల్ ప్రాజెక్టును తీసుకువచ్చాం. ఈ బృహత్తర ప్రణాళికలో మీరంతా భాగస్వాములు కావాలని కోరుతున్నాను. గ్రేట్ గ్రీన్ వాల్ తీర ప్రాంతానికి రక్షణ కల్పిస్తుంది. పారిశ్రామికవేత్తలు, ఉద్యోగులు కూడా ఈ మహా యజ్ఞంలో తమ వంతు ప్రాత్ర పోషించాలి. రాష్ట్ర అభివృద్ధిలో మీ మద్దతు అవసరం. అదే సమయంలో పర్యావరణ పరిరక్షణకు మీరు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలి’ అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ఈ సమావేశంలో అటవీ పర్యావరణ శాఖ ప్రధాన కార్యదర్శి కాంతిలాల్ దండే, కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ డాక్టర్ పి. కృష్ణయ్య, ఏపీపీసీబీ మెంబర్ సెక్రటరీ శరవణన్, విశాఖ పోర్టు వైస్ ఛైర్మన్ రోషిణి అపరంజి, విశాఖపట్నం జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్, ఏపీపీసీబీ సభ్యులు డా. సందీప్ పంచకర్ల, వెంకట సందీప్ తదితరులు పాల్గొన్నారు.