జనం న్యూస్: జనసేన నేత, రైల్వే కోడూరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అరవ శ్రీధర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు కలకలం రేపాయి. అయితే ఈ వ్యవహారంపై జనసేన అధిష్టానం స్పందించింది. జనసేన నేత, రైల్వే కోడూరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అరవ శ్రీధర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు కలకలం రేపాయి. అయితే ఈ వ్యవహారంపై జనసేన అధిష్టానం స్పందించింది. ఎమ్మెల్యే శ్రీధర్‌పై వచ్చిన ఆరోపణలపై విచారణకు కమిటీని నియమించింది. శ్రీధర్ ఏడు రోజుల్లోగా కమిటీ ముందు విచారణకు హాజరై వివరణ ఇవ్వాలని పేర్కొంది. ఆ తర్వాత కమిటీ నివేదిక అందిస్తుందని… ఆ నివేదిక పరిశీలన చేసి తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. తుది నిర్ణయం వెలువడేవరకు శ్రీధర్‌ను పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశించింది. ‘‘రైల్వేకోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై ప్రసార మాధ్యమాలలో వచ్చిన వార్తలు, ఒక మహిళ చేసిన ఆరోోపణలపై విచారణ చేయాలని పార్టీ రాష్ట్ర కార్యవర్గం నిర్ణయించింది. ఈ అంశంపై ముగ్గురు సభ్యులతో కమిటీని నియమించడమైనది. టి. శివశంకర్, తంబళ్లపల్లి రమాదేవి, టీసీ వరుణ్ ఈ కమిటీలో ఉన్నారు. అరవ శ్రీధర్ ఏడు రోజుల్లో కమిటీ ముందు హాజరై వివరణ ఇవ్వాలి. కమిటీ సదురు ఆరోపణలపై నిజానిజాలు విచారణ చేసి పార్టీకి నివేదిక అందిస్తుంది. నివేదిక పరిశీలన, తుది నిర్ణయం వెలువడే వరకు అవర శ్రీధర్‌ను పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని స్పష్టం చేస్తున్నాం’’ అని జనసేన అధినేతన పవన్ కల్యాణ్ రాజకీయ కార్యదర్శి హరిప్రసాద్ ఒక ప్రకటన విడుదల చేశారు. అసలేం జరిగిందంటే. ఎమ్మెల్యే శ్రీధర్‌పై ఒక మహిళ (ప్రభుత్వ ఉద్యోగి) లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. ఆన్లైన్లొ వైరల్ అవుతున్న ఒక వీడియోలో… ఎమ్మెల్యే శ్రీధర్ దాదాపు ఒకటిన్నర సంవత్సరాల పాటు తనను లైంగికంగా వేధించారని ఆ మహిళ ఆరోపించారు. శ్రీధర్ ఎమ్మెల్యే అయిన తర్వాత మొదట ఫేస్బుక్ ద్వారా తనను సంప్రదించారని, ఆ తర్వాత తనను లొంగిపోవాలని బెదిరించారని ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలకు సంబంధించినవనిగా చెబుతున్న వీడియోలు, వాట్సాప్ చాట్లు, రీల్స్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వైరల్ అవుతున్నాయి.