భారత్–ఈయూ వాణిజ్య ఒప్పందంపై సంతకం

* ప్రధాని మోదీ ప్రకటన.

జనం న్యూస్: భారత్, యూరోపియన్ యూనియన్ (ఈయూ) మధ్య ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ)పై ఇరుపక్షాలు సోమవారం సంతకం చేశాయి. భారత్, యూరోపియన్ యూనియన్ (ఈయూ) మధ్య ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ)పై ఇరుపక్షాలు సోమవారం సంతకం చేశాయి. మంగళవారం జరిగిన ‘‘ఇండియా ఎనర్జీ వీక్’’ కార్యక్రమంలో వర్చువల్‌గా పాల్గొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ‘‘నేను మీకు ఒక పెద్ద పరిణామం గురించి తెలియజేస్తున్నాను. నిన్న (సోమవారం) భారతదేశం, యూరప్ మధ్య ఒక ముఖ్యమైన ఒప్పందంపై సంతకం చేయబడింది’’ అని మోదీ తెలిపారు. ఈ ఎఫ్‌టీఏ ప్రపంచ జీడీపీలో 25 శాతం, ప్రపంచ వాణిజ్యంలో మూడింట ఒక వంతు వాటా కలిగి ఉందని ఆయన అన్నారు. ఈ ఒప్పందం వెనక కృషి చేసిన అందరినీ అభినందించారు. ప్రజలు ఈ ఒప్పందాన్ని ‘‘మదర్ ఆఫ్ ఆల్ డీల్స్’’ అని పిలుస్తున్నారని. ఈ ఒప్పందం 140 కోట్ల మంది భారతీయులకు, కోట్లాది మంది యూరోపియన్లకు చాలా అవకాశాలను తెచ్చిపెట్టిందని ఆయన అన్నారు. ఇది ప్రపంచంలోని రెండు ఆర్థిక వ్యవస్థల మధ్య సమన్వయానికి ఒక అద్భుతమైన ఉదాహరణ అని మోదీ తెలిపారు. ఈయూతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం బ్రిటన్, యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ (EFTA)తో ఉన్న ఒప్పందాలను పరిపూర్ణం చేస్తుందని… ఇది ప్రపంచ వాణిజ్యం, సప్లై చైన్‌ను బలోపేతం చేస్తుందని మోదీ పేర్కొన్నారు. వస్త్రాలు, రత్నాలు, ఆభరణాలు, తోలు, పాదరక్షలు వంటి రంగాలలో ఉన్న యువతకు, నిపుణులకు ఇది ఎంతో మేలు చేస్తుందని అన్నారు. దేశీయ తయారీకి గణనీయంగా మద్దతు ఇస్తుందని, సేవల రంగంలో వృద్ధిని పెంచుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ప్రపంచంలోని ప్రతి వ్యాపారానికి, ప్రతి పెట్టుబడిదారునికి భారతదేశంపై విశ్వాసాన్ని బలపరుస్తుందని మోదీ పేర్కొన్నారు. భారతదేశం అన్ని రంగాలలో ప్రపంచ భాగస్వామ్యాలపై విస్తృతంగా పనిచేస్తోందని అన్నారు. మరోవైపు భారత్‌కు ఎగుమతి అయ్యే 96.6 శాతం వస్తువులపై సుంకాలను తొలగించడం లేదా తగ్గించడం జరుగుతుందని యూరోపియన్ యూనియన్ తెలిపింది. దీని ఫలితంగా యూరోపియన్ ఉత్పత్తులపై సుంకాలపై ఏటా 4 బిలియన్ యూరోల వరకు ఆదా అవుతుంది. ఈ ఎఫ్‌టీఏ కింద భారతీయులకు యూరోపియన్ కార్లు, బీరు, వివిధ ఆహార ఉత్పత్తులు మరింత సరసమైనవిగా మారుతాయని భావిస్తున్నారు. ‘‘యూరప్, భారతదేశం నేడు చరిత్ర సృష్టిస్తున్నాయి. మదర్ ఆఫ్ ఆల్ డీల్స్‌ను ముగించాము. మేము రెండు బిలియన్ల ప్రజలతో కూడిన స్వేచ్ఛా వాణిజ్య మండలాన్ని సృష్టించాము. ఇరుపక్షాలు ప్రయోజనం పొందుతాయి. ఇది ప్రారంభం మాత్రమే. మేము మా వ్యూహాత్మక సంబంధాన్ని మరింత బలోపేతం చేస్తాము’’అని యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయన్ సంతకం చేయడానికి ముందు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ వాణిజ్య ఒప్పందం ప్రకారం. భారతదేశం తన ఇతర వాణిజ్య భాగస్వాములెవరూ పొందని ఈయూ సుంకాల తగ్గింపులను మంజూరు చేస్తుందని ఈయూ తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *