జాతీయ జెండా కార్యక్రమంలో ఉద్రిక్తత

* స్వల్పంగా తప్పిన మంత్రి శ్రీహరి ప్రమాదం.

జనం న్యూస్: తెలంగాణలోని నారాయణపేటలో గణతంత్ర వేడుకల్లో అపశృతి చోటుచేసుకుంది. అయితే ఈ ఘటనలో ఒకరికి గాయాలు కాగా. మంత్రి వాకిటి శ్రీహరికి పెను ప్రమాదం తప్పింది. తెలంగాణలోని నారాయణపేటలో గణతంత్ర వేడుకల్లో అపశృతి చోటుచేసుకుంది. అయితే ఈ ఘటనలో ఒకరికి గాయాలు కాగా… మంత్రి వాకిటి శ్రీహరికి పెను ప్రమాదం తప్పింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి… దేశవ్యాప్తంగా గణతంత్ర వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెలంగాణలోని నారాయణపేట జిల్లా మక్తల్ తహసిల్దార్ కార్యాలయంలో నిర్వహించిన గణతంత్ర వేడుల్లో మంత్రి వాకిటి శ్రీహరి పాల్గొన్నారు. మంత్రి వాకిటి శ్రీహరి సమక్షంలో జాతీయ జెండాను ఆవిష్కరించగా… ఈ క్రమంలోనే జెండా కోసం అమర్చిన కర్ర ఒక్కసారిగా విరిగిపోయింది. దీంతో జాతీయ జెండా నేలపై పడిపోయింది. విరిగిన జెండా కర్ర తగలడంతో ఒకరికి గాయాలయ్యాయి. మంత్రికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఈ ఘటనలో గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే అధికారులు సరైన ఏర్పాట్లు చేయలేదని మంత్రి వాకిటి శ్రీహరి అనుచరులు అసహనం వ్యక్తం చేశారు. ఇక, దేశవ్యాప్తంగా 77వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెలంగాణలో కూడా గణతంత్ర వేడుకలు వేడుకగా సాగుతున్నాయి. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించి గణతంత్ర వేడుకల్లో భాగంగా గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ వేడుకల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, పలువురు మంత్రులు, సీఎస్ రామకృష్ణారావు, డీజీపీ శివధర్ రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు, తదితరులు హాజరయ్యారు. వివరాలు.. . గణతంత్ర దినోత్సవ వేడుకల కోసం గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ పరేడ్ గ్రౌండ్‌కు చేరుకున్నారు. అక్కడ గవర్నర్‌ జిష్ణు దేవ్ వర్మకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్వాగతం పలికారు. అనంతరం గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ముందుగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం రాష్ట్ర గీతం ఆలపించారు. అనంతరం పరేడ్ గ్రౌండ్‌లో భద్రతా దళాల నుంచి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ గౌరవ వందనం స్వీకరించారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తున్న నేపథ్యంలో ఈ వేడుకలకు హాజరుకాలేదు. ఇక తెలంగాణ సచివాలయంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోనూ అధికారులు రిపబ్లిక్ డే వేడుకలు నిర్వహిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *