వైఎస్ జగన్‌పై జలవనరుల మంత్రి నిమ్మల ఫైర్

* రాజకీయాల నుంచి తీర్థయాత్రలకే సూచన.

జనం న్యూస్: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డిపై రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర విమర్శలు చేశారు. జగన్ ఇక తీర్థయాత్రలు చేసుకోవాల్సిందేనని ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డిపై రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర విమర్శలు చేశారు. జగన్ ఇక తీర్థయాత్రలు చేసుకోవాల్సిందేనని ఎద్దేవా చేశారు. వైఎస్ జగన్ ఇటీవల పార్టీ నాయకుల సమావేశంలో మాట్లాడుతూ… మరో ఏడాదిన్నర తర్వాత తాను పాదయాత్ర చేపట్టనున్నట్టుగా తెలిపారు. అప్పటి నుంచి ప్రజల్లోనే ఉంటానని చెప్పారు. అయితే జగన్‌ ప్రకటనపై టీడీపీ శ్రేణులు ఘాటుగా స్పందిస్తున్నారు. జగన్ తన స్వార్ద ప్రయోజనాల కోసమే పాదయాత్ర అంటూ డ్రామాలు చేస్తున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలోనే మంత్రి నిమ్మల రామానాయుడు కూడా జగన్‌పై తీవ్ర విమర్శలు చేశారు. పల్నాడు జిల్లా చిలకలూరి పేటలో గురువారం ఒంగోలు జాతి ఎడ్ల పోటీలను సందర్శించిన మంత్రులు నిమ్మల రామానాయుడు, సత్యకుమార్ యాదవ్. విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మంత్రి రామానాయుడు మాట్లాడుతూ ఒంగోలు జాతి ఎడ్లు రాష్ట్రానికే కాదు. యావత్ ప్రపంచానికే తలమానికం అన్నారు. జగన్ పాలనలో రాష్ట్రంలో ఇరిగేషన్ రంగం విధ్వంసానికి గురయిందన్నారు. రాష్ట్రంలో 1,050 ఎత్తిపోతల పథకాలు ఉంటే, వాటి నిర్వహణకు జగన్ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని విమర్శించారు. జగన్ నిర్లక్ష్యం వల్ల 840 పథకాలు పని చేయడం లేదని అన్నారు. రాష్ట్రంలో ఉన్న 1,050 ఎత్తిపోతల పథకాలకు మరమ్మతులు చేసి, 6 ఏళ్ళు నిర్వహణ బాధ్యతలు చూసేలా టెండర్లు పిలుస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వం లాకులు, గేట్లు, షటర్లు, రోప్స్‌కు కనీసం గ్రీజు కూడా పెట్టకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఆరోపించారు. నేడు సీఎం చంద్రబాబు ఆధ్వర్యలో ఇరిగేషన్ రంగాన్ని గాడిలో పెడుతున్నామని మంత్రి రామానాయుడు చెప్పారు. జగన్ యాత్ర చేస్తాను అనేది ప్రజలకు సేవ చేయడానికి కాదని అన్నారు. నాడు ఒక్క ఛాన్స్ అంటే జగన్ నిజస్వరూపం తెలియక జనం అధికారం ఇచ్చారని. జగన్ అసలు నైజం ప్రజలకు పూర్తిగా అర్ధమయిందని చెప్పుకొచ్చారు. జగన్ రెడ్డి పాదయాత్రలు, బస్సు యాత్రలు కాదు.. తీర్థయాత్రలు చేసుకోవాలని ఎద్దేవా చేశారు. జగన్ ఎన్ని యాత్రలు చేసినా ఇక జనం నమ్మబోరని మంత్రి రామానాయుడు అన్నారు. ల్యాండ్, మైన్, లిక్కర్, మాదిరి ప్రజల ఆస్తులు దోచుకోవడానికే జగన్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చారని విమర్శించారు. వారసత్వంగా వచ్చిన ఆస్తులను సైతం జగన్ దోచుకోవాలని చూశారని ఆరోపించారు. అయితే ప్రజల ఆశీర్వాదంతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం దానిని రద్దు చేసిందని తెలిపారు. రాజముద్ర ఉండాల్సిన పాస్ పుస్తకాలను జగన్ ఫొటోలతో, వైసీపీ రంగుల్లో ముద్రించారని. నేడు కూటమి ప్రభుత్వం రాజముద్రతో, క్యూ ఆర్ కోర్తో అత్యంత భద్రంగా పాస్ పుస్తకాలు ముద్రిస్తోందని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *