రాజకీయాల నుంచి తప్పుకోనని స్పష్టం చేసిన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి

జనం న్యూస్: ‘రాజకీయాల నుంచి నేను తప్పుకోవడం లేదు. ఈ నెల 25తో నాకు రాజకీయాల్లో ఏడాది ముగుస్తుంది. తిరిగి రాజకీయాల్లోకి వస్తాను’అని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. త్వరలోనే తన భవిష్యత్ కార్యచరణ ప్రకటిస్తానని అన్నారు. వైఎస్ జగన్‌ తన చుట్టూ ఉన్న కోటరీని నమ్మితే ఎప్పటికీ అధికారంలోకి రాలేరని. కూటమి ఇలానే కొనసాగినా వైసీపీ అధికారంలోకి రావడం కలేనని విజయసాయిరెడ్డి చెప్పుకొచ్చారు. పొలిటికల్ రీ ఎంట్రీపై మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.గత ఏడాది రాజకీయాల నుంచి పూర్తిగా వైదొలుగుతున్నట్లు ప్రకటించిన ఆయన యూటర్న్ తీసుకున్నారు. రాబోయే రోజుల్లో రాజకీయంగా యాక్టివ్ అవ్వబోతున్నట్లు తెలిపారు. తాను రాజకీయాల నుంచి తప్పుకోవడం లేదని. జూన్ తర్వాత తన రాజకీయ భవిష్యత్ ప్రణాళికలను వెల్లడిస్తానని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ ఆరోపణల నేపథ్యంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు హాజరైన మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తన రాజకీయ భవిష్యత్ కార్యచరణతోపాటు వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ కోటరీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్ కోటరీ మాటలు వింటే ఎప్పటికీ మళ్లీ అధికారంలోకి రాలేరని చెప్పుకొచ్చారు. ఇకపోతే లిక్కర్ స్కాం కేసు విచారణలో భాగంగా ఈడీ అధికారులు 7 గంటలపాటు సుదీర్ఘంగా విచారించారు. ప్రాంతీయ పార్టీలో నెంబర్ 2 ఉండదు. లిక్క‌ర్ స్కామ్ గురించి త‌న‌కు తెలియ‌ద‌ని ఆ విష‌యాన్ని ఈడీకి తేల్చి చెప్పినట్లు విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. వైసీపీలో మీది నెంబ‌ర్ 2 స్థానం మీకెందుకు తెలియ‌ద‌ని ప్ర‌శ్నించారని. దానికి స్వ‌యానా జ‌గ‌న్ పార్టీలో నంబ‌ర్ 2 స్థానం లేదని చెప్పారని అధికారులకు తెలియజేసినట్లు చెప్పుకొచ్చారు. ప్రాంతీయ పార్టీల్లో నంబర్‌ 2 అనేది ఉండదని చెప్పినట్లు చెప్పుకొచ్చారు. అయితే త‌న‌ను ఎప్పుడూ నెంబ‌ర్ 2 స్థానంలో చూడ‌లేద‌ని కానీ మీడియా, వైసీపీ సోష‌ల్ మీడియా ప‌దే ప‌దే ఇప్పుడు నంబ‌ర్ 2 స్థానంలో ఉన్నాన‌ని ప్ర‌చారం చేస్తోంద‌ని ఆరోపించారు.కేసుల విష‌యంలో అయితే నంబ‌ర్ 2. లాభాల్లో అయితే వంద స్థానాల వ‌ర‌కు కూడా ఉండ‌న‌ని మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి పెదవి విరిచారు.ఈడీ విచారణలో అడిగిన ప్రశ్నల్లో కొన్ని మాత్రమే రికార్డు చేశారని. మరికొన్ని ప్రశ్నలను రికార్డు చేయలేదు అని తెలిపారు. లిక్కర్ స్కాం గురించి తనకు తెలియదు. లిక్కర్ స్కాంలో ఎవరు ఇన్వాల్వ్ అయ్యారో వారినే అడగాలని చెప్పానని మాజీ ఎంపీవిజయసాయి రెడ్డి తేటతెల్లం చేశారు. ఎంపీ మిథున్ రెడ్డి కోరిక మేరకే శ్రీధర్ రెడ్డి కంపెనీకి సిఫారసు. మరోవైపు ఈడీ నోటీసుల మేరకు ఉదయం విచారణకు హాజరైన విజయసాయి రెడ్డిని అధికారులు పలు కోణాల్లో విచారించారు. గత ప్రభుత్వ మద్యం విధానం, విక్రయాలు, నిధుల మళ్లింపు, ఈ వ్యవహారంలో మధ్యవర్తుల పాత్ర వంటి కీలక అంశాలపై ప్రశ్నలు సంధించారు. అయితే మిథున్ రెడ్డి కోరిక మేరకు శ్రీధర్ రెడ్డి కంపెనీకి సిఫారసు చేసిన మాట వాస్తవమేనని. కానీ రూ.100 కోట్లు ఏర్పాటు చేయాలని జగన్ తనతో ఎన్నడూ చెప్పలేదని మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కుండబద్దలు కొట్టారు. కోటరీ మాటలు నమ్మితే జగన్ అధికారంలోకి రాలేరు. వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ చుట్టూ ఉన్న కోటరీపై మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వైసీపీకి ఈ దుస్థితి రావడానికి ఆ కోటరీయే కారణమని ఆరోపించారు. ఆ కోటరీ మాటలు నమ్మితే జగన్ మళ్లీ అధికారంలోకి రావడం అసాధ్యమని స్పష్టం చేశారు. జగన్ చుట్టూ ఉన్న కోటరీ పెట్టే వేధింపులు, అవమానాలు తట్టుకోలేకపోయానని. చివరికి ఆ కోటరీయే నన్ను పొగబెట్టి నెమ్మదిగా పార్టీ నుంచి బయటకు పంపించింది అని విజయసాయిరెడ్డి చెప్పుకొచ్చారు. కోటరీలోని కొందరు ఇప్పటికీ తింటూనే ఉన్నారు. జగన్ జైలులో ఉన్నప్పుడు పార్టీని అంటిపెట్టుకుని ఉన్న తనకు ఇప్పుడు గౌరవం లేకుండా పోయింది. ఈ కోటరీ మాటలు నమ్మడం కొనసాగిస్తే జగన్ ఎప్పటికీ అధికారంలోకి రాలేరు అంటూ మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కుండబద్దలు కొట్టారు. కూట‌మి ఇలానే ఉంటే జ‌గ‌న్ అధికారంలోకి రారు అంటూ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. జగన్‌ను వెన్నుపోటు పొడుస్తానని అభద్రతా భావాన్ని కల్పించారు. 2018వ‌ర‌కు తాను వైఎస్ జ‌గ‌న్ మ‌న‌సులో నంబ‌ర్ 2 స్థానంలో ఉన్నాన‌ని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి గుర్తు చేశారు. తీరా అధికారంలోకి వ‌చ్చాక‌ కోట‌రీ కార‌ణంగా సైడ్ అవుతూ వ‌చ్చాన‌ని చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్‌ను చంద్ర‌బాబు నాయుడు వెన్నుపోటు పొడిచిన‌ట్టు తాను జ‌గ‌న్‌ను వెన్నుపోటు పొడుస్తాన‌ని కోటరీ ఆయ‌న‌లో అభ‌ద్ర‌తా భావాన్ని క‌ల్పించింది అని సంచలన ఆరోపణలు చేశారు. చంద్ర‌బాబు నాయుడు ప్ర‌భుత్వం దుష్ట ప్ర‌భుత్వం అని త‌న‌కు సంబంధం లేని కేసుల్లో ఇరికిస్తోంద‌ని ఆరోపించారు. అధికారం ఎవ‌రికీ శాశ్వ‌తం కాద‌ని జ‌గ‌న్ కూడా 20 ఏళ్లు అధికారంలో ఉంటాన‌ని అనుకున్నార‌ని ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా ఏకంగా 25ఏళ్లు అధికారంలో ఉంటాన‌ని అనుకుంటున్నార‌ని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *