ఇచ్చినమాట నిలబెట్టుకున్న పవన్

*కోటప్పకొండ–కొత్తపాలెం రోడ్ ఓపెన్

సాక్షి డిజిటల్ న్యూస్ : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏదైనా హామీ ఇచ్చారంటే అది నెరవేర్చే వరకు ఊరుకోరు. తాజాగా కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వరస్వామి వారి భక్తులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. కోటప్పకొండ – కొత్తపాలెం గ్రామాల మధ్య నిర్మించిన నూతన రహదారిని ప్రారంభించారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వరస్వామి వారి భక్తులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు.కోటప్పకొండ – కొత్తపాలెం గ్రామాల మధ్య పంచాయతీరాజ్ శాఖ నిధులతో నిర్మించిన నూతన రహదారిని ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు.ఇందులో భాగంగా గురువారం కోట్పకొండ క్షేత్ర దర్శనం అనంతరం కొండ దిగువన ఉన్న శివస్థూపం వద్ద ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం రోడ్డుపై నడుస్తూ నాణ్యతను పరిశీలించారు. రూ.3.9 కోట్ల నిధులతో 8 కిలోమీటర్ల మేర ఈ నూతన రహదారిని నిర్మించారు. గత అసెంబ్లీ సమావేశాల్లో స్థానిక శాసన సభ్యులు డాక్టర్ అరవింద్ బాబు భక్తుల సౌకర్యార్ధం ఈ రోడ్డు నిర్మాణం చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు అర్జీ ఇచ్చారు. శివరాత్రి ఉత్సవాలలోపు రోడ్డు నిర్మిస్తామని ఉప ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. కోటప్పకొండ – కొత్తపాలెం మధ్య నిర్మించిన ఈ రోడ్డుతో శివరాత్రి ఉత్సవాలకు వచ్చే సుమారు లక్షన్నర మంది భక్తుల ప్రయాణ కష్టాలు తీరనున్నాయి. కొత్తపాలెం గ్రామ పరిసరాల్లోని రైతులకు, గోనేపూడి పాఠశాలకు వెళ్లే విద్యార్ధులకు ఇబ్బందులు తొలగనున్నాయి. రోడ్డు ప్రారంభోత్సవం సందర్భంగా గోనేపూడి పాఠశాల విద్యార్ధులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను కలిసి తమ కోసం రహదారి సౌకర్యం కల్పించినందుకు ధన్యవాదాలు తెలిపారు.మరోవైపు గోనేపూడి జిల్లా పరిషత్ పాఠశాలకు క్రీడా మైదానంతోపాటు సౌకర్యాలు కల్పించాలని కోరుతూ వినతిపత్రం ఇచ్చారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *