జనం న్యూస్: ప్రకృతి సాగు చేద్దాం. భూమిని బాగు చేద్దాం అని సీఎం చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. ‘సేంద్రీయ సాగుతో ప్రజారోగ్యం-పర్యావరణానికి మేలు.ప్రపంచానికి నమూనాగా ఏపీలో ప్రకృతి వ్యవసాయం చేపడుతున్నాం.ప్రకృతి వ్యవసాయంతో ఆర్థికాభివృద్ధి సాధ్యమే’అని సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ప్రకృతి సాగు చేయాలని… భూమిని బాగు చేసేలా వ్యవసాయం, ఆహార ఉత్పత్తులను పండించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. ప్రపంచ ఆర్థిక సదస్సులో భాగంగా ప్రకృతి సేద్యం, ప్రత్యామ్నాయ ఆహార పంటల ఉత్పత్తులపై హైలెవల్ మీటింగ్… అలాగే రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏపీలో ప్రకృతి సేద్యానికి తీసుకుంటోన్న చర్యలను వివరించారు. అలాగే గ్లోబల్ మార్కెట్లో నేచురల్ ఫుడ్ ప్రొడక్ట్స్ కు ఉన్న డిమాండుకు తగ్గట్టు రాష్ట్రం ప్రభుత్వం రూపొందించుకున్న ప్రణాళికలను సీఎం చంద్రబాబు వెల్లడించారు. ఈ సందర్బంగా సీఎం చంద్రబాబు మాట్లాడారు.‘ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రకృతి ఆధారిత వ్యవసాయం చేసేందుకు పూర్తి స్థాయి సన్నద్ధంగా ఉంది. ప్రకృతి సేద్యం అనేది కేవలం ఒక వ్యవసాయ పద్ధతి మాత్రమే కాదు. వాతావరణ మార్పులను ఎదుర్కొనే ఒక శక్తివంతమైన ఆయుధం.’అని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ప్రకృతి వ్యవసాయం చేస్తున్న 18 లక్షల మంది. రాష్ట్రంలో ఇప్పటికే 18 లక్షల మంది రైతులు 20 లక్షల ఎకరాల్లో ఎటువంటి ప్రకృతి వ్యవసాయం చేసేందుకు ముందుకు వచ్చారు అని సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ప్రకృతి సేద్యానికి సంబంధించి ప్రపంచానికే ఏపీని ఓ నమూనాగా తీర్చిదిద్దేలా ప్రణాళికలు సిద్దం చేస్తున్నట్లు సీఎం చెప్పుకొచ్చారు.‘ఎరువుల వినియోగం.. రసాయనాల వినియోగంతో చేసే వ్యవసాయంతో పోలిస్తే, ప్రకృతి వ్యవసాయం వల్ల పెట్టుబడి ఖర్చు గణనీయంగా తగ్గుతుంది. రైతులకు మొదటి సంవత్సరం నుంచే అధిక నికర ఆదాయం లభిస్తోంది రైతులు బలోపేతం కావడం వల్ల గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది.’అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వివరించారు. పర్యావరణానికి మేలు చేసేలా. ‘ప్రకృతి వ్యవసాయం ద్వారా భూమిలో కార్బన్ నిల్వ సామర్థ్యం పెరుగుతుంది. అలాగే పర్యావరణానికి మేలు జరుగుతుంది. అలాగే నీటి వినియోగం తగ్గడంతో పాటు. బయోడైవర్సిటీ పెరిగేలా చూసుకోవచ్చు. అలాగే భూసారం తగ్గకుండా. భూమిని మరింత బలంగా. పోషకాలు ఉండేలా చేసుకోవచ్చు. ఫార్మర్ టు ఫార్మర్ అనే పద్దతిలో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రతి గ్రామానికి చేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.’అని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.‘ఇక ప్రకృతి సేద్యంలో అనుభవజ్ఞులైన రైతులు ఇతర రైతులకు శిక్షణ ఇచ్చేలా వ్యవస్థను రూపొందించాం. ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులకు గ్లోబల్ మార్కెట్లలో ఉన్న డిమాండ్‌ను అందిపుచ్చుకోవడానికి వీలుగా సరైన మార్కెటింగ్ వ్యవస్థను, సర్టిఫికేషన్ ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేస్తోంది.’అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తాం. ‘టెక్నాలజీని ఉపయోగించి రైతుల ఉత్పత్తులకు గిట్టుబాటు ధర లభించేలా చర్యలు తీసుకుంటున్నాం. భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన ఆహారాన్ని, పర్యావరణాన్ని అందించేలా రాష్ట్ర ప్రభుత్వం రైతులను సిద్దం చేస్తోంది.’అని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.‘అయితే ప్రకృతి సాగును ప్రొత్సహించేందుకు మెరుగైన పారిశ్రామిక పద్దతులు, ఆర్థిక ప్రొత్సాహకాలు అవసరం. వ్యాపార సంస్థలు తమ ఆర్థిక లాభాల పరంగానే కాకుండా. పర్యావరణాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ప్రస్తుతం గ్లోబల్ మార్కెట్టులో ఉన్న డిమాండ్ ను అంచనా వేసుకుంటూ. అంతర్జాతీయంగా రాష్ట్ర ఉత్పత్తులను ఎగుమతులు చేసేలా భారీ ప్రణాళికలతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. ప్రకృతి సేద్యం ద్వారా పర్యావరణాన్ని కాపాడడంతో పాటు. ఓ పెద్ద బిజినెస్ ఆపర్చునిటీగా నిరూపించే దిశగా ఏపీలోని రైతులను సిద్దం చేస్తున్నాం.’అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ఏపీ కేంద్రంగా ఉద్యాన,ఆక్వా ఉత్పత్తుల ఎగుమతి. ఏపీ నుంచి ఉద్యాన, ఆక్వా, వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులతో పాటు ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల ఏర్పాటును పరిశీలించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యూఏఈకి ప్రతిపాదించారు.దావోస్‌లో ఆ దేశ విదేశీ వాణిజ్య మంత్రి థాని బిన్ అహ్మద్ తో ముఖ్యమంత్రి భేటీ అయ్యారు. ఏపీలో దుబాయ్ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటు ప్రతిపాదనపై ఇరువురు నేతలు చర్చించారు. యూఏఈ కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ఏపీలో విస్తృతంగా మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని సీఎం వివరించారు. అగ్రిటెక్ , ఫుడ్ టెక్, ఆక్వా టెక్ తో పాటు ఫుడ్ పార్కుల అభివృద్ధి, ఆహార భద్రతా చర్యల గురించి ఇరువురు నేతలు చర్చించుకున్నారు. ఆహార ఉత్పత్తులను వేగంగా రవాణా చేసేందుకు వీలుగా ఏపీలో పోర్టులు, ఎయిర్ పోర్టులు, రోడ్డు, రైలు నెట్వర్క్ విస్తృతంగా ఉందని యూఏఈ వాణిజ్య మంత్రికి వివరించారు. వీటితో పాటు జాతీయ పారిశ్రామిక కారిడార్లు కూడా రాష్ట్రంతో అనుసంధానమై ఉన్నాయని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. 160 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా ఏపీ