కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామిని దర్శించిన

* డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.

జనం న్యూస్: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గురువారం రోజున పల్నాడు జిల్లా కోటప్పకొండలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా త్రికోటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గురువారం రోజున పల్నాడు జిల్లా కోటప్పకొండలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా కోటప్పకొండ వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు చేరుకున్నారు. అక్కడ అధికారులు, ప్రజాప్రతినిధులు పవన్ కల్యాణ్‌కు స్వాగతం పలికారు. అనంతరం పవన్ కల్యాణ్ ఘాట్ మార్గంలో కొండపైకి వెళ్లారు. ఈ సమయంలో రోడ్డుకు ఇరువైపులా ఉన్న ప్రజలకు పవన్ కల్యాణ్ అభివాదం చేశారు. కొండపైకి చేరుకుని త్రికోటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పవన్ కల్యాణ్‌కు ఆలయ అర్చకులు, పండితులు వేదాశీర్వచనం అందజేశారు. తర్వాత కొండ దిగువన కోటప్పకొండ-కొత్తపాలెం నూతన రహదారిని పవన్ కల్యాణ్ ప్రారంభించనున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటన నేపథ్యంలో కోటప్పకొండలో అధికారులు భారీ భద్రత ఏర్పాట్లు చేపట్టారు. హెలిప్యాడ్, కొండపైన ఆలయం ఇలా పవన్ కల్యాణ్ పర్యటన సాగే ప్రాంతాల్లో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. పవన్ కల్యాణ్‌ను చూసేందుకు భారీగా జనాలు తరలివచ్చే అవకాశం ఉండటంతో అదనపు బలగాలను మోహరించారు. పవన్ కల్యాణ్ ప్రయాణించే మార్గంలో ట్రాఫిక్ అంతరాయం లేకుండా పర్యవేక్షణ చేపట్టారు. సర్వదా అప్రమత్తంగా ఉందాం. పవన్ కల్యాణ్. ఇదిలాఉంటే, జనసేన పార్టీ శ్రేణులకు ఏపీ ఉప ముఖ్యమంత్రి, ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కీలక సూచనలు చేశారు. జనసేనపై ఎటువంటి దుష్ట శక్తుల దృష్టి సోకకుండా కాపుకాస్తున్న జన సైనికులు, వీర మహిళలు, నాయకులూ సర్వదా ప్రశంసనీయులు అన్నారు. జనసేనకు చెందిన కొందరు నాయకులతో మాట్లాడుతూ… పార్టీ సంస్థాగత విషయాలపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ… ఈ మధ్యకాలంలో వ్యక్తుల మధ్య జరుగుతున్న ఘర్షణలు, ఆర్ధిక లావాదేవీలు, మానసిక బలహీనతలు, వ్యక్తిగత కుల విభేదాలను జనసేనకు ఆపాదించడానికి కిరాయి వక్తలు, కిరాయి మాధ్యమాలు కలిసి కుయుక్తులు పన్నుతున్నాయని ఆరోపించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *