పయనించే సూర్యుడు న్యూస్ : భారతీయ జనతా పార్టీ నూతన అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఎన్నికయ్యారు. ఆయనకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. భారతీయ జనతా పార్టీ నూతన అధ్యక్షుడిగా నితిన్ నబీన్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. 45 ఏళ్ల వయసులోనే బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన అతి పిన్న వయస్కుడిగా ఆయన గుర్తింపు పొందారు. ఇది ఇలా ఉండగా బీజేపీకి నితిన్ నబిన్ 12వ జాతీయ అధ్యక్షుడు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ, ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీనైనా బీజేపీకి అధ్యక్షుడిగా నితిన్ నబీన్ బాధ్యతలు స్వీకరించినందుకు ఆయనకు అభినందనలు తెలిపారు. పార్టీని బలోపేతం చేయడంలో గత అధ్యక్షులు అందరూ చేసిన కృషికి తాను కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు చెప్పారు. నేను ఒక కార్యకర్తను. ‘నితిన్ నబీన్ ఇప్పుడు నా బాస్’ అంటూ ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. ఆయన కేంద్ర మంత్రి జేపీ నడ్డా స్థానంలో ఈ బాధ్యతలు స్వీకరించారు. కొత్త బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన నితిన్ నబీన్ : సీనియర్ బీజేపీ నేత నితిన్ నబీన్‌ను పార్టీ కొత్త జాతీయ అధ్యక్షుడిగా నియమించింది. ఈ నియామకం, ఈ ఏడాది జరగనున్న కీలక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు పార్టీ సంస్థాగత బలంపై, నాయకత్వం మార్పుపై బీజేపీ ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. 45 ఏళ్ల వయసులోనే బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఎన్నికవ్వడం గమనార్హం. నితిన్ నబీన్‌కు వ్యతిరేకంగా ఎవరూ నామినేషన్ దాఖలు చేయకపోవడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవం అయింది. దీంతో బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఎంపిక అయ్యారు. ఆయన అభ్యర్థత్వానికి ప్రధాని నరేంద్ర మోదీ మద్దతు పలికారు. అసలు ఎవరీ నితిన్ నబీన్ : నితిన్ నబీన్ 1980లో జన్మించారు. ఇదే బీజేపీ స్థాపన సంవత్సరం కావడం గమనార్హం. ఆన బిహార్‌లో ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అలాగే గతంలో బిహార్ మంత్రివర్గంలో పలు శాఖలు నిర్వహించారు. ఇప్పటివరకూ బీజేపీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉన్న నితిన్ నబీన్ సిన్హా ఇప్పుడు జాతీయ అధ్యక్షుడిగా పూర్తిస్థాయిలో బాధ్యతలు స్వీకరించారు. దివంగత సీనియర్ బీజేపీ నేత, నాలుగు సార్లు బీహార్ ఎమ్మెల్యేగా పని చేసిన నబిన్ కిషోర్ ప్రసాద్ సిన్హా కుమారుడే నితిన్ నబీన్. ఆయన తన తండ్రి మరణం తర్వాత 2006లో రాజకీయాల్లోకి ప్రవేశించారు. పట్నా వెస్ట్ నియోజకవర్గం ఉప ఎన్నికలో విజయం సాధించినట్లు తెలుస్తోంది. నితీష్ కుమార్ నేతృత్వంలోని బిహార్ ప్రభుత్వంలో ఆయన రహదారుల నిర్మాణం, పట్టణాభివృద్ధి శాఖల మంత్రిగా పని చేశారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వ పదవికి రాజీనామా చేశారు. ఛత్తీస్‌గఢ్ వంటి రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి రావడంలో కీలక పాత్ర : దాదాపు రెండు దశాబ్దాల రాజకీయ అనుభవం కలిగిన నబిన్, పార్టీ ముందు అనే సిద్ధాంతంతో పని చేసే నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు. బీజేపీ బిహార్ యువజన విభాగంలో పని చేస్తూ రాజకీయంగా ఎదిగారు. ఛత్తీస్‌గఢ్ వంటి రాష్ట్రాల్లోనూ కీలక ఎన్నికల బాధ్యతలు నిర్వహించారు. కాంగ్రెస్ పాలనను గద్దె దించి మళ్లీ బీజేపీ అధికారంలోకి రావడంలో ఆయన కీలక పాత్ర పోషించారు.