ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం

* మత్స్యకారులకు రూ.10 లక్షల ఇన్సూరెన్స్ అమలు.

సాక్షి డిజిటల్ న్యూస్: ఏపీ ప్రభుత్వం మత్స్యకార కుటుంబాలకు భరోసా కల్పించేలా కీలక నిర్ణయం తీసుకుంది. మత్స్యకారులు చేపలవేటకు వెళ్లి ప్రమాదవశాత్తు మరణిస్తే వారికి ప్రధాన మంత్రి మత్స్యసంపద యోజన పథకం కింద ఇచ్చే బీమాను భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకార కుటుంబాల కోసం కీలక నిర్ణయం తీసుకుంది. మత్స్యకారులు ప్రమాదవ శాత్తు మరణిస్తే రూ.10 లక్షల బీమా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. చేపల వేటపై ఆధారపడి జీవించే మత్స్యకారులు ప్రమాదవశాత్తు మరణిస్తే వారి కుటుంబాలను ఆదుకోవాలనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఒకప్పుడు ప్రమాద బీమా రూ.2 లక్షలు ఉండగా దాన్ని రూ.10 లక్షలకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.ఒకప్పుడు మత్స్యకారుడు చేపలవేటకు వెళ్లి ప్రమాదవశాత్తు మరణిస్తే ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన (పీఎంఎంఎస్‌వై) పథకం కింద రూ.2 లక్షలు పరిహారాన్ని అందజేసేది. అయితే ఇప్పుడు ఆ పరిహారాన్ని ఒక్కసారిగా రూ.10 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. వేట కోసం సముద్రంలోకి వెళ్లి ప్రాణాలు కోల్పోయిన మత్స్యకారుల కుటుంబాలకు ఈ బీమా ఆర్థికంగా అండగా నిలవనుంది అని ప్రభుత్వం భావిస్తోంది.. రూ.10 లక్షలు బీమా ఏపీ ప్రభుత్వం మత్స్యకార కుటుంబాలకు భరోసా కల్పించేలా కీలక నిర్ణయం తీసుకుంది. మత్స్యకారులు చేపలవేటకు వెళ్లి ప్రమాదవశాత్తు మరణిస్తే వారికి ప్రధాన మంత్రి మత్స్యసంపద యోజన పథకం కింద ఇచ్చే బీమాను భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది.ఈ పథకం కింద చేపల వేట సమయంలో జరిగే ప్రమాద మరణాలకు మాత్రమే రూ.10 లక్షల పరిహారం వర్తిస్తుంది. అదే సమయంలో సాధారణ మరణాలు లేదా ఇతర ప్రమాదాల్లో మరణించిన మత్స్యకారుల కుటుంబాలకు కార్మిక శాఖ ద్వారా రూ.2 లక్షల పరిహారం అందుతుంది అని ప్రభుత్వం తెలిపింది. ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన పథకానికి అర్హతలు ఇవే తప్పనిసరిగా మత్స్యకార సహకార సంఘంలో సభ్యులై ఉండాలి చేపల వేట లైసెన్స్ కలిగి ఉండాలి సముద్రంలోకి వెళ్లే బోట్లలో పనిచేసే సిబ్బంది తమ పేర్లను మత్స్యశాఖ అధికారుల వద్ద ఖచ్చితంగా నమోదు చేసుకోవాలి అందజేయాల్సిన కార్డులు ఆధార్ కార్డు మరణ ధ్రువీకరణ పత్రం పంచనామా రిపోర్ట్ రేషన్ కార్డు సహకార సంఘం సభ్యత్వ ధ్రువీకరణ పత్రం సంఘం తీర్మానం కాపీ పై ధృవీకరణ పత్రాలనుజిల్లా మత్స్యశాఖ కార్యాలయంలో లేదా రైతు సేవా కేంద్రాల్లో సమర్పించాలి అని ప్రభుత్వం పేర్కొంది.బీమా మొత్తాన్ని కూడా రూ.2 లక్షల నుంచి ఏకంగా రూ.10 లక్షలకు పెంచడంతో మత్స్యకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తమ వర్గాలకు మరింత ధైర్యాన్ని ఇస్తోంది అని భావిస్తున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారయంత్రాంగం సూచిస్తోంది. మత్స్యకారులకు ఆర్థిక సాయం రూ.20వేలకు పెంపు. ‘రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రాకతో మత్స్యకారుల దశ మారిందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వేట నిషేధ సమయంలో ఆర్థికసాయం రెట్టింపు చేసి.. విడుదల చేశామని.. దీని వల్ల 1,29,178 మత్స్యకార కుటుంబాలకు రూ. 259 కోట్ల లబ్ధి చేకూరిందని సీఎం చంద్రబాబు అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *