ఎన్టీఆర్‌కు భారతరత్న అవార్డు తప్పకుండా సాధిస్తాం

* సీఎం చంద్రబాబు

జనం న్యూస్ :  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ వ్యవస్థాపకులు నందమూరి తారకరామారావుకు భారతరత్న అవార్డు ఇవ్వాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ వ్యవస్థాపకులు నందమూరి తారకరామారావుకు భారతరత్న అవార్డు ఇవ్వాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈ దేశంలో నీతి, నిజాయితీ రాజకీయాలు చేసిన వ్యక్తి జాతి కోసం పనిచేసిన వ్యక్తి ఎన్టీఆర్ అని పేర్కొన్నారు. అలాంటి వ్యక్తికి భారతరత్న ఇవ్వడం జాతికి గౌరవం అని అన్నారు. ఇది తెలుగువారి చిరకాల ఆకాంక్షఅని చెప్పారు. ఎన్టీఆర్‌కు భారతరత్న అవార్డు తప్పకుండా సాధిస్తామనే నమ్మకం తనకు ఉందని తెలిపారు. ఇందుకోసం అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తామని చెప్పారు. ఎన్టీఆర్‌ వర్ధంతి సందర్భంగా టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన విగ్రహానికి చంద్రబాబు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ ఎన్టీఆర్ మనందరికీ దూరమై 30 ఏళ్లు అవుతున్నా తెలుగు జాతి గుండెల్లో శాశ్వతంగా ఉండే ఏకైక నాయకుడని అన్నారు. తెలుగు జాతి ఖ్యాతిని ఎవరెస్ట్ అంత ఎత్తుకు తీసుకెళ్లిన యుగపురుషుడు అని పేర్కొన్నారు. పార్టీ పెట్టిన 9 నెలల్లో అధికారంలోకి వచ్చి ఎన్టీఆర్ ఒక చరిత్ర సృష్టించారని తెలిపారు. దేశంలో సుపరిపాలనకు ఎన్టీఆర్ అర్థం చెప్పారని అన్నారు. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు నాంది పలికారుని చెప్పారు. విద్యావంతులు, బడుగులకు టికెట్లు ఇచ్చి ఎన్నో అవకాశాలు కల్పించారని విద్యావంతులను, మేధావులను, సమర్థులను ఎన్టీఆర్ రాజకీయాల్లోకి తీసుకొచ్చారని పేర్కొన్నారు. సామాజిక న్యాయం చేశారని తెలుగు జాతి ఆత్మగౌరవ నినాదంతో ముందుకెళ్లారని చెప్పారు.పేదల అభ్యున్నతే లక్ష్యంగా పాలన సాగించారని తెలిపారు. పొట్టి శ్రీరాములు తెలుగు రాష్ట్రం కోసం పోరాడి సాధించారని మదరాసిలు అని తెలుగు వాళ్లను పిలుస్తున్న రోజుల్లో తెలుగు జాతికి ఎన్టీఆర్ గుర్తింపు తెచ్చారని అన్నారు. పాలనలో సంస్కరణలు తీసుకొచ్చారని తెలిపారు. బడుగులకు కొత్త చట్టాల తీసుకొచ్చారని చెప్పారు. మహిళలకు ఆస్తిలో సమాన హక్కు తీసుకొచ్చారు. తర్వాత అది దేశంలో చట్టం అయిందని అన్నారు. బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించారు మహిళలకు స్థానిక సంస్థల్లో 9 శాతం రిజర్వేషన్లు కల్పించారని తెలిపారు. తాను 33 శాతం చేశానని చెప్పారు. నేడు రాబోయే ఎన్నికల్లో పార్లమెంట్, శాసన సభల్లో 33 శాతం మహిళలకు రాబోతున్నాయని ఇది మార్పుకు నాంది అని పేర్కొన్నారు. ఎన్టీఆర్ రూ .2 కే కేజీ బియ్యం ఇచ్చారని కొన్ని వర్గాలు బియ్యం తినే పరిస్థితి లేదని తెలిపారు. ఎన్టీఆర్ వచ్చాక రూ. 2లకే కిలో బియ్యం ఇచ్చి ఆహార భద్రతకు నాంది పలికారని చెప్పారు. తిరుమలలో అన్నదానం ప్రవేశపెట్టారని చంద్రబాబు తెలిపారు. లక్ష మందికి తిరుమలలో నిత్యం అన్నదానం జరుగుతోందని చెప్పారు. నేడు అన్న క్యాంటీన్ల ద్వారా రూ. 5 లకే అన్నం పెడుతున్నామని తెలిపారు. అన్ని నియోజకవర్గాల్లో అన్నక్యాంటీన్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఎన్టీఆర్ వృద్ధులకు రూ. 35లతో పింఛను ప్రారంభించారని దాన్ని తాను రూ. 70 చేశానని తెలిపారు. రూ.200 ఉంటే రూ.2000 లకు, ఇప్పుడు రూ.4 వేలకు పెంచామని చెప్పారు. పేదలకు ఎన్టీఆర్ పక్కా ఇళ్లను ఇచ్చారని… అదే బాటలో ఇప్పుడు ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున ఇళ్ల నిర్మాణాలు చేపట్టి పేదలతో సామూహిక గృహ ప్రవేశాలు చేయిస్తున్నామని తెలిపారు. టీడీపీకి ఎన్టీఆర్ చాలా బలమైన ఫౌండేషన్ వేశారని అన్నారు. టీడీపీ పనైపోయిందన్న వారి పనే అయిపోయింది తప్ప.. టీడీపీ చెక్కుచెదరలేదని చెప్పారు. ఎన్నో ప్రాంతీయ పార్టీలు ఉన్నాయని కానీ దేశ రాజకీయాల్లో చక్రం తిప్పిన పార్టీ టీడీపీ అని తెలిపారు. 1985లో 35 మంది ఎంపీలతో కేంద్రంలో ప్రతిపక్ష హోదా నిర్వహించిందని చెప్పారు. గతంలో వైసీపీ రాజధాని విషయంలో మూడు ముక్కలాట ఆడిందని ఇప్పుడు ముఖ్యమంత్రి ఎక్కడుంటే అక్కడే రాజధాని అని చెబుతుందని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని గర్వంగా కాలర్ ఎత్తుకొని చెబుతున్నామని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *