రాజకీయ హీట్ పెరిగింది

* జేసీకి కేతిరెడ్డి డిబేట్ సవాల్.

జనం న్యూస్: తాడిపత్రి అసెంబ్లీ నియోజకవర్గంలో వాతావరణం ఒక్కసారిగా హీటెక్కింది.నిత్యం హాట్ హాట్‌గా ఉండే తాడిపత్రి నియోజకవర్గంలో తాజాగా కేతిరెడ్డి పెద్దారెడ్డి సవాల్ విసరడం సంచలనంగా మారింది.జేసీ కుటుంబంతో రాయలసీమలో ఎక్కడైనా చర్చకు సిద్ధం అని సవాల్ విసిరారు.అభివృద్ధి పరంగానో..రాజకీయ పరంగానే చర్చకు తాను సిద్ధమని అంతేకానీ వ్యక్తిగతంగా కుటుంబాన్ని టార్గెట్ చేస్తే సహించేది లేది మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఛాలెంజ్ విసిరారు. ఆధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో తాడిపత్రి అసెంబ్లీ నియోజకవర్గం ఎప్పుడూ హాట్ టాపిక్‌గానే ఉంటుంది. జేసీ ప్రభాకర్ రెడ్డి,కేతిరెడ్డి పెద్దారెడ్డిల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. జేసీ ప్రభాకర్ రెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డిల మధ్య నిత్యం రాజకీయ యుద్ధ వాతావరణమే నడుస్తోంది. దీంతో తాడిపత్రి పొలిటికల్ నిప్పుల కొలిమిలా మారింది. తాజాగా జేసీ ప్రభాకర్ రెడ్డికి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సవాల్ విసిరారు. తాడిపత్రి నియోజకవర్గంలో 30 ఏళ్ల జేసీ కుటుంబ పాలనకు,ఐదేళ్ల త‌న పాల‌న‌పై తాను రాయ‌ల‌సీమ ప్రాంతంలో ఎక్క‌డైనా చర్చకు సిద్ధమేన‌ని ఛాలెంజ్ చేశారు. కలెక్ట‌ర్‌, ఎస్పీతో మాట్లాడి టైమ్‌, డేట్ ఫిక్స్ చేయాల‌ని తాడిప‌త్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి స‌వాల్ విసిరారు. పౌరుషాల పేరుతో త‌న కుటుంబాన్ని టార్గెట్ చేయడం మానేసి, రాజకీయంగానో లేదా అభివృద్ధి పరంగానో ఎదుర్కోవాలని జేసీ ప్ర‌భాక‌ర్‌ రెడ్డికి సూచించారు. ఏదైనా ఉంటే రెండు కుటుంబాలం చూసుకుందాం త‌ప్ప‌, అమాయ‌కుల‌ను బ‌లి చేయ‌డం మానుకోవాల‌ని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి హితవుప‌లికారు. వ్యక్తిగత పౌరుషాల గురించి మాట్లాడితే సహించం. మరోవైపు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ విషయంలో ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంక‌ట్రామిరెడ్డి చేసిన వ్యాఖ్య‌ల‌ను మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి స‌మ‌ర్థించారు. వెంకట్రామిరెడ్డి మాటల్లో ఏదైనా త‌ప్పుంటే పోలీసుల‌కు ఫిర్యాదు చేసి ప్ర‌భుత్వం త‌ర‌ఫున చ‌ర్య‌లు తీసుకోవాలే కానీ మా కుటుంబాన్ని వ్య‌క్తిగ‌తంగా టార్గెట్ చేసి మాట్లాడ‌తానంటే మాత్రం చూస్తూ ఊరుకునేది లేద‌ని హెచ్చరించారు. ప్రభుత్వం వైపు నుంచి మాట్లాడకుండా వ్యక్తిగత పౌరుషాల గురించి మాట్లాడటం సరికాదని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి హితవు పలికారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *