ఏపీ ఆరోగ్య శాఖకు

* జాతీయ గుర్తింపు

పయనించే సూర్యుడు న్యూస్ : ఆంధ్రప్రదేశ్ వైద్యఆరోగ్యశాఖకు అరుదైన గుర్తింపు దక్కింది. బడిపిల్లల కంటి రక్షణకు ఏపీ వైద్యఆరోగ్యశాఖ తీసుకుంటున్న చర్యలపై కేంద్రం ప్రశంసలు కురిపించింది. రాష్ట్రంలో అమలవుతున్న ఉత్తమ విధానాల(బెస్ట్ ప్రాక్టీసెస్)ను ఇతర రాష్ట్రాల్లో కూడా అమలుచేసేందుకు త్వరలోనే మార్గదర్శకాలు జారీ చేస్తామని కేంద్రం వెల్లడించింది. 2024–25, 2025–26 విద్యా సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను రాష్ట్రంలో అమలవుతున్న ఉత్తమ విధానాల(బెస్ట్ ప్రాక్టీసెస్)ను ఇతర రాష్ట్రాల్లో కూడా అమలుచేసేందుకు త్వరలోనే మార్గదర్శకాలు జారీ చేస్తామని కేంద్రం వెల్లడించింది. ఈ నేపథ్యంలో 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి రాష్ట్రానికి కేటాయించిన కంటి అద్దాల పంపిణీ వార్షిక లక్ష్యాన్ని 90 వేల నుంచి ఏకంగా 2.50 లక్షలకు కేంద్రం పెంచడం విశేషం. రాష్ట్రానికి జాతీయ స్థాయిలో ఈ గుర్తింపు లభించడంపై అధికారులను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అభినందించారు. ఇదే స్ఫూర్తిని ఇకమీదట కూడా కొనసాగించాలని మంత్రి పిలుపునిచ్చారని వైద్య, ఆరోగ్య శాఖ ఫ్రైడే ఓ ప్రకటన లో తెలిపిoది. కంటి పరీక్షలు, అద్దాల పంపిణీకి పకడ్బందీ ప్రణాళిక జాతీయ అంధత్వ నివారణ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి కంటి అద్దాలు పంపిణీ చేస్తున్నారు. సంబంధించిన వ్యయంగా రూ.3 కోట్లను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60:40 నిష్పత్తిలో భరిస్తున్నాయి. ప్రతి కంటి అద్దానికి గరిష్ఠంగా రూ.280 వరకు వ్యయం అవుతోంది. 6 నుంచి 18 ఏళ్లలోపు వయస్సు గల ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పారా మెడికల్ ఆఫాల్మిక్ ఆఫీసర్లు / పారా మెడికల్ ఆఫాల్మిక్ అసిస్టెంట్ల ద్వారా కంటి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రతి ఏడాది జూలై నుంచి నవంబర్ వరకు ఈ పరీక్షలు కొనసాగుతాయి. 6/12 కంటే తక్కువ కంటి చూపు ఉన్న విద్యార్థుల్లో 90 వేల మందికి కంటి అద్దాలు అందజేయాలన్న లక్ష్యాన్ని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి నిర్దేశించినధి. కంటి అద్దాల నాణ్యతపై ప్రత్యేక శ్రద్ధ ప్రతి ఏడాది నవంబర్ నెలలో కంటి పరీక్షలు పూర్తయిన వెంటనే జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లా అంధత్వ నివారణ సంఘం (District Blindness Control Society) ద్వారా ఓపెన్ టెండర్ విధానంలో కంటి అద్దాల సరఫరా సంస్థలను ఎంపిక చేస్తున్నారు. రాష్ట్రంలో కంటి పరీక్షలు, కంటి అద్దాల పంపిణీ పురోగతి సంతృప్తికరంగా ఉండటంతో 90 వేలకు బదులు 2026–27 విద్యా సంవత్సరానికి 2.50 లక్షల మంది విద్యార్థులకు కంటి అద్దాలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేసింది. దీనివల్ల సుమారు రూ.7.70 కోట్ల వరకు వ్యయమవుతుంది. ఎన్జీఓ ల చేయూత 2024–25 సంవత్సరానికి 90 వేల మందికి కంటి అద్దాలు పంపిణీ చేయాలన్న లక్ష్యానికి గాను 1,89,102 మందికి అద్దాలు అందించారు. 2025–26 సంవత్సరానికి ఇప్పటివరకు 94,689 మందికి కంటి అద్దాలు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *