పాక్‌పై భారత ఆర్మీ ప్రభావం

*రాజ్యాంగ మార్పుల వెనుక అసలు కథ: సీడీఎస్ సంచలన వ్యాఖ్యలు

సాక్షి డిజిటల్ న్యూస్ : సరిహద్దుల్లో భారత సైన్యం గర్జిస్తే.. శత్రుదేశం గుండెల్లో రైళ్లు పరిగెడతాయని మరోసారి నిరూపితమైందని సీడీఎస్ జనరల్ అనిల్ చౌహాన్ తెలిపారు. ముఖ్యంగా భారత రక్షణ దళాలు చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ ధాటికి.. పాకిస్థాన్ రాత్రికి రాత్రే తన రాజ్యాంగాన్ని సవరించుకుని రక్షణ వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేసుకుందని గుర్తు చేశారు. “పాక్ తన రాజ్యాంగంలోని ఆర్టికల్ 243ని హడావిడిగా మార్చిందంటేనే.. ఈ ఆపరేషన్‌తో వారు ఎంతలా దెబ్బతిన్నారో అర్థమవుతోంది” అని ఆయన ఎద్దేవా చేశారు. భారత సైన్యం పరాక్రమం ధాటికి పాకిస్థాన్ తన రక్షణ వ్యవస్థనే మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (CDS) జనరల్ అనిల్ చౌహాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పుణెలో జరిగిన పబ్లిక్ పాలసీ ఫెస్టివల్లో ఆయన మాట్లాడుతూ.. భారత సైన్యం చేపట్టిన భారత సైన్యం పరాక్రమం ధాటికి పాకిస్థాన్ తన రక్షణ వ్యవస్థనే మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (CDS) జనరల్ అనిల్ చౌహాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పుణెలో జరిగిన పబ్లిక్ పాలసీ ఫెస్టివల్లో ఆయన మాట్లాడుతూ.. భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ సృష్టించిన ప్రభావం వల్ల పాకిస్థాన్ హడావిడిగా తన రాజ్యాంగానికి సవరణలు చేసుకోవాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ఇది భారత్ సాధించిన వ్యూహాత్మక విజయానికి నిదర్శనమని ఆయన స్పష్టం చేశారు.సృష్టించిన ప్రభావం వల్ల పాకిస్థాన్ హడావిడిగా తన రాజ్యాంగానికి సవరణలు చేసుకోవాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ఇది భారత్ సాధించిన వ్యూహాత్మక విజయానికి నిదర్శనమని ఆయన స్పష్టం చేశారు. రాజ్యాంగ సవరణలు.. బలహీనతకు నిదర్శనం ఆపరేషన్ సిందూర్ సమయంలో తమ రక్షణ వ్యవస్థలోని లోపాలను గుర్తించిన పాకిస్థాన్.. తమ రాజ్యాంగంలోని ఆర్టికల్ 243ని సవరించిందని సీడీఎస్ అనిల్ చౌహాన్ తెలిపారు. ము‌ఖ్యంగా తమ దేశంలోని ‘హయ్యర్ డిఫెన్స్ ఆర్గనైజేషన్’లో భారీ మార్పులు చేసిందని ఆయన వివరించారు. ఈ ఆపరేషన్‌లో తాము దెబ్బతిన్నామనే నిజాన్ని పాకిస్థాన్ పరోక్షంగా ఈ రాజ్యాంగ సవరణల ద్వారా అంగీకరించిందని జనరల్ అనిల్ చౌహాన్ ఎద్దేవా చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *