పయనించే సూర్యుడు న్యూస్ : తెలంగాణలో జనసేన పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసే దిశగా మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలని జనసేన పార్టీ నిర్ణయం తీసుకుంది. ఎన్నికలకు తక్కువ సమయం ఉన్నందున ప్రతీ జనసైనికుడు, వీరమహిళ ఉత్సాహంగా ఎన్నికల ప్రచారానికి సిద్ధం కావాలి అని జనసేన పార్టీ పిలుపునిచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసేన పార్టీ మాంచి ఫామ్లో ఉన్న సంగతి తెలిసిందే. 2024లో జరిగిన ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలుపొంది సరికొత్త రికార్డు సృష్టించింది. 100 శాతం స్ట్రైక్ రేట్ సాధించింది. అసెంబ్లీలో 21 మంది ఎమ్మెల్యేలు పార్లమెంట్ తరఫున ఇద్దరు ఎంపీలు గెలుపొందిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఓ ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పోటీ తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలని జనసేన పార్టీ ఉవ్విళ్లూరుతుంది. తెలంగాణలో ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో జనసేన పార్టీ బలపరిచిన అభ్యర్థులు భారీ సంఖ్యలో గెలుపొందారు. దీంతో తెలంగాణ జనసేన పార్టీకి కార్యకర్తల బలం ఉందని పార్టీ భావించింది. ఈ క్రమంలో మున్సిపల్ ఎన్నికల్లో కూడా పోటీ చేయాలని జనసేన పార్టీ భావిస్తోంది. తెలంగాణలో జనసేన పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసే దిశగా, మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలని జనసేన పార్టీ నిర్ణయించింది. ఈ మేరకుజనసేన పార్టీ ఒక ప్రకటనవిడుదల చేసింది. సాధ్యమైనన్ని స్థానాల్లో జనసేన పార్టీ పోటీతెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేయడాన్ని స్వాగతిస్తున్నట్లు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి తాళ్లూరి రామ్ స్పష్టం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలనే లక్ష్యంతో ఇప్పటికే పార్టీ కార్యచరణ ప్రారంభించింది అని ప్రకటనలో పేర్కొన్నారు. తెలంగాణలో సరికొత్త రాజకీయవేదిక జనసేన పునాది జనసేన పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడం.. పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ భావజాలాన్ని ఆయన ఆశయాలను తెలంగాణ ప్రాంతం పట్ల ఆయనకున్న అనుబంధాన్ని ప్రజలకు చేరవేయడం తద్వారా తెలంగాణలో సరికొత్త రాజకీయ వేదికకు బలమైన పునాది వేయడమే లక్ష్యంగా పోటీ చేయచున్నాం అని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి తాళ్లూరి రామ్ ప్రకటించారు.