జనం న్యూస్: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం అంటే హిందువులందరికీ పరమ పవిత్రమైన క్షేత్రం అని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. ప్రపంచం నలుమూలల నుంచి కోట్లాది మంది భక్తులు నమ్మకంతో వచ్చే ఈ దైవస్థానాన్ని గత ఐదేళ్ల వైసీపీ పాలనలో అశ్రద్ధగా, వ్యాపార కేంద్రంలా మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు.దేవుడంటే భయం, భక్తి లేని ఈ బ్యాచ్ ఇప్పటికీ వెకిలి చేష్టలతో అలజడి సృష్టించేందుకు ప్రయత్నిస్తోందని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ మండిపడ్డారు. తిరుమల పవిత్రతను లక్ష్యంగా చేసుకుని వైసీపీ ముష్కర మూక కూటమి ప్రభుత్వంపై విష ప్రచారం చేస్తూ భక్తుల మనోభావాలతో చెలగాటమాడుతున్నారని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.మంగళగిరిలోని తెలుగుదేశం కేంద్ర కార్యాలయంలో శనివారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం అంటే హిందువులందరికీ పరమ పవిత్రమైన క్షేత్రం అని అన్నారు. ప్రపంచం నలుమూలల నుంచి కోట్లాది మంది భక్తులు నమ్మకంతో వచ్చే ఈ దైవస్థానాన్ని గత ఐదేళ్ల వైసీపీ పాలనలో అశ్రద్ధగా, వ్యాపార కేంద్రంలా మార్చారని మంత్రి వాసంశెట్టి సుభాష్ మండిపడ్డారు. దేవుడంటే భయం, భక్తి లేని వ్యక్తిని టీటీడీ చైర్మన్గా నియమించడం, దర్శనాలను కమర్షియల్గా మార్చే వారిని పాలకవర్గంలోకి తీసుకురావడం ద్వారా తిరుమల పవిత్రతను దెబ్బతీశారని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ విమర్శించారు. ప్రశాంతంగా ఉత్తర ద్వార దర్శనం. ‘వైసీపీ పాలనలో కొందరు నేతలు, వారి అనుచరులు 30–40 మందితో డబ్బులు తీసుకుని దర్శనాలకు తీసుకెళ్లడం బహిరంగ రహస్యం. అయితే కూటమి ప్రభుత్వం వచ్చాక నారా చంద్రబాబు నాయుడు భక్తుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని వీఐపీ దర్శనాలను గణనీయంగా తగ్గించి, సామాన్య భక్తులకు ప్రాధాన్యం ఇచ్చారు’అని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ చెప్పుకొచ్చారు. ముక్కోటి ఏకాదశి రోజున లక్షలాది మంది భక్తులు వచ్చినా ఎక్కడా ఏ చిన్న అపశృతి కూడా జరగకుండా. ప్రశాంత వాతావరణంలో ఉత్తర ద్వార దర్శనం జరిగిందని గుర్తు చేశారు. అయినా సరే ఒక చిన్న ఫోటోను ఆధారంగా చేసుకుని వైసీపీ నేతలు, వారి అనుబంధ మీడియా అర్థంలేని ఆరోపణలు చేస్తూ తొక్కిసలాట జరుగుతుందన్న భయాన్ని సృష్టించే ప్రయత్నం చేశారని ఆరోపించారు. ఇది పూర్తిగా విష ప్రచారమేనని, భక్తుల మనోభావాలతో చెలగాటమాడే నీచ రాజకీయమని అన్నారు. శ్రీవారి దర్శనం, ప్రసాదం విషయంలో చిన్న తప్పిదం జరిగినా హిందువులు తమ ఇంట్లో జరిగినట్టే భావిస్తారని వైసీపీ గుర్తించాల్సిన అవసరం ఉందని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు.