సాక్షి డిజిటల్ న్యూస్ : సంక్రాంతి సందర్భంగా సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శాఖ తీపికబురు చెప్పింది. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ప్రయాణీకుల సౌలభ్యం కోసం 17 బుకింగ్ కౌంటర్లు మరియు 20 ఆటోమేటిక్ టికెట్ వెండింగ్ మెషీన్లు (ఏటీవీఎం) ఏర్పాటు చేసింది.రైల్ వన్ మొబైల్ అప్లికేషన్ ద్వారా డిజిటల్ చెల్లింపు పద్ధతులను ఉపయోగించి బుక్ చేసుకున్న ఆన్ రిజర్వ్ డ్ టిక్కెట్లపై ఇండియన్ రైల్వేస్ 3 శాతం తగ్గింపును ప్రకటించింది. సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు అన్నీ ప్రయాణికులతో కిటకిటలాడుతుంటాయి. సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులతో రద్దీగా ఉంటాయి. ఇసుకేస్తే రాలనంతగా ప్రయాణికులతో బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు రద్దీగా ఉంటాయి.రాబోయే రోజుల్లో మరింత రద్దీ పెరిగే అవకాశం ఉంది. దక్షిణ మధ్య రైల్వే సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీ పెరుగుతుందని అంచనా వేస్తున్నందున….ప్రయాణీకుల రద్దీని తగ్గించడానికి అనేక చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ప్రయాణీకుల సౌలభ్యం కోసం 17 బుకింగ్ కౌంటర్లు మరియు 20 ఆటోమేటిక్ టికెట్ వెండింగ్ మెషీన్లు (ఏటీవీఎం) ఏర్పాటు చేసింది.వీటితోపాటు టికెటింగ్ సేవల కోసం రైల్‌వన్ మొబైల్ అప్లికేషన్‌ను ఉపయోగించేలా ప్రయాణికులకు అవగాహన కల్పిస్తున్నారు. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే పీఆర్ఓ శ్రీధర్ ఓ ప్రకటనలో తెలియజేశారు. నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించాలి సంక్రాంతి పండుగ సందర్భంగా దక్షిణ మధ్య పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రత్యేక రైళ్లను నడపడమే కాకుండా రైల్ వన్ మొబైల్ అప్లికేషన్ ద్వారా డిజిటల్ చెల్లింపు పద్ధతులను ఉపయోగించి బుక్ చేసుకున్న ఆన్ రిజర్వ్ డ్ టిక్కెట్లపై ఇండియన్ రైల్వేస్ 3 శాతం తగ్గింపును ప్రకటించింది. ఈ తగ్గింపు 14 జనవరి 2026 నుండి 14 జూలై 2026 వరకు అమలులో ఉంటుంది. నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించడం మరియు ప్రయాణీకుల సౌకర్యాన్ని పెంచడం దీని లక్ష్యంగా దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది. డివిజనల్ హెడ్ క్వార్టర్స్‌లో పటిష్టమైన సీసీటీవీ నిఘా కంట్రోల్ రూమ్ ఏర్పాటు పండుగ సమయంలో సికింద్రాబాద్‌లో సగటున రోజుకు 2.20 లక్షల మంది ప్రయాణికులు, లింగంపల్లిలో 50,000 మంది మరియు చర్లపల్లి స్టేషన్లలో 35,000 మంది ప్రయాణికులు ఉంటారని అంచనా వేసింది. ప్రయాణికుల రద్దీని సరైన రీతిలో నిర్వహించడానికి…సికింద్రాబాద్ స్టేషన్‌లో టీటీఈ మరియు ఆర్.పీ.ఎఫ్ సిబ్బందితో కూడిన గ్రౌండ్ ఆపరేషన్స్ బృందాన్ని ఏర్పాటు చేశారు. అన్నిఎంట్రీ మరియు ఎగ్జిట్ పాయింట్ల వద్ద అదనపు టీటీఈలు మరియు ఆర్పీఎఫ్ సిబ్బందిని మోహరించారు. డివిజనల్ హెడ్‌క్వార్టర్స్‌లో పటిష్టమైన సీసీటీవీ నిఘా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయబడింది మరియు వార్ రూమ్ 24×7 పనిచేస్తుంది. భద్రతా చర్యగా నిర్మాణ స్థలాలను పూర్తిగా బారికేడ్ చేశారు మరియు ప్రయాణీకుల సజావైన రాకపోకలకోసం ప్రవేశ మరియు నిష్క్రమణ వద్దనున్న అన్ని అడ్డంకులను తొలగించినట్లు దక్షిణ మధ్య రైల్వే పీఆర్వో శ్రీధర్ పేర్కొన్నారు.