తెలుగు రాష్ట్రాల మధ్య విద్వేషాలకు చోటు లేదు: కీలక వ్యాఖ్యలు చేసిన సీఎం చంద్రబాబు

పయనించే సూర్యుడు న్యూస్ :తెలుగు రాష్ట్రాల మధ్య విద్వేషాలు కాదు, సమైక్యత అవసరం అని సీఎం చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. గంగా-కావేరి కలవాలని దేశంలో నీటి సమస్య పోవాలని సీఎం చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చారు. తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా గోదావరి నదీ జలాల విషయంలో రాద్దాంతం జరుగుతున్న సంగతి తెలిసిందే. కృష్ణా, గోదావరి నదీ జలాల విషయాల్లో తెలంగాణకు ఏపీప్రభుత్వం అన్యాయం చేస్తోందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. మరోవైపు టీడీపీకి తెలంగాణ సీఎం చంద్రబాబు నాయుడు సరెండర్ అయిపోయారంటూ వస్తున్న విమర్శలపై సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. తెలుగు రాష్ట్రాల మధ్య తెలంగాణ ప్రాజెక్టులకు తాను ఏనాడు అడ్డు చెప్పలేదని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు క్లారిటీ ఇచ్చారు. గుంటూరు జిల్లాలో జరిగిన తెలుగు మహాసభలో సోమవారం సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడారు. గతేడాది సుమారు కృష్ణా, గోదావరి నదుల నుంచి 6,282 టీఎంసీల నీరు సముద్రంలోకి వెళ్లాయని సీఎం చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. కృష్ణాగోదావరి నదుల అనుసంధానం చేస్తాం గోదావరి నీళ్లు పుష్కలంగా ఉన్నాయని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. గోదావరి నీళ్లను తెలంగాణ వాడుకున్నా తాను ఏనాడు అడ్డు చెప్పలేదని స్పష్టం చేశారు. విభజన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినా అభ్యంతరం చెప్పలేదు అని సీఎం పేర్కొన్నారు.ప్రతి ఏడాది గోదావరి నుంచి సముద్రంలోకి 3వేల టీఎంసీల నీళ్లు వృథాగా పోతున్నాయని చెప్పుకొచ్చారు. కృష్ణాగోదావరి నదులు అనుసంధానం జరుగుతుందని వెల్లడించారు. ఏపీలోని నదులన్నింటినీ అనుసంధానించాలని సూచించారు. కల్వకుర్తి లిఫ్ట్, ఏఎమ్మార్ ఎత్తిపోతల, నెట్టెంపాడు వంటి ప్రాజెక్టులను తాను పూర్తి చేశానని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. తెలుగే మాతృభాష కృష్ణా డెల్టా మోడరైజేషన్ పేరుతో నీటిని పొదుపు చేసి ఆ నీటిని తెలంగాణకు కేటాయించి బీమా లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేశామని సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడించా రు. గోదావరి నదిపై గుత్ప, అలీసాగర్, దేవాదుల ఎత్తిపోతల వంటి పథకాలను చేపట్టామని సీఎం వివరించారు. ఆంధ్ర ప్రాంతంలో చాగల్నాడు, పుష్కర, తాటిపూడి వంటి లిఫ్ట్ ప్రాజెక్టులు తీసుకువచ్చామన్నారు. పట్టిసీమ ప్రాజెక్టుతో కృష్ణా డెల్టాకు నీరిచ్చినట్లు తెలిపారు. విభజన తర్వాత కేంద్ర ప్రభుత్వం పోలవరానికి ప్రత్యేక నిధులిచ్చిందని చెప్పుకొచ్చారు. తెలుగు ప్రజలకు రెండు రాష్ట్రాలున్నా తెలుగే మాతృభాష అని తెలిపారు. రెండు రాష్ట్రాలు కలిసి ఉంటే ఎన్నో సమస్యలకు పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నా రు. ఎన్టీఆర్ సీఎం అయ్యాకే సాగర్ జలాలను ఉపయోగించుకునేలా ఎస్ఎల్బీసీ, ఎస్ఎర్బీసీ ప్రాజెక్టులు తెచ్చారని సీఎం చంద్రబాబు నాయుుడు ప్రస్తావించారు. కాళేశ్వరం కడితే అభ్యంతరం చెప్పలేదు పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. తెలుగు ప్రజలంతా అభివృద్ధిలో కలిసి నడవాలని సీఎం సూచించారు. రాష్ట్రం కలిసి ఉన్నప్పుడు చాలా ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టామని చెప్పుకొచ్చారు. రాష్ట్ర విభజన తర్వాత కాళేశ్వరం కడితే అందుకు తాము అభ్యంతరం చెప్పలేదని అన్నారు. గోదావరి నీళ్లను తెలంగాణ వాడుకుంటుందని తామెప్పుడు అభ్యంతరం చెప్పలేదని చెప్పుకొచ్చారు. గోదావరిలో పుష్కలంగా నీళ్లు ఉన్నాయని కాబట్టే అభ్యంతరం చెప్పలేదని వ్యాఖ్యానించారు.గోదావరి-పెన్నా, గంగా-కావేరి నదుల అనుసంధానం జరిగితే మంచి జరుగుతుందని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. గోదావరి నీళ్లు వాడుకుంటే అడ్డుచెప్పలేదు తెలుగువాళ్లు కలిసుంటే ఎన్నో సమస్యలు పరిష్కరించుకోవచ్చని సీఎం చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్‌ హయాంలో ఉమ్మడి ఏపీలో పలు ప్రాజెక్టులు కట్టినట్లు వివరించారు. చంద్రబాబు నాయుడు హయాంలో తెలంగాణలో కల్వకుర్తి, ఏఎంఆర్‌, నెట్టెంపాడు పూర్తి చేశామని సీఎం గుర్తు చేశారు.బీమా ఎత్తిపోతల కూడా చంద్రబాబు హయాంలోనే పూర్తయిందని చంద్రబాబు చెప్పుకొచ్చారు. గోదావరిపైనా ఉమ్మడి ఏపీలో అనేక ప్రాజెక్టులు కట్టామని గతేడాది కృష్ణా, గోదావరి నుంచి 6 వేల టీఎంసీలు సముద్రంలోకి వెళ్లాయని సీఎం చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చారు. గోదావరి నీళ్లు వాడుకుంటే నేను ఎప్పుడూ అడ్డుచెప్పలేదని విభజన తర్వాత కాళేశ్వరం కట్టినా గోదావరిలో చాలా నీళ్లున్నాయని అభ్యంతరం చెప్పలేదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. గోదావరిపై ఎన్ని ప్రాజెక్టులు కట్టినా పర్వాలేదని రాష్ట్రానికి నీళ్లు వస్తాయని అనుకున్నానని సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. మనలను గుర్తించే ఏకైక భాష తెలుగు పోలవరం ప్రాజెక్టు త్వరలో పూర్తవుతుంది అని సీఎం చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చారు.ప్రపంచంలో తక్కువ నీటి వినియోగం చేసే దేశం మన భారతదేశమేనని చెప్పుకొచ్చారు. ఎన్నో ఏళ్లుగా పోరాడుతున్నా గంగా, కావేరి కలవాలి దేశంలో నీటి సమస్య పరిష్కారం కావాలి ఏపీలో ఉండే నదులన్నీ అనుసంధానం కావాలి. తెలంగాణలో గోదావరి నీళ్లు కూడా వాడుకోవాల్సిన అవసరం ఉంటే వాడుకోవాలి. తెలుగు రాష్ట్రాల మధ్య విద్వేషాలు కాదు, సమైఖ్యత అవసరం’అని సీఎం చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు. రెండు తెలుగు రాష్ట్రాలు ఒకరినొకరు అర్థం చేసుకుని కలిసి ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఎంతోమంది త్యాగాలు చేశారు. ఇది రాజకీయ వేదిక కాదు. నీటి విషయంలో పరస్పరం సహకరించుకోవాలి. తెలుగువారంతా కలిసి ఉండాలి. ప్రపంచంలో ఎక్కడ ఉన్నా మనల్ని గుర్తించే ఏకైక భాష తెలుగు భాష అని సీఎం చంద్రబాబు నాయుడు కొనియాడారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *