పయనించే సూర్యుడు న్యూస్ : ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) బ్యాటరీలకు ఆధార్ తరహా నంబర్ కేటాయించాలని కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది. కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) బ్యాటరీలకు ఆధార్ తరహా నంబర్ కేటాయించేందుకు మార్గదర్శకాలు రూపొందించింది. ప్రొడక్షన్ నుండి నుండి డిస్పోజల్ వరకు మొత్తం ఈవీ బ్యాటరీ లైఫ్‌సైకిల్ మొత్తం ట్రాక్ చేయడానికి ఉద్దేశించిన డిజిటల్ ఐడెంటిఫికేషన్ ఫ్రేమ్‌వర్క్ అయిన బ్యాటరీ ప్యాక్ ఆధార్ సిస్టమ్ కోసం కేంద్రం ముసాయిదా మార్గదర్శకాలను విడుదల చేసింది. లిథియం-అయాన్ బ్యాటరీల మొత్తం డిమాండ్‌లో 80 నుండి 90 శాతం విద్యుత్ వాహనాల నుండే వస్తుంది. ఈ నేపథ్యంలో, భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఎలక్ట్రిక్ వెహికల్ (EV) రంగంలో పారదర్శకత, ట్రేసబిలిటీ , స్థిరత్వాన్ని పెంపొందించడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రాథమికంగా ఈవీ బ్యాటరీలను ఉద్దేశించే ఈ గైడ్‌లైన్స్ రూపొందించారు. వీటితో పాటు స్టార్టింగ్, లైటింగ్ మరియు ఇగ్నిషన్ (SLI) బ్యాటరీలు మరియు పోర్టబుల్ బ్యాటరీలను మినహాయించి 2kwh కంటే ఎక్కువ సామర్థ్యం కలిగిన ఇండస్ట్రియల్ బ్యాటరీలను కూడా కవర్ చేయవచ్చు. బ్యాటరీ ఆధార్ ప్యాక్ ఆధార్ నంబర్ (BPAN) బ్యాటరీ తయారీదారు లేదా దిగుమతిదారు మార్కెట్లోకి తెచ్చి ప్రతి బ్యాటరీ ప్యాక్‌కు 21 అక్షరాల బ్యాటరీ ప్యాక్ ఆధార్ నంబర్ (BPAN) తప్పనిసరిగా కేటాయించాలని నిర్ణయించింది. ఈ ప్రత్యేకమైన నంబర్‌ను బ్యాటరీపై స్పష్టంగా కనిపించేలా, తొలగించడానికి వీల్లేకుండా చేయనున్నారు. ఒక వేళ ఈవీ బ్యాటరీలు రీసైక్లింగ్ లేదా రీపర్బోజింగ్ వల్ల బ్యాటరీ లక్షణాలు మారితే కొత్త బ్యాటరీ ప్యాక్ ఆధార్ నంబర్‌ను కేటాయించాలి. దీని ద్వారా బ్యాటరీ ఎకో సిస్టమ్‌లో పారదర్శకత, జవాబుదారీతనం, స్థిరత్వ వస్తుందని కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ ఆశిస్తోంది. BPANలో తయారీదారు ఐడెంటిటీ, బ్యాటరీ స్పెసిఫికేషన్లు, మెటీరియల్ కంపోజిషన్, కార్బన్ ఫూట్ప్రింట్ వంటి స్టాటిక్ సమచారం ఉంటుంది. దీనితో పాటు బ్యాటరీ హెల్త్, థర్మల్ ఈవెంట్స్, ఛార్జ్-డిశ్చార్జ్ సైకిల్స్ ,ఎండ్-ఆఫ్-లైఫ్ స్టేటస్‌తో పాటు డైనమిక్ డేటా సెంట్రల్ సర్వర్‌లో స్టోర్ చేయబడుతుంది. దీని దవారా ప్రిడిక్టివ్ మేనేజ్మెంట్, సమర్థవంతమైన రీసైక్లింగ్ నిర్వహించబడుతుంది. దీని ద్వారా ఈవీ బ్యాటరీల విషయంలో నకిలీ ప్రొడక్ట్స్‌ను అరికట్టడం, వినియోగదారుల విశ్వాసం పెరుగుతుందని భావిస్తున్నారు. బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్స్ (BMS), ఏఐ- ఆధారిత డయాగ్నస్టిక్స్ , నేషనల్ EV డేటాబేస్‌లతో అనుసంధానించడం ద్వారా, బ్యాటరీ ప్యాక్ ఆధార్ భారతదేశం యొక్క అభివృద్ధి చెందుతున్న బ్యాటరీ ఇంటెలిజెన్స్ ఎకో సిస్టమ్‌కు వెన్నెముకగా నిలుస్తుంది. అడ్వాన్స్డ్ కెమిస్ట్రీ సెల్స్ (ACC) కోసం ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (PLI) స్కీమ్ వంటి ప్రభుత్వ కార్యక్రమాలు దేశీయ బ్యాటరీ ప్రొడక్షన్‌ను పెంచడంతోపాటు లోకల్ వాల్యూ అడిషన్ను పెంచడం లక్ష్యంగా పెట్టుకున్నారు.